సూపర్ జోడీ... | Tamannaah's Veerudokkade to release in Telugu | Sakshi
Sakshi News home page

సూపర్ జోడీ...

Published Sat, Mar 15 2014 11:57 PM | Last Updated on Sat, Sep 2 2017 4:45 AM

సూపర్ జోడీ...

సూపర్ జోడీ...

 ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన తమిళ చిత్రాల్లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది ‘వీరమ్’. అజిత్, తమన్నా జంటగా శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ‘వీరుడొక్కడే’ పేరుతో విడుదల కానుంది. భీమవరం టాకీస్‌పై  తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని అనువదించారు. ఈ నెల 21న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రచార చిత్రాలను బి. గోపాల్ ఆవిష్కరించారు. ఈ వేడుకలో కేవీవీ సత్యనారాయణ, టి.ప్రసన్నకుమార్, వీరశంకర్, బీఏ రాజు తదితరులు పాల్గొన్నారు. రామసత్యనారాయణ మాట్లాడుతూ -‘‘అనువాద హక్కులు నాకు దక్కడానికి ప్రధానం కారణం కేవీవీ సత్యనారాయణ. అజిత్, తమన్నాలది సూపర్ జోడీ అనిపిస్తుంది. మంచి యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా తమిళ వెర్షన్ తరహాలో తెలుగులోనూ ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement