నా అందం రెట్టింపయ్యింది: తాప్సీ | My grace enhanced twofold, says tapsi pannu | Sakshi
Sakshi News home page

నా అందం రెట్టింపయ్యింది: తాప్సీ

Oct 12 2013 1:46 PM | Updated on Sep 1 2017 11:36 PM

నా అందం రెట్టింపయ్యింది: తాప్సీ

నా అందం రెట్టింపయ్యింది: తాప్సీ

అందం చూడవయా ఆనందించవయా అన్నాడో కవి. అందానికి అంత రసజ్ఞత ఆపాదించారు. నేటి హీరోయిన్లు అలాంటి అందంతోనే రాణిస్తున్నారనేది నిజం.

అందం చూడవయా ఆనందించవయా అన్నాడో కవి. అందానికి అంత రసజ్ఞత ఆపాదించారు. నేటి హీరోయిన్లు అలాంటి అందంతోనే రాణిస్తున్నారనేది నిజం. అందానికి మరింత మెరుగులు దిద్దుకోవడానికి వారు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. తాప్సీ విషయానికొస్తే కోలీవుడ్‌లో విజయం కోసం చకోరపక్షిలా ఎదురు చూస్తోంది. తొలి చిత్రం ఆడుగళం అవార్డులను కొల్లగొట్టినా ఈ ముద్దుగుమ్మకు అంతగా లాభించలేదన్నది వాస్తవం.

 

తర్వాత నటించిన ఏ చిత్రమూ తాప్సీ కెరియర్‌కు ఉపయోగ పడలేదు. ఈ ఉత్తరాదిభామ తొలి చిత్రం ఆడుగళం విడుదల సమయంలో ఎంత ఉద్వేగానికి గురైంది. తాజా చిత్రం ఆరంభం విడుదల సమయంలోనూ అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. అజిత్‌, నయనతార జంటగా నటించిన చిత్రం ఆరంభం. ఇందులో మరో జంటగా ఆర్య, తాప్సీ నటించారు.

 

ఈ చిత్రం దీపావళికి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. తాప్సీ మాట్లాడుతూ ఆరంభంలో అజిత్‌, ఆర్య, నయనతార అంటూ సీనియర్లు నటించినా వారితో సమానమైన పాత్ర తనదని చెప్పింది. ఇందులో తాను విలేకరిగా నటించానని తెలిపింది. చిన్నతనం నుంచి జర్నలిస్టు అవ్వాలనే కోరిక ఉండడంతో ఈ చిత్రంతో ఆ పాత్రను ఒక లక్ష్యంగా తీసుకుని నటించానని వెల్లడించింది. ఆరంభంలో తన పాత్రకు మంచి పేరు వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే నిత్యం నృత్యంలో శిక్షణ పొందుతున్నానని పేర్కొంది. దీని వల్ల తన అందం ద్విగుణీకృతం కావడమే కాకుండా మనసు ఎంతో హారుుగా ఉంటోందని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement