kolliwood
-
దర్శకుడు హరికి సూర్యకు మధ్య మనస్పర్థలా? అంతా ఉత్తిదే! కాంబో రిపీట్
తమిళ సినిమా: నటుడు సూర్య, దర్శకుడు హరి సూపర్‌హిట్ కాంబినేషన్. ఇంతకు ముందు ఆరు, వేల్, సింగం సిరీస్ మొదలు హిట్ చిత్రాలు వచ్చాయి. సింగం-2 చిత్రం తరువాత వీరి కాంబినేషన్లో అరువా చిత్రం రూపొందనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత సూర్యకు దర్శకుడు హరికి మధ్య మనస్పర్థలు తలెత్తాయని, దీంతో అరువా చిత్రం ఆగిపోయిందని ప్రచారం జరిగింది. అన్నట్టుగానే వీరి కాంబినేషన్లో ఇప్పటి వరకు మరో చిత్రం రాలేదు. నటుడు సూర్య ఇతర చిత్రాలతో బిజీ అయిపోయారు. ప్రస్తుతం శివ దర్శకత్వంలో కంగువా అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. దీని తరువాత వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ చిత్రం చేయనున్నారు. ఇక దర్శకుడు హరి చివరిగా అరుణ్ విజయ్ హీరోగా యానై చిత్రాన్ని చేశారు. కాగా ఇటీవల తన సతీమణితో కలిసి ఓ రికార్డింగ్, ప్రివ్యూ స్టూడియోను ప్రారంభించారు. ఆ వేడుకకు నటుడు సూర్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. దీంతో వీరి మధ్య మనస్పర్థలు అనేవి వదంతులని తేలింది. కాగా దర్శకుడు హరి ఇప్పుడు వరుసగా మూడు కమర్షియల్ కథా చిత్రాలను తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. చదవండి: వైరముత్తు నవలలో విక్రమ్ నటిస్తారా? అందులో ముందుగా నటుడు విశాల్ హీరోగా చిత్రం చేయనున్నట్లు తెలుస్తోంది. వీరి కాంబినేషన్లో ఇంతకు ముందు పూజా, తామ్రరభరణి వంటి హిట్ చిత్రాలు రూపొందాయి. కాగా తదుపరి నటుడు సూర్య కథానాయకుడిగా ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అదే విధంగా నటుడు కార్తీ తాను హరి చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
మరోసారి వార్తల్లో నటి వనితా విజయ్‌కుమార్.. నెట్టింట్లో వైరల్
తమిళ సినిమా: ఎప్పుడూ ఏదో ఒక చర్యతో వార్తల్లో వుండే నటి వనితా విజయ్‌కుమార్. ఇప్పటికే మూడుసార్లు పెళ్లి చేసుకుని, ముగ్గురు భర్తలకు విడాకులు ఇచ్చి పలు విమర్శలను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం తన పిల్లలతో కలిసి జీవిస్తున్న వనితా విజయ్‌కుమార్ తన భర్త ఎవరని అడుగుతున్నారని ఆవేదనను వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో వనితా విజయకుమార్ మరోసారి వార్తల్లో కెక్కారు. ఆమె తన ఇంటిలో కుబేరుడి పూజ నిర్వహించారు. ఇక్కడ విశేషం ఏమిటంటే వనితా విజయకుమార్, ఆమె కూతురు మెడలో డబ్బు నోట్ల మాలలు ధరించి పూజ నిర్వహించారు. ఆ దృశ్యాలను ఆమె సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. -
డైరెక్షన్ టు టాలీవుడ్!
పొరుగింటి డైరెక్టర్ల డైరెక్షన్ మారింది. వాళ్ల డైరెక్షన్ టాలీవుడ్‌కి మారింది. ఎక్కడెక్కడి డైరెక్టర్లు ఇప్పుడు తెలుగులోకి వస్తున్నారు. తెలుగులో భారీ చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీ, కోలీ, మాలీ, శాండల్... ఈ అన్ని వుడ్స్ డైరెక్టర్లు మన తెలుగులో సినిమాలు చేస్తున్నారు. ఆ దర్శకుల గురించి తెలుసుకుందాం. తెలుగు పరిశ్రమలో తెలుగు దర్శకులే ఉన్నారా? అంటే.. కాదు. పరభాషా దర్శకులు కూడా అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఎక్కువమంది రావడం విశేషం. ‘బాహుబలి’ అద్భుత విజయం తర్వాత భారతీయ చిత్రపరిశ్రమ చూపు తెలుగుపై పడిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. తెలుగులో ప్యాన్ ఇండియన్ సినిమాల నిర్మాణం పెరిగింది. అందుకే ఇతర ఇండస్ట్రీల దర్శకులు కూడా కథలు రాసుకుని తెలుగు హీరోలకు వినిపిస్తున్నారు. తమ డైరెక్షన్‌ను టాలీవుడ్ వైపు తిప్పుకుంటున్నారు. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ కెరీర్లో ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాలది ప్రత్యేక స్థానం. ఈ రెండు చిత్రాలూ ఆయన్ను ఇతర భాషల్లోనూ పాపులర్ చేశాయి. ‘దృశ్యం’ సినిమా తమిళ రీమేక్ ‘పాపనాశం’ని తెరకెక్కించి, తమిళ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యారు జీతు. ఇందులో కమల్ హాసన్ నటించారు. ఇప్పుడు ‘దృశ్యం 2’ తెలుగు రీమేక్‌కు దర్శకత్వం వహించి, తెలుగు చిత్రపరిశ్రమలోకి దర్శకుడిగా తొలి అడుగు వేశారు జీతు. తెలుగు ‘దృశ్యం’ (ఈ చిత్రానికి సుప్రియ దర్శకురాలు) పార్ట్ వన్‌లో హీరోగా నటించిన వెంకటేశ్.. రెండో పార్టులోనూ హీరోగా నటించారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. ‘బాహుబలి’ బ్లాక్‌బస్టర్ ప్రభాస్‌ను ప్యాన్ ఇండియన్ స్టార్‌ని చేసింది. దీంతో పక్క ఇండస్ట్రీ దర్శకులు కూడా ప్రభాస్‌తో సినిమాలు చేయాలని ఉత్సాహం చూపిస్తున్నారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్ కోసం ఓ కథ రాసి, వినిపించారు. ప్రభాస్‌కి కథ నచ్చడంతో ఈ కన్నడ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న ‘సలార్’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల కానుంది. అలాగే బాలీవుడ్లో ‘తన్హాజీ’ చిత్రంతో టెక్నికల్‌గా మంచి గ్రిప్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఓం రౌత్‌తో ‘ఆదిపురుష్’ అనే మైథాలజీ ఫిల్మ్ చేస్తున్నారు ప్రభాస్. ఇలా ఒకేసారి ఇద్దరు పక్క ఇండస్ట్రీ దర్శకులతో ప్రభాస్ సినిమాలు చేయడం విశేషం. అలాగే హిందీ సినిమా ‘వార్’ ఫేమ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌తో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక 2021లో జరిగిన ఓ విశేషం.. శంకర్ తెలుగు సినిమా చేయనుండటం. ‘ఇండియన్’ ‘జీన్స్’, ‘రోబో’, ‘అపరిచితుడు’, ‘శివాజీ’ ఇలా చెప్పుకుంటూ పోతే దర్శకుడు శంకర్ కెరీర్లో బ్లాక్ బస్టర్ సినిమాలు చాలా ఉన్నాయి. ఈ చిత్రాలు తెలుగులో అనువాదమై సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. కానీ తన 28 ఏళ్ళ కెరీర్లో శంకర్ తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయడం ఇదే మొదటిసారి. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ ప్యాన్ ఇండియన్ మూవీ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రం ఓ సోషల్ డ్రామాగా రూపొందనుందనే ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఇక తమిళంలో ఉన్న మంచి మాస్ దర్శకుల్లో లింగస్వామి ఒకరు. అందుకు ఓ నిదర్శనం విశాల్‌తో ఆయన తెరకెక్కించిన తమిళ చిత్రం ‘సండై కోళి’ (తెలుగులో ‘పందెంకోడి’). ఆ తర్వాత లింగుస్వామి తెలుగులో ఓ స్ట్రయిట్ ఫిల్మ్ తీయాలనుకున్నారు. ఓ సందర్భంలో అల్లు అర్జున్‌తో లింగు స్వామి సినిమా ఓకే అయిందనే టాక్ కూడా వినిపించింది. కానీ వీరి కాంబినేషన్లోని సినిమా సెట్స్‌పైకి వెళ్ళలేదు. ఇప్పుడు రామ్ హీరోగా లింగుస్వామి సినిమా చేసేందకు సిద్ధమయ్యారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ‘అవళ్’ (తెలుగులో ‘గృహం’), ‘కాదల్ టు కల్యాణం’ వంటి సినిమాలను ప్రేక్షకులకు అందించిన మిళింద్ రావ్ డైరెక్షన్లో రానా హీరోగా ఓ సినిమా రానుంది. ఇందులో రానా పోలీసాఫీసర్ అనే ప్రచారం జరగుతోంది. ఇటీవల విడుదలైన రానా ‘అరణ్య’ చిత్రానికి దర్శకత్వం వహించింది కూడా తమిళ దర్శకుడు ప్రభు సాల్మాన్ కావడం విశేషం. వీళ్లు మాత్రమే కాదు.. మరికొందరు పరభాషా దర్శకులు తెలుగు సినిమాలు తెరకెక్కించే అవకాశం ఉంది. తెలుగులో పరభాషా కథానాయికలు, విలన్లు, సహాయ నటులు ఎక్కువమందే ఉన్నారు. ఇప్పుడు పొరుగింటి దర్శకుల జాబితా కూడా పెరుగుతోంది. మన తెలుగులో ప్రతిభావంతులు ఎక్కువే. అయితే ప్రతిభ ఎక్కడున్నా ప్రోత్సహించే మనసు ‘తెలుగు పరిశ్రమ’కు ఉంది కాబట్టే... ఇంతమంది పరభాషల వారు ఇక్కడ సినిమాలు చేయగలుగుతున్నారు. వీళ్లూ వస్తారా? తమిళ దర్శకులు అట్లీ, లోకేష్ కనగరాజ్ తాము తెలుగులో సినిమాలు చేయడానికి సిద్ధంగానే ఉన్నామని పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఒక దశలో అట్లీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, లోకేష్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోలుగా నటిస్తారనే వార్తలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ‘ఇరుంబుతిరై’ (తెలుగులో ‘అభిమన్యుడు’) ఫేమ్ పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఓ సినిమా రూపొందనుందని ఎప్పట్నుంచో ప్రచారం సాగుతోంది. సో... వీళ్లూ తెలుగులోకి వచ్చే చాన్స్ ఉంది. -
సీనియర్ దర్శకుడు కన్నుమూత
సీనియర్ దర్శకుడు, నటుడు ఓఎస్ఆర్ ఆంజనేయులు కన్నుమూశారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్య కారణంగా చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరగనున్నాయి. నాటకరంగం నుంచి సినీరంగానికి వచ్చిన ఆయన దర్శకత్వ శాఖలో కృష్ణ, విజయనిర్మల, వీ.రామచంద్రరావు, కే.హేమాంబదరరావు, కే.ఎస్,ఆర్.దాస్ తదితరుల దగ్గర పలు చిత్రాలకు పనిచేశారు. అనంతరం కన్నెవయసు, లవ్ ఇన్ సింగపూర్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. లవ్ ఇన్ సింగపూర్ చిరంజీవి నటించిన సంగతి తెలిసిందే. ఇక పలువురు ప్రముఖ హీరోల చిత్రాలలో కూడా నటుడిగా కనిపించి తన అభిరుచిని చాటుకున్నారు. దాదాపు 70కి పైగా చిత్రాలలో ఆయన నటించారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
నటి హీరాకు అజిత్ ప్రేమలేఖలు!
చెన్నై: నటుడు అజిత్‌కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. నాలుగు పదుల వయసు దాటినా ఇప్పటికీ ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. రీసెంట్గా అజిత్‌కు సంబంధించిన ఓ విషయం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. 1990లో నటి హీరా రాజ్‌గోపాల్‌తో అజిత్ నడపిన ప్రేమాయణం అప్పట్లో టాక్ ఆప్ ది టౌన్‌గా ఉండేది. అయితే ఆ సమయంలో హీరాకు అజిత్ ప్రేమలేఖలు రాసేవారట. ఈ విషయాన్ని నటి బాయిల్వాన్ రంగనాథన్ వెల్లడించారు. ఆ లెటర్స్‌లో ఒకదాన్ని తాను చదివానని పేర్కొనడంతో వీరి లవ్‌స్టోరి మరోసారి వార్తల్లో నిలిచింది. (అందుకు నేను బాధ్యున్ని కాను!) కాథల్ కొట్టై అనే సినిమాలో మొదటిసారి కలిసి నటించిన అజిత్ - హీరా షూటింగ్ సమయంలోనే పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఆ తర్వాత 'తోడారమ్' అనే మరో చిత్రంలోనూ కలిసి నటించారు. అయితే వీరి ప్రేమ బంధం పెళ్లిదాకా మాత్రం వెళ్లలేదు. వీరి వివాహానికి హీరా తల్లి నో చెప్పిందని, దీంతో వీరి లవ్ స్టోరికి ఫుల్స్టాప్ పడినట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. కాగా కొన్నేళ్లకు అజిత్ నటి షాలినిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి అనోష్కా, ఆద్విక్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నటిగా కెరియర్లో బిజీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకున్న షాలిని ఆ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. గృహిణిగా, నటిగా రెండు బాధ్యతలను తాను నిర్వహించలేనని అందుకే తన మొదటి ప్రయారిటీ కుటుంబమే అని షాలిని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. (అజిత్‌తో ఉన్నది ఎవరో తెలుసా?) -
అందుకు నేను బాధ్యున్ని కాను!
తమిళ సినిమా: అందుకు నేను బాధ్యున్ని కాదు అని నటుడు అజిత్ పేర్కొన్నారు. వివాదాలకు దూరంగా ఉండే నటుడు అజిత్. అలాంటిది అనివార్య కారణాల వల్ల ఆయన వార్తల్లోకి రావలసి వచ్చింది. కొందరు వ్యక్తులు తన పేరును తప్పుగా వాడుకుంటున్నారని అజిత్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఆయన తన లీగల్ పర్సన్ ద్వారా మీడియాకు గురువారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేయించారు. అందులో తన తరఫు న్యాయవాది భరత్ పేర్కొంటూ నేను అజిత్‌కుమార్ తరఫు అధికారిక న్యాయవాదిగా ఈ ప్రకటనను మీడియాకు విడుదల చేస్తున్నాను ఇటీవల కొందరు వ్యక్తులు తన క్లయింట్ అజిత్‌కుమార్ పేరును తప్పుగా వాడుకుంటున్నారు. అలాంటి వారు అజిత్ వర్గంగానో, ఆయన ప్రతినిధిగా ఆయన అనుమతి లేకుండా కొన్ని విషయాలను ప్రసారం చేస్తున్న విషయం దృష్టిలోకి వచ్చింది. అజిత్‌కుమార్ వ్యక్తిగత నిర్వాహకుడు సురేచంద్ర మాత్రమే. ఆయన మాత్రమే అజిత్‌కుమార్‌కు సంబంధించిన వృత్తిపరమైన విషయాలను వెల్లడిస్తారు. అజిత్‌కుమార్ పేరును వాడుతూ ఇతర వ్యక్తులో, సంస్థలో ఎవరినైనా సంప్రదిస్తే ఆ విషయాలను సురేస్చంద్రకు వెంటనే తెలియజేయాలి. దీన్ని మీరు ఎవరైనా అజిత్‌కి సంబంధించి వృత్తి పరంగా, వ్యాపార పరంగా గానీ చర్యలకు పాల్పడితే దీనిద్వారా సమస్యలు ఎదురైతే అందుకు అజిత్ కుమార్ కారణం కాదని ఆయన హెచ్చరించారు. -
కలైజ్ఞానం నివాసానికి రజనీకాంత్
సాక్షి, చెన్నై : ప్రముఖ నిర్మాత-రచయిత కలైజ్ఞానం నివాసానికి దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ఆదివారం విచ్చేశారు. కలైజ్ఞానం, ఆయన కుటుంబసభ్యులు ...రజనీకాంత్‌ను సాదరంగా ఆహ్వానించారు. కాగా రజనీకాంత్ ఆదిలో ప్రతినాయకుడిగా ఎదిగిన విషయం తెలిసిందే. అలాంటి రోజుల్లో ఆయనను హీరోగా పరిచయం చేసి ‘భైరవి’ (1978) అనే చిత్రాన్నికలైజ్ఞానం నిర్మించారు. ఆ చిత్రం రజనీకాంత్ సినీ జీవితాన్నే మార్చేసింది. అలాంటి నిర్మాత నివసించడానికి సొంతంగా ఒక ఇల్లు కూడా ఏర్పరచుకోలేకపోయారు. అద్దె ఇంట్లోనే జీవనం కొనసాగిస్తున్న కలైజ్ఞానంకు... రజనీకాంత్ సుమారు రూ.కోటి విలువ చేసే ఇంటిని కానుకగా ఇచ్చారు. ఆ నివాసానికే ఇవాళ రజనీకాంత్ వెళ్లారు. దీంతో రజనీ తన నివాసానికి రావడంతో కలైజ్ఞానం సంతోషం వ్యక్తం చేశారు. -
అజిత్ ''వీరం'' మూవీ మేకింగ్
-
జ్ఞాపకశక్తి కోల్పోయిన యువతిగా నికిషా పటేల్
ఉత్తరాది భామ నికిషాపటేల్ జ్ఞాపక శక్తిని కోల్పోయారట. యుక్త వయసులో ఆమెకు మెమొరీలాస్ అవ్వడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? పులి చిత్రం ద్వారా టాలీవుడ్లోకి ప్రవేశించిన ఈ గ్లామర్ డాల్ ప్రస్తు తం కోలీవుడ్‌పై దృష్టి సారిస్తోంది. తమిళం లో పలు అవకాశాలను చేజిక్కించుకున్న బబ్లీ హీరోయిన్ నారదన్ చిత్రంలో నకులన్తో రొమాన్స్ చేస్తోంది. ఈ చిత్రంలో జ్ఞాపక శక్తిని కోల్పోయిన యువతిగా నటిస్తోందట. దీని గురించి ఈ బాలీ వుడ్ భామ తెలుపుతూ నారదన్ చిత్రంలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తున్నట్లు చెప్పింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ చిత్రమని తెలిపింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చెన్నైలో జరుగుతోందని వెల్లడించారు. నకులన్తో నటిస్తున్న అనుభవం గురించి అడగ్గా ఆయన మంచి ఎనర్జిటిక్ నటుడన్నారు. అంతా కుటుంబ సభ్యులుగా కలిసిపోయి నటిస్తున్నట్లు చెప్పారు. నారదన్ చిత్రంలో నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. ఈ చిత్రంతోపాటు గౌతమ్ కార్తీక్ సరసన ఎన్నమో ఏదో చిత్రంలోనూ నటిస్తున్నట్లు తెలిపారు. ఇందులోను తనది చాలా బలమైన పాత్ర అని వివరిం చారు. గౌతమ్ కార్తీక్ గర్ల్ ఫ్రెండ్‌గా నటిస్తున్నట్లు తెలి పారు. మరో ద్విభాషా చిత్రం రంభ, ఊర్వశి, మేనకలో కూడా నటిస్తున్నట్లు చెప్పారు. ఇది పూర్తిగా లేడీ ఓరియంటెడ్ కథా చిత్రమని నికిషా పటేల్ వెల్లడించారు. -
కాజల్‌కు కష్టకాలం
కాజల్ అగర్వాల్‌కు కష్టకాలం నడుస్తోందంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఈ బ్యూటీపై చర్యలు తీసుకోవడానికి తమిళ నిర్మాతల మండలి సిద్ధమవుతోంది. చిత్ర ప్రచార కార్యక్రమాల్లో హీరోయిన్లు కచ్చితంగా పాల్గొనాలని, లేని పక్షంలో పారితోషికంలో 20 శాతం కట్ చేయూలని తమిళ నిర్మాతల మండలి నిర్ణయించింది. ఆల్ ఇన్ ఆల్ అళగురాజా చిత్రంలో హీరోయిన్గా కాజల్ నటించింది. ఇటీవల జరిగిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి కాజల్ డుమ్మా కొట్టింది. అలాగే శరణ్యామోహన్ కోలాహలం చిత్ర ఆడియో విడుదలకు గైర్హాజరైంది. కాజల్, శరణ్యామోహన్పై చర్యలు తీసుకోవడానికి తమిళ నిర్మాతల మండలి సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
అందాల ఆరబోతకు నయనతార రెడీ!
అందాల ఆరబోతకు నయనతార వెనకాడడం లేదు. ఈ క్రేజీ హీరోయిన్ ఇంతకముందు చాలా చిత్రాలలో గ్లామరస్‌గా నటించింది. అయితే అవన్నీ ఒక ఎత్తు. తాజాగా నటిస్తున్న అనామిక చిత్రంలో మరింత గ్లామరస్‌గా కనిపించనుందట. తమిళం, తెలుగు భాషలలో రూపొందుతున్న అనామిక కు బాలీవుడ్లో విశేష ప్రజాదరణ పొందిన కహాని చిత్రం ఆధారం. హిందీలో విద్యాబాలన్ హీరోయిన్. భర్త కోసం వెతుకుతున్న గర్భిణి పాత్రలో విద్యాబాలన్ అద్భుతంగా నటించింది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళభాషల్లో తెరకెక్కించడానికి శేఖర్ కమ్ముల నిర్ణయిచారు. హీరోయిన్ పాత్రకు నయన్‌ను ఎంపిక చేశా రు. జాతీయ అవార్డే లక్ష్యంగా నయనతార ఈ చిత్రంలో నటిస్తోందట. అదే సమయంలో అందాల ఆరబోత శ్రుతి మించిందంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. యూనిట్ సభ్యులను బయటకు పంపించి మరీ గ్లామరస్ సన్నివేశాలను తెరకెక్కించారని టాక్. మొత్తం మీద నయనతారను ప్రేక్షకులు మరోమారు గ్లామర్ పాత్రలో చూడనున్నారు. -
ఆ ఆశ లేదు
ఏ నటి అయినా నెంబర్‌వన్ హీరోయిన్ కావాలని కోరుకుంటుంది. కాజల్ అగర్వాల్ మాత్రం తనకలాంటి ఆశ లేదంటోంది. ప్రస్తుతం కోలీవుడ్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తోంది ఈ బ్యూటీ. విజయ్ సరసన జిల్లా, కార్తీక్‌కు జంటగా ఆల్ ఇన్ ఆల్ అళగు రాజా చిత్రాల్లో నటిస్తోంది. ఆల్ ఇన్ ఆల్ అళగురాజా దీపావళికి తెరపైకి రానుంది. కాజల్ అగర్వాల్ నెంబర్‌వన్ స్థానం కోసం ప్రయత్నిస్తోందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆమె స్పందిస్తూ తాను ఇంతక ముందు కార్తీ సరసన నాన్ మహాన్ అల్ల చిత్రంలో నటించానని గుర్తు చేసింది. మళ్లీ ఇప్పుడు ఆయనతో ఆల్ ఇన్ ఆల్ అళగురాజా చిత్రంలో నటించడం సంతోషంగా ఉందని పేర్కొంది. ఇందులో తాను చలాకీ అమ్మాయిగా అభిమానులు మెచ్చే పాత్రలో వస్తున్నట్లు చెప్పింది. జిల్లా చిత్రంలో మదురై యువతిగా కనిపించనున్నట్లు తెలిపింది. నటనకు ప్రాముఖ్యం ఉన్న పాత్రలు ఇంతకముందు వచ్చినా కాల్ షీట్స్ సమస్య కారణంగా అంగీకరించేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. ఇకపై అలాంటి పాత్రలు వస్తే వదులుకోనని స్పష్టం చేసింది. షూటింగ్ సెట్లో అందరితో సరదాగా మాట్లాడుతూ కలుపుగోలుగా ఉంటానంది. తాను నెంబర్‌వన్ స్థానం కోసం తాపత్రయ పడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని పేర్కొంది. నిజానికి అలాంటి ఆశే లేదని స్పష్టం చేసింది. కమలహాసన్ సరసన నటించే అవకాశాన్ని తిరస్కరించినట్లు జరుగుతున్న ప్రచారంలోనూ వాస్తవం లేదని చెప్పింది. హిందీలో అవకాశాలు వస్తున్నాయని, అయితే ప్రస్తుతం తాను దక్షిణాది చిత్రాలతో చాలా సంతృప్తిగా ఉన్నానని వివరించింది. -
నా అందం రెట్టింపయ్యింది: తాప్సీ
అందం చూడవయా ఆనందించవయా అన్నాడో కవి. అందానికి అంత రసజ్ఞత ఆపాదించారు. నేటి హీరోయిన్లు అలాంటి అందంతోనే రాణిస్తున్నారనేది నిజం. అందానికి మరింత మెరుగులు దిద్దుకోవడానికి వారు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. తాప్సీ విషయానికొస్తే కోలీవుడ్‌లో విజయం కోసం చకోరపక్షిలా ఎదురు చూస్తోంది. తొలి చిత్రం ఆడుగళం అవార్డులను కొల్లగొట్టినా ఈ ముద్దుగుమ్మకు అంతగా లాభించలేదన్నది వాస్తవం. తర్వాత నటించిన ఏ చిత్రమూ తాప్సీ కెరియర్‌కు ఉపయోగ పడలేదు. ఈ ఉత్తరాదిభామ తొలి చిత్రం ఆడుగళం విడుదల సమయంలో ఎంత ఉద్వేగానికి గురైంది. తాజా చిత్రం ఆరంభం విడుదల సమయంలోనూ అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. అజిత్, నయనతార జంటగా నటించిన చిత్రం ఆరంభం. ఇందులో మరో జంటగా ఆర్య, తాప్సీ నటించారు. ఈ చిత్రం దీపావళికి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. తాప్సీ మాట్లాడుతూ ఆరంభంలో అజిత్, ఆర్య, నయనతార అంటూ సీనియర్లు నటించినా వారితో సమానమైన పాత్ర తనదని చెప్పింది. ఇందులో తాను విలేకరిగా నటించానని తెలిపింది. చిన్నతనం నుంచి జర్నలిస్టు అవ్వాలనే కోరిక ఉండడంతో ఈ చిత్రంతో ఆ పాత్రను ఒక లక్ష్యంగా తీసుకుని నటించానని వెల్లడించింది. ఆరంభంలో తన పాత్రకు మంచి పేరు వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే నిత్యం నృత్యంలో శిక్షణ పొందుతున్నానని పేర్కొంది. దీని వల్ల తన అందం ద్విగుణీకృతం కావడమే కాకుండా మనసు ఎంతో హారుుగా ఉంటోందని తెలిపింది. -
కోలీవుడ్‌కు సీతమ్మ వాకిట్లో..
తెలుగునాట ఆనందం కురిపించిన చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ చిత్రం ఇప్పుడు ఆనందం ఆనందమేగా పేరుతో కోలీవుడ్‌కు రానుంది. వెంకటేశ్, మహేష్‌బాబు కలసి నటించిన ఈ చిత్రంలో సమంత, అంజలి హీరోయిన్లు. ప్రకాష్‌రాజ్ ప్రధాన భూమిక పోషించిన ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్ తెరకెక్కించారు. ఉమ్మడి కుటుంబంలోని ఆప్యాయతలను మనసుకు హత్తుకునేలా చూపారు. ఈ చిత్రాన్ని విజిక్రియేషన్స పతాకంపై దానపల్లి చంద్రశేఖర్, ప్రసాద్ ఆనందం ఆనందమే పేరుతో తమిళ ప్రేక్షకులకు అందిస్తున్నారు. చిత్రంలోని పాటలను సంగీత ప్రియులను అలరించారు. తమిళ వెర్షన్‌కు ఎ.ఆర్.కె.రాజరాజ సంభాషణలు అందిస్తున్నారు.