సీనియర్ దర్శకుడు కన్నుమూత | Senior Director Anjaneyulu Passed Away | Sakshi
Sakshi News home page

సీనియర్ దర్శకుడు ఆంజనేయులు కన్నుమూత

Published Fri, Dec 25 2020 5:14 PM | Last Updated on Fri, Dec 25 2020 5:49 PM

Senior Director Anjaneyulu Passed Away - Sakshi

సీనియర్ దర్శకుడు, నటుడు  ఓఎస్ఆర్ ఆంజనేయులు కన్నుమూశారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్య కారణంగా చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరగనున్నాయి. నాటకరంగం నుంచి సినీరంగానికి వచ్చిన ఆయన దర్శకత్వ శాఖలో కృష్ణ, విజయనిర్మల, వీ.రామచంద్రరావు, కే.హేమాంబదరరావు, కే.ఎస్,ఆర్.దాస్ తదితరుల దగ్గర పలు చిత్రాలకు పనిచేశారు. అనంతరం కన్నెవయసు, లవ్ ఇన్ సింగపూర్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. లవ్ ఇన్ సింగపూర్ చిరంజీవి నటించిన సంగతి తెలిసిందే. ఇక పలువురు ప్రముఖ హీరోల చిత్రాలలో కూడా నటుడిగా కనిపించి తన అభిరుచిని చాటుకున్నారు. దాదాపు 70కి పైగా చిత్రాలలో ఆయన నటించారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement