
తమిళ సినిమా: అందుకు నేను బాధ్యున్ని కాదు అని నటుడు అజిత్ పేర్కొన్నారు. వివాదాలకు దూరంగా ఉండే నటుడు అజిత్. అలాంటిది అనివార్య కారణాల వల్ల ఆయన వార్తల్లోకి రావలసి వచ్చింది. కొందరు వ్యక్తులు తన పేరును తప్పుగా వాడుకుంటున్నారని అజిత్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఆయన తన లీగల్ పర్సన్ ద్వారా మీడియాకు గురువారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేయించారు. అందులో తన తరఫు న్యాయవాది భరత్ పేర్కొంటూ నేను అజిత్‌కుమార్ తరఫు అధికారిక న్యాయవాదిగా ఈ ప్రకటనను మీడియాకు విడుదల చేస్తున్నాను
ఇటీవల కొందరు వ్యక్తులు తన క్లయింట్ అజిత్‌కుమార్ పేరును తప్పుగా వాడుకుంటున్నారు. అలాంటి వారు అజిత్ వర్గంగానో, ఆయన ప్రతినిధిగా ఆయన అనుమతి లేకుండా కొన్ని విషయాలను ప్రసారం చేస్తున్న విషయం దృష్టిలోకి వచ్చింది. అజిత్‌కుమార్ వ్యక్తిగత నిర్వాహకుడు సురేచంద్ర మాత్రమే. ఆయన మాత్రమే అజిత్‌కుమార్‌కు సంబంధించిన వృత్తిపరమైన విషయాలను వెల్లడిస్తారు. అజిత్‌కుమార్ పేరును వాడుతూ ఇతర వ్యక్తులో, సంస్థలో ఎవరినైనా సంప్రదిస్తే ఆ విషయాలను సురేస్‌చంద్రకు వెంటనే తెలియజేయాలి. దీన్ని మీరు ఎవరైనా అజిత్‌కి సంబంధించి వృత్తి పరంగా, వ్యాపార పరంగా గానీ చర్యలకు పాల్పడితే దీనిద్వారా సమస్యలు ఎదురైతే అందుకు అజిత్ కుమార్ కారణం కాదని ఆయన హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment