అభిమానమంటే ఇదే! | ajith fans celebrate he's doughter birthday | Sakshi
Sakshi News home page

అభిమానమంటే ఇదే!

Published Fri, Mar 4 2016 9:26 AM | Last Updated on Sun, Sep 3 2017 6:55 PM

అభిమానమంటే ఇదే!

అభిమానమంటే ఇదే!

చెన్నై: కోలీవుడ్‌లో సినీ అభిమానమే వేరు. ఒక్క సారి అభిమాని అయితే మరచిపోవడమో, మరలడమో తక్కువనే చెప్పాలి. అలా హీరోలనే కాదు వారి వారసులపైనా అభిమానం ఇసుమంత కూడా తగ్గకుండా కొనసాగుతుంది. ఇప్పుడు అజిత్ విషయంలోనూ అదే జరుగుతోంది. అజిత్, షాలినీల కొడుకు అద్విక్ బుధవారం పుట్టిన రోజు జరుపుకున్నాడు. అజిత్ దంపతులు కుమారుడు పుట్టిన రోజును కుటుంబసభ్యులతో నిరాడంబరంగా జరిగింది. మార్చి2, 2015న అద్విక్కు షాలినీ జన్మనిచ్చిన విషయం తెలిసిందే.  అయితే అద్విక్ బర్త్ డే సందర్భంగా చెన్నైతో పాటు తమిళనాడులో వివిధ ప్రాంతాల్లో అదిరిపోయేలా అభిమానులు  వేడుకలు నిర్వహించారు.

అజిత్ అభిమానులు కుట్టీ తలా(చిన్న నాయకుడు) అంటూ పెద్దగా పోస్టర్లు వేసి పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు. ఈ పోస్టర్లు చెన్నైలో కొన్ని చోట్ల కనిపించినా, మదురైలో భారీగా గోడలపై వెలిశాయి. కొందరు అభిమానులు అజిత్‌కు ఇష్టం అయిన బిరియానీతో 151 మందికి విందును ఇచ్చారు. అభిమానం అంటే ఇదన్న మాట. నిజానికి అజిత్ తన అభిమాన సంఘాలను రద్దు చేసి చాలా కాలం అయ్యింది. అయినా అసలు సిసలు అభిమానం ఎక్కడికి పోతుంది. వద్దంటే పోయేది అభిమానమే కాదని అజిత్ అభిమానులు ఈ విధంగా నిరూపిస్తున్నారు.

కాగా తమిళ చిత్ర పరిశ్రమలో ప్రేమించి పెళ్ళి చేసుకున్న జంటలో అన్యోన్యంగా జీవిస్తున్న వారిలో అజిత్, షాలిని దంపతులున్నారు. 1999లో 'అమర్కాలం' అనే చిత్ర షూటింగ్లో పరిచయం అయిన అజిత్, షాలినీ అనంతరం ప్రేమలోపడి 2000లో పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికే వీరికి ఎనిమిది సంవత్సరాల పాప కూడా ఉంది. ఆమె పేరు అనౌష్క.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement