అందరికీ కనిపించే షకీలా.. తెర వెనుక కన్నీటి జీవితం తెలుసా? | Actress Shakeela Birthday Special Story About Her Career | Sakshi
Sakshi News home page

Shakeela: వెండితెర షకీలా.. అసలు ఆమె ఎక్కడ పుట్టిందో తెలుసా?

Nov 19 2023 1:50 PM | Updated on Nov 19 2023 2:27 PM

Actress Shakeela Birthday Special Story About Her Career - Sakshi

సౌత్ ఇండస్ట్రీలో ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని నటి షకీలా. ఇటీవలే తెలుగు బిగ్ బాస్ సీజన్‌-7లో కంటెస్టెంట్‌గా టాలీవుడ్ అభిమానులను పలకరించింది. అయితే మొదట అడల్డ్ మూవీల్లో కనిపించిన షకీలా.. ఒకప్పుడు మలయాళ సినిమా పరిశ్రమలో ఆమె పెద్ద సంచలనం. సినిమా టైటిల్స్‌లో ఆమె పేరు ఉంటే చాలు బాక్సాఫీస్ షేక్ అ‍య్యేది. తమిళనాడుకు చెందిన షకీలా సౌత్‌ చిత్రసీమను తన గ్లామర్‌తో ఊపేసింది.

అయితే నవంబర్ 19న, 1973లో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెంలో జన్మించింది. ఆమె తన బాల్యమంతా నెల్లూరులోనే పెరిగింది. తమిళంలో "ప్లేగర్ల్స్" అనే చిత్రంతో షకీలా సినీ ప్రస్థానం మొదలెంది. తమిళ, మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ సినిమాల్లో నటించింది. ఇవాళ ఆమె పుట్టిన రోజు సందర్భంగా సినీ ప్రస్థానంపై ఓ లుక్కేద్దాం. 

ఆమె తన తన పేరు శృంగార తారగానే అభిమానుల్లో ముద్ర పడిపోయింది. కానీ తన జీవిత కథ అందరికీ తెలియాలని ఆత్మకథ వ్రాసినట్టు చెప్పుకున్నది. తనకు పదహారేళ్ల వయసులోనే తల్లే స్వయంగా వ్యభిచారంలోకి పంపినట్లు వెల్లడించింది. తాను నటించిన సినిమాలు కేవలం తన శరీరాన్ని శృంగార తారగా చూపేందుకు పరిమితమయ్యాయని.. తనలో నటిని బయటికి తీసేందుకు ఎవ్వురూ ప్రయత్నించలేదని షకీలా తన ఆత్మకథలో రాసుకొచ్చింది.

అప్పట్లోనే దక్షిణాదిలో ఎక్కువ పారితోషికం తీసుకొన్న నటిగా షకీలా గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు షకీలా నటించిన చాలా సినిమాలు అశ్లీలతతో కూడుకొని ఉండేవి. అయితే చాలా ఏళ్ల నుంచి అలాంటి చిత్రాలకు ఆమె దూరంగా ఉంది. షకీలా ఇప్పుడు తమిళం, తెలుగు చిత్రాలతో పాటు పలు రియాల్టీ షోలలో మెప్పిస్తుంది. పలు టెలివిజన్ కార్యక్రమాల ద్వారా హాస్య పాత్రలు చేస్తూ.. కుటుంబ ప్రేక్షకులకు ఇష్టమైన నటిగా మారింది. 

తన జీవితంలో తన ఆమె తల్లితో పాటు సోదరినే చాలా ఎక్కువగా మోసం చేసిందని ఆమె చెప్పింది. షకీలా కూడబెట్టిన మొత్తం డబ్బును తన సోదరి తీసుకుని మోసం చేసినట్లు ఇది వరకే చెప్పింది. ఇటీవల షకీలా తెలుగు బిగ్‌బాస్ సీజన్‌ 7లో కనిపించింది. కానీ రెండో వారంలోనే ఆమె ఎలిమినేట్‌ అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement