శంకర్‌ తదుపరి హీరో ఎవరు? | Who's Shankar's Next Actor –vikram, kamalhasan or Ajith? | Sakshi
Sakshi News home page

శంకర్‌ తదుపరి హీరో ఎవరు?

Published Sun, Sep 17 2017 4:36 AM | Last Updated on Tue, Sep 19 2017 4:39 PM

శంకర్‌ తదుపరి హీరో ఎవరు?

శంకర్‌ తదుపరి హీరో ఎవరు?

తమిళసినిమా: స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ తదుపరి చిత్రం ఏమిటీ? ఏ హీరోతో చేయబోతున్నారన్నది దక్షిణ సినీ పరిశ్రమలో ఆసక్తిగా మారింది. శంకర్‌ చిత్రాల్లో సామాజిక అంశాలు ఉంటాయి. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది. ఇలా ప్రేక్షకులను విస్మయపరిచే, ఆలోచింపజేసే, ఆహ్లాదపరచే అంశాలు ఉంటాయి కాబట్టే చేసింది తక్కువ చిత్రాలే అయినా ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూసే చిత్రాల దర్శకుడిగా ఎదిగారు.

తాజాగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా 2.ఓ చిత్రాన్ని నభూతో నభవిష్యత్‌ అనే స్థాయిలో సిల్వర్‌ సెల్యులాయిడ్‌పై ఆవిష్కరిస్తున్నారు. ఎమీజాక్సన్‌ కథానాయకిగా, బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌  ప్రతినాయకుడిగానూ నటిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకుని (ఒక్క పాట మినహా) నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. జనవరిలో భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో శంకర్‌ తదుపరి చిత్రం ఏమిటన్న అంశంపై చాలా కథనాలే ప్రచారంలో ఉన్నాయి.

అజిత్‌తో ముదల్వన్‌–2:
శంకర్‌ విశ్యనటుడు కమలహాసన్, సూపర్‌స్టార్‌ రజనీకాంత్, విజయ్, విక్రమ్, అర్జున్, ప్రశాంత్, ఇలా చాలా మంది ప్రముఖ నటులతో చిత్రాలు చేశారు. అయితే అజిత్‌ హీరోగా ఇప్పటికీ చిత్రం చేయలేదు. వీరి కాంబినేషన్‌లో చిత్రం ఉంటుందనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. అది వాస్తవరూపం దాల్చలేదు. కాగా తాజాగా అజిత్‌ నటించిన వివేగం ఈ మధ్యనే విడుదలైంది. ఆయన తదుపరి చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. దీంతో శంకర్, అజిత్‌ కలయికలో భారీ చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయనే ప్రచారం తాజాగా జోరందుకుంది. శంకర్‌ దర్శకత్వంలో ముదల్వన్‌–2 చిత్రం రూపొందే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

కమలహాసన్‌ హీరోగా ఇండియన్‌–2
శంకర్‌ తదుపరి కమలహాసన్‌ హీరోగా ఇండియన్‌–2 చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారన్నది. నిజానికి ఈ విషయమై శంకర్‌ కమలహాసన్‌ను కలిసి మాట్లాడారట. ఆయనతో చిత్రం ఖరారు చేసుకుందాం అనుకుంటున్న సమయంలో కమల్‌ తాజాగా రాజకీయాలపై దృష్టిసారిస్తున్నారు. ఆయన రాజకీయ పార్టీని ప్రారంభించడానికి రెడీ అవుతుండటంతో శంకర్‌ తన ఇండియన్‌–2 చిత్ర ప్రయతాలకు బ్రేక్‌ వేసినట్లు కోలీవుడ్‌ వర్గాల టాక్‌.

విక్రమ్‌తో అన్నియన్‌–2
ఇక మరో వెర్షన్‌ ఏమిటంటే విక్రమ్‌ హీరోగా అన్నియన్‌–2 చిత్రానికి శంకర్‌ సిద్ధం అవుతున్నారన్నది. అన్నియన్‌ చిత్రానికి సీక్వెల్‌ చిత్రం వస్తుందనే ప్రచారం చాలా కాలంగానే జరుగుతోంది. కాగా విక్రమ్‌ ప్రస్తుతం స్కెచ్, ధ్రువనక్షత్రం చిత్రాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. తాజాగా సామి–2కు రెడీ అవుతున్నారు. తదుపరి శంకర్‌ దర్శకత్వంలో అన్నియన్‌–2 చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నిజానికి ఇవన్నీ ఊహాగానాలే. పైన చెప్పిన వాళ్లలో ఏ ఒక్కరూ ఈ వార్తలపై స్పందించలేదు. ఖండించనూ లేదు. ఇంతకీ శంకర్‌ తదుపరి చిత్రం ఏమిటన్నది ఇప్పటికి..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement