హన్సికకు ఆ వయస్సు వచ్చిందా?
అందానికి ప్రతి రూపం హన్సిక అనడంలో అతిశయోక్తి ఉండదేమో.తన కళ్లలో కొంటెదనం, లాస్యంతో కలిగే పరవశం కుర్రకారు గుండెల్ని తీయని బాధతో ఇట్టే పిండేస్తాయి. హన్సిక కోలీవుడ్‌లో నటుడు అజిత్ మినహా యువ హీరోలందరితోనూ నటించారు. అయితే ఇంతకు ముందు చేతి నిండా చిత్రాలతో బిజీబిజీగా ఉన్న ఈ ఉత్తరాది భామ ఎందుకనో ఇటీవల నటిగా కాస్త వెనుక బడ్డారు. ప్రస్తుతం జయంరవితో రొమాన్స్ చేస్తున్న భోగన్ చిత్రం ఒక్కటే తన చేతిలో ఉంది. కారణాలేమిటన్న ప్రశ్నకు ఈ సౌందర్యరాశి తీసుకున్న నిర్ణయమేనని తెలియవచ్చింది. హన్సిక తను ఎంపిక చేసుకునే చిత్రాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారట. ఇప్పటి వరకూ చాలా చిత్రాలు చేశాననిఇకపై కథలో తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే నటించడానికి పచ్చజెండా ఊపాలని నిర్ణయించుకున్నారట. నటి జ్యోతిక నటించిన 36 వయదినిలే, అమలాపాల్ నటించిన అమ్మాకణక్కు, త్రిష ప్రస్తుతం నటిస్తున్న నాయకి చిత్రాల తరహాలో కథానాయకికి ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లోనే నటించాలని ఆశిస్తున్నారట.
అంతాబాగానే ఉంది. ఈ బ్యూటీ అప్పుడే అలాంటి పాత్రల వయసుకు చేరుకున్నారా? అసలు తన ఈ నిర్ణయం సరైనదేనా? అన్న ప్రశ్నలు పరిశ్రమ వర్గాలలో హల్‌చల్ చేస్తోంది. ఏదేమైనా నటి హన్సిక నిర్ణయం తనను ఏ దిశకు తీసుకెళుతుందోనన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.