Jayamravi
-
ఆసక్తి రేకెత్తిస్తున్న టిక్..టిక్..టిక్
తమిళసినిమా: టిక్ టిక్ టిక్ చిత్ర ఫస్ట్‌లుక్‌ను చిత్ర వర్గాలు సోమవారం విడుదల చేశాయి. ఈ పోస్టర్ ఆసక్తిని రేకెత్తించడంతో పాటు, చిత్రంపై అంచనాలను పెంచేస్తోందంటున్నారు పరిశ్రమ వర్గాలు. జయంరవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం టిక్ టిక్ టిక్. ఇదే పేరుతో ఇంతకుముందు నటుడు కమలహాసన్ నటించిన చిత్రం మంచి విజయాన్ని సాధించిందన్నది గమనార్హం. తాజాగా తెరకెక్కుతున్న టిక్ టిక్ టిక్లో జయంరవికి జంటగా నటి నివేదాపేతురాజ్ నాయకిగా నటిస్తోంది. విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో జయంరవి కొడుకు మాస్టర్ ఆరవ్ కీలక పాత్రలో పరిచయం అవుతున్నాడు. శక్తి సౌందర్‌రాజన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నెమిచంద్ జబక్ పతాకంపై వీ.హింటేశ్జబక్ నిర్మిస్తున్నారు. కాగా జయంరవి, శక్తి సౌందర్‌రాజన్‌ల కాంబినేషన్లో ఇంతకుముందు మిరుదన్ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. జోంబీస్ల ఇతివృత్తంగా తెరెక్కిన ఈ సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్ కథా చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కాగా మళ్లీ వీరి కాంబినేషన్లో రూపొందుతున్న టిక్ టిక్ టిక్ చిత్రం అంతరిక్షంలో గురించి తెలిపే తొలి తమిళ చిత్రంగా నమోదు కానుంది. డీ.ఇమాన్ సంగీత భాణీలను అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ తుదిదశకు చేరుకుంది. ప్రస్తుతం చెన్నైలో బ్రహ్మాండమైన సెట్లో చిత్రీకరణ జరుపుకుంటోందని చిత్ర వర్గాలు తెలిపాయి. మరో పక్క నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదల చేశారు. జయంరవి అంతరిక్షకుడి గెటప్‌లో తాడు పట్టుకుని ఎగబాకుతున్న దృశ్యంతో కూడిన ఫస్ట్‌లుక్ పోస్టర్ సంమ్థింగ్ స్పెషల్‌గా ఎట్రాక్ట్ చేస్తోంది. -
ఆ తప్పు ఇక్కడ చేయను!
తమిళసినిమా: అక్కడ చేసిన తప్పు ఇక్కడ చేయనంటోంది బాలీవుడ్ బ్యూటీ సాయేషా సైగల్. లెజెండ్రీ నటుడు దిలీప్‌కుమార్ కుటుంబం నుంచి వచ్చిన ఈ తరం నటి సాయేషా. నటిగా తన రంగప్రవేశానికి ఏరి కోరి టాలీవుడ్‌ను ఎంచుకుని అఖిల్ చిత్రంతో తెరంగేట్రం చేసింది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో సాయేషా ప్రతిభ వెలుగులోకి రాలేదు. ఆ తరువాత మాతృభాషలో అజయ్‌దేవ్‌గన్‌కు జంటగా శివాయ్ చిత్రంలో నటించింది. ఆ చిత్రం ఓకే అనిపించుకుంది. అయినా సాయేషాకు ఈ రెండు భాషల్లోనూ అవకాశాలు తలుపు తట్టాయట. ఈ రెండు భాషా చిత్రాల అనుభవాన్ని చవి చూసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా కోలీవుడ్‌లో అడుగు పెట్టింది. ఇక్కడ జయంరవికి జంటగా వనయుద్ధం చిత్రంలో నటించింది. విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 23న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అయితే ఇందులో హీరో జయంరవికి చాలా తక్కువ మాటలు, సాయేషాకు చాలా ఎక్కువ మాటలు ఉంటాయట. అంతేకాదు, ఇందులో పాటల సన్నివేశాల్లో డాన్స్‌లో సాయేషా కుమ్మేసిందట. ఆ పాట కొరియోగ్రాఫర్ డాన్సింగ్ కింగ్ ప్రభుదేవానే అబ్బురపడేలా నటించిందట. ఈ టాక్ కోలీవుడ్‌లో వైరల్ అవడంతో అమ్మడికి అవకాశాలు వరుస కడుతున్నాయి. ఇప్పటికే విశాల్, కార్తీ కలిసి నటిస్తున్న మల్టీస్టార్ చిత్రం కరుప్పురాజా వెళ్లైరాజా చిత్రంలో నటించడానికి ఎంపికైంది.మరో మూడు చిత్రాల్లో నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయట. ఇలా కోలీవుడ్‌లో అనూహ్యంగా అవకాశాలు తలుపు తడుతుండడంతో అక్కడ చేసిన తప్పు ఇక్కడ చేయను అంటోంది నటి సాయేషా. ఇంతకీ ఆ తప్పేంటంటే టాలీవుడ్, బాలీవుడ్‌ల్లో అవకాశాలు వచ్చినా అంగీకరించలేదట. ఇప్పుడు కోలీవుడ్‌లో వస్తున్న అవకాశాలను వదులుకునేది లేదని ఈ జాణ అంటోంది. మొత్తం మీద మూడు చిత్రాలకే చాలా ఆరితేరిపోయింది కదూ. -
హన్సికకు ఆ వయస్సు వచ్చిందా?
అందానికి ప్రతి రూపం హన్సిక అనడంలో అతిశయోక్తి ఉండదేమో.తన కళ్లలో కొంటెదనం, లాస్యంతో కలిగే పరవశం కుర్రకారు గుండెల్ని తీయని బాధతో ఇట్టే పిండేస్తాయి. హన్సిక కోలీవుడ్‌లో నటుడు అజిత్ మినహా యువ హీరోలందరితోనూ నటించారు. అయితే ఇంతకు ముందు చేతి నిండా చిత్రాలతో బిజీబిజీగా ఉన్న ఈ ఉత్తరాది భామ ఎందుకనో ఇటీవల నటిగా కాస్త వెనుక బడ్డారు. ప్రస్తుతం జయంరవితో రొమాన్స్ చేస్తున్న భోగన్ చిత్రం ఒక్కటే తన చేతిలో ఉంది. కారణాలేమిటన్న ప్రశ్నకు ఈ సౌందర్యరాశి తీసుకున్న నిర్ణయమేనని తెలియవచ్చింది. హన్సిక తను ఎంపిక చేసుకునే చిత్రాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారట. ఇప్పటి వరకూ చాలా చిత్రాలు చేశాననిఇకపై కథలో తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే నటించడానికి పచ్చజెండా ఊపాలని నిర్ణయించుకున్నారట. నటి జ్యోతిక నటించిన 36 వయదినిలే, అమలాపాల్ నటించిన అమ్మాకణక్కు, త్రిష ప్రస్తుతం నటిస్తున్న నాయకి చిత్రాల తరహాలో కథానాయకికి ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లోనే నటించాలని ఆశిస్తున్నారట. అంతాబాగానే ఉంది. ఈ బ్యూటీ అప్పుడే అలాంటి పాత్రల వయసుకు చేరుకున్నారా? అసలు తన ఈ నిర్ణయం సరైనదేనా? అన్న ప్రశ్నలు పరిశ్రమ వర్గాలలో హల్చల్ చేస్తోంది. ఏదేమైనా నటి హన్సిక నిర్ణయం తనను ఏ దిశకు తీసుకెళుతుందోనన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. -
అతనంటే పిచ్చి ప్రేమ... అందుకే ఆ పచ్చబొట్లు!
త్రిషకు పచ్చబొట్లంటే చాలా ఇష్టం. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పచ్చబొట్లు వేయించుకుంటుంది. ఇక్కడున్న ఫొటోని క్షుణ్ణంగా గమనిస్తే.. త్రిష ఎద భాగంలో ‘నీమో ఫిష్’ టాటూ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పచ్చబొట్టుని మాత్రం త్రిష చెరిపేయలేదు. ఆ విధంగా గత కొన్నేళ్లుగా ఆ చేప పిల్ల స్థానం పర్మినెంట్ అయిపోయింది. ఇప్పుడు త్రిష దేహంపై తాత్కాలిక పచ్చబొట్లు ప్రత్యక్షం అయ్యాయి. ఈసారి ఏకంగా తమిళ హీరో ‘జయం’ రవి బొమ్మను పచ్చబొట్టుగా వేయించుకుంది. ఈ బ్యూటీ చేతులు, తొడ, పొట్ట భాగాల్లో రవి దర్శనమిస్తున్నారు. అతనిపై ప్రేమ వల్లే త్రిష ఇలా చేసింది. అయితే అది రియల్ ప్రేమ కాదు.. రీల్ ప్రేమ. ఈ ఇద్దరూ జంటగా ‘భూలోగం’ అనే చిత్రం రూపొందుతోంది. ఇందులో రవి అంటే తనకెంత ప్రేమో త్రిష వ్యక్తం చేసే సన్నివేశం ఒకటుంది. ‘చూడు.. నీ మీద ప్రేమతో నా దేహాన్ని ఎలా హింస పెట్టుకున్నానో..’ అంటూ రవికి త్రిష ఆ పచ్చబొట్లు చూపించే సీన్ అది. దర్శకుడు కల్యాణ కృష్ణన్ ఈ పచ్చబొట్లు గురించి చెప్పగానే ముందు కుదరదనేశారట త్రిష. కానీ, సినిమాలో ఆ సన్నివేశానికి గల ప్రాధాన్యతను వివరించి చెప్పడంతో ఆమె ఈ పచ్చబొట్లకు పచ్చజెండా ఊపేశారని సమాచారం. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది.