అతనంటే పిచ్చి ప్రేమ... అందుకే ఆ పచ్చబొట్లు! | Jayamravi's Tattoo on Actress Trisha Thighs | Sakshi
Sakshi News home page

అతనంటే పిచ్చి ప్రేమ... అందుకే ఆ పచ్చబొట్లు!

Aug 17 2014 10:48 PM | Updated on Sep 2 2017 12:01 PM

అతనంటే పిచ్చి ప్రేమ... అందుకే ఆ పచ్చబొట్లు!

అతనంటే పిచ్చి ప్రేమ... అందుకే ఆ పచ్చబొట్లు!

త్రిషకు పచ్చబొట్లంటే చాలా ఇష్టం. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పచ్చబొట్లు వేయించుకుంటుంది. ఇక్కడున్న ఫొటోని క్షుణ్ణంగా గమనిస్తే.. త్రిష ఎద భాగంలో

త్రిషకు పచ్చబొట్లంటే చాలా ఇష్టం. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పచ్చబొట్లు వేయించుకుంటుంది. ఇక్కడున్న ఫొటోని క్షుణ్ణంగా గమనిస్తే.. త్రిష ఎద భాగంలో ‘నీమో ఫిష్’ టాటూ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పచ్చబొట్టుని మాత్రం త్రిష చెరిపేయలేదు. ఆ విధంగా గత కొన్నేళ్లుగా ఆ చేప పిల్ల స్థానం పర్మినెంట్ అయిపోయింది. ఇప్పుడు త్రిష దేహంపై తాత్కాలిక పచ్చబొట్లు ప్రత్యక్షం అయ్యాయి. ఈసారి ఏకంగా తమిళ హీరో ‘జయం’ రవి బొమ్మను పచ్చబొట్టుగా వేయించుకుంది. ఈ బ్యూటీ చేతులు, తొడ, పొట్ట భాగాల్లో రవి దర్శనమిస్తున్నారు.
 
 అతనిపై ప్రేమ వల్లే త్రిష ఇలా చేసింది. అయితే అది రియల్ ప్రేమ కాదు.. రీల్ ప్రేమ. ఈ ఇద్దరూ జంటగా ‘భూలోగం’ అనే చిత్రం రూపొందుతోంది. ఇందులో రవి అంటే తనకెంత ప్రేమో త్రిష వ్యక్తం చేసే సన్నివేశం ఒకటుంది. ‘చూడు.. నీ మీద ప్రేమతో నా దేహాన్ని ఎలా హింస పెట్టుకున్నానో..’ అంటూ రవికి త్రిష ఆ పచ్చబొట్లు చూపించే సీన్ అది. దర్శకుడు కల్యాణ కృష్ణన్ ఈ పచ్చబొట్లు గురించి చెప్పగానే ముందు కుదరదనేశారట త్రిష. కానీ, సినిమాలో ఆ సన్నివేశానికి గల ప్రాధాన్యతను వివరించి చెప్పడంతో ఆమె ఈ పచ్చబొట్లకు పచ్చజెండా ఊపేశారని సమాచారం. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement