
త్రిష..క్లాప్ బోర్డ్..కెమెరా
త్రిష.. ఒకప్పటి కుర్రకారు కలలరాణి. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లయినా అభినయంతోపాటు అందంలో కూడా ఏమాత్రం వన్నెతగ్గని మెరుపుతీగ. అందుకే ఇప్పటికీ దక్షిణాది సినిమాల్లో అడపాదడపా హీరోయిన్గా కనబడుతూనే ఉంది. ఎప్పుడూ తనదైన నటనతో అభిమానుల మనసు కొల్లగొట్టే త్రిష.. ఈసారి ఓ టాటూతో అందరి మనసూ దోచేసింది.
తన శరీరంపై క్లాప్ బోర్డును,కెమెరాను టాటూ వేయించుకుని ప్రొఫెషన్ను తాను ఎంతగా ప్రేమిస్తుందో చెప్పకనే చెప్పింది ఈ అందాలతార. ఆ ఫొటోను ట్విట్టర్లోను,ఇన్స్టాగ్రామ్లోను పోస్ట్ చేసి తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. ఇంకేముంది.. ఫ్యాన్స్ మరోసారి ఫిదా!. గతంలోనూ త్రిషా తన ఎదపై టాటూ వేయించుకుంది. ఇప్పటికి మూడు సార్లు టాటూ వేయించుకున్న ఆమె మొట్టమొదట ‘నెమో’ అనే కార్టూన్ చేపను తన శరీరంపై పొడిపించుకున్న విషయం విదితమే.
@trishtrashers went a step ahead by getting a tattoo signifying her profession,way to go 👏🏻👌🏻 #actor #dedication pic.twitter.com/BdkLDYKw44
— Trisha Online✨ (@trishakonline) January 4, 2016