వంద అబద్ధాలు కాదు... నూటొక్క కారణాలు! | tweet about trisha's marriage | Sakshi
Sakshi News home page

వంద అబద్ధాలు కాదు... నూటొక్క కారణాలు!

Published Mon, Jun 12 2017 12:25 AM | Last Updated on Tue, Sep 5 2017 1:22 PM

వంద అబద్ధాలు కాదు... నూటొక్క కారణాలు!

వంద అబద్ధాలు కాదు... నూటొక్క కారణాలు!

వంద అబద్ధాలాడైనా ఓ పెళ్లి చేయమని పెద్దలు చెబుతుంటారు. కొంతమంది పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోవడానికి వంద కారణాలు చెబుతారు. అయితే హీరోయన్‌ త్రిష మాత్రం తాను పెళ్లి చేసుకోకపోవడానికి 101 రీజన్స్‌ ఉన్నాయని చెబుతున్నారు. మూడు పదుల వయసు దాటినా ఈ చెన్నై సుందరి ఇప్పటికీ టాప్‌ హీరోయిన్‌లలో ఒకరిగా ఉంటున్నారు. పెళ్లి కబురు మాత్రం చెప్పడం లేదు.

అయితే ఆదివారం ట్విట్టర్‌లో అభిమానులతో ముచ్చటించిన సందర్భంలో త్రిష తన పెళ్లి గురించి స్పందించారు. ఓ అభిమాని ‘మీరంటే నాకు చాలా ఇష్టం. కనీసం నేను పెళ్లి చేసుకునేవరకైనా మీరు చేసుకోకండి’ అని రిక్వెస్ట్‌ చేశాడు. దీనికి త్రిష బదులిస్తూ ‘నేను పెళ్లి చేసుకోకపోవడానికి వంద కారణాలు ఉన్నాయి. నీ రిక్వెస్ట్‌తో ఆ లిస్ట్‌ 101కి చేరింది’ అని బదులిచ్చారు. సో.. త్రిష పెళ్లి చేసుకోకపోవడానికి నూటొక్క కారణాలు ఉన్నాయన్నమాట. మరి.. కారణాల చిట్టా పెరుగుతుందో, ఇంతటితో ఆగుతుందో కాలమే చెప్పాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement