ఆ తర్వాతే పెళ్లి.. త్రిష శపథం! | Actress Trisha Postponed Her Marriage, Focus On Career, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Trisha On Her Marriage: ఆ తర్వాతే పెళ్లి.. : త్రిష షాకింగ్‌ నిర్ణయం!

Published Sun, Feb 11 2024 7:30 AM | Last Updated on Sun, Feb 11 2024 11:44 AM

Trisha Postponed Her Marriage, Focus On Career - Sakshi

తమిళసినిమా: నటి త్రిష. ఈ పేరు వింటేనే కళ్లముందు కథలెన్నో కదలాడుతాయి. అంతగా సంచలనానికి సొంతం ఈ చైన్నె సుందరి. ఆదిలో అందాల పోటీల్లో చైన్నె సుందరిగా గెలిచి కిరీటం దక్కించుకుంది. తర్వాత నటిగా కింది స్థాయి నుంచి కెరీర్‌ను ప్రారంభించారు. అలా నటి సిమ్రాన్‌కు స్నేహితురాలిగా జోడి చిత్రంలో ఒకటి రెండు సీన్స్‌లో కనిపించారు. అలా దర్శకుడు ప్రియదర్శన్‌ దృష్టిలో పడింది. లేసా లేసా చిత్రంలో కథానాయకిగా నటించే అవకాశాన్ని అందుకున్నారు. అయితే సూర్యకు జంటగా నటించిన మౌనం పేసియదే చిత్రం ముందుగా తెరపైకి వచ్చి తొలి విజయాన్ని దక్కించుకుంది. ఆ తరువాత సామి చిత్ర విజయం త్రిషకు స్టార్‌ హీరోయిన్‌ను చేసింది. ఇది నటిగా ఈమెకు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకపోయింది.

తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ ఇలా పలు భాషా చిత్రాల్లో నటించి భారతీయ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. జీవితంలో ఎత్తు పల్లాలనేవి ఎవరికై నా సహజం కాబట్టి ఈ బ్యూటీ చిన్న అపజయాలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా వ్యక్తిగతంగా ఒడుదుడుకులు ఎదుర్కొన్నారు. అందులో ఒకటి పెళ్లి. ఇది ఈమె జీవితంలో ఎండమావిగానే మారింది. చాలా కాలం క్రితమే వరుణ్‌మణియన్‌ అనే నిర్మాత, వ్యాపారవేత్తతో వివాహ నిశ్చితార్థం జరిగి పెళ్లి అంచులు వరకు వెళ్లి సడెన్‌గా బ్రేక్‌ పడింది. ఆ తరువాత నటిగానూ కొన్ని స్ట్రగుల్స్‌ ఎదుర్కొన్న త్రిష ఇటీవల పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంతో మళ్లీ పూర్వ వైభవాన్ని అందుకున్నారు. ఆ పుణ్యం మాత్రం దర్శకుడు మణిరత్నందే. ఆ తరువాత విజయ్‌, అజిత్‌, కమలహాసన్‌ వంటి టాప్‌స్టార్స్‌తో జత కడుతూ తనూ బిజీగా ఉన్నారు.

తెలుగులో చిరంజీవి, మలయాళంలో మోహన్‌లాల్‌, హిందీలో సల్మాన్‌ఖాన్‌ వంటి ప్రముఖ హీరోల సరసన నటించే అవకాశాలు వరించాయి. దీంతో లేడీ సూపర్‌స్టార్‌గా వెలిగిపోతున్న నయనతారను పక్కన పెట్టి ఆ పట్టాన్ని కై వసం చేసుకోవాలనే ఆశ త్రిష మనసులో చాలా కాలంగా ఉన్న కోరిక అంట. ఆ సమయం దగ్గర పడిందని ఈ బ్యూటీ భావిస్తున్నారని టాక్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. దీనికి కారణం లేకపోలేదు. త్రిష విజయపథంలో సాగుతుంటే నయనతార వరుసగా అపజయాలను ఎదుర్కొంటున్నారు. దీంతో లేడీ సూపర్‌స్టార్‌ అనిపించుకున్న తరువాతే పెళ్లి అని త్రిష శపథం చేసుకున్నట్లు తాజాగా జరుగుతున్న ప్రచారం. మరి ఈ నాలుగు పదుల పరువాల ప్రౌడ శపథం నెరవేరేనా? పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement