ఫోను దొరికే వరకు పెళ్లి చేసుకోను!  | Man Tweets He Wont Marry Unless He Has Mi 10T Pro | Sakshi
Sakshi News home page

ఫోను దొరికే వరకు పెళ్లి చేసుకోను! 

Published Tue, Dec 22 2020 10:32 AM | Last Updated on Tue, Dec 22 2020 12:49 PM

Man Tweets He Wont Marry Unless He Has Mi 10T Pro - Sakshi

న్యూఢిల్లీ: ఇష్టపడే ఫోనుపై కస్టమర్‌ మోజు ఎంతదూరం పోతుందనేందుకు కమల్‌ అహ్మద్‌ ఉదంతం నిదర్శనంగా చెప్పవచ్చు. స్మార్ట్‌ ఫోన్‌ యుగంలో రోజుకు పలు మోడళ్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. కొన్ని ఫోన్లయితే కస్టమర్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అలాంటి వీరాభిమానుల్లో కమల్‌ ఒకరు. ఎంఐ కంపెనీకి పెద్ద అభిమానైన కమల్‌ సదరు కంపెనీ రూపొందించిన ఎంఐ 10టీ ప్రో ఫోను తన చేతికి వచ్చేవరకు పెళ్లి కూడా చేసుకోనని ప్రతినబూనాడు. ఇదే ఆశ్చర్యమనుకుంటే, అంతకుమించిన ఆశ్చర్యాన్నిస్తూ సదరు కంపెనీ కమల్‌కు నచ్చిన ఫోనును పంపింది. ‘‘ఎంఐ 10టీ ప్రో ఫోను దొరికే వరకు పెళ్లి చేసుకోను’’ అని డిసెంబర్‌ 11న కమల్‌ ట్వీటాడు. డిసెంబర్‌ 21న ఫోను తన చేతికి వచ్చిందని చెబుతూ దాని గుణగణాలు వర్ణిస్తూ మరో ట్వీట్‌ చేశాడు. చదవండి: 5జీ స్మార్ట్‌ఫోన్‌ కావాలంటున్నారు

షామీ ఇండియా హెడ్‌ మను కుమార్‌ జైన్‌కు కృతజ్ఞతలు కూడా చెప్పాడు. ఆయన కూడా సరదాగా ప్రతిస్పందిస్తూ ఇక కమల్‌ పెళ్లికి రెడీ కావచ్చని ట్వీట్‌ చేశాడు. ఇంతకీ కంపెనీ ఆయనకు నిజంగా ఫ్రీగా ఫోను ఇచ్చిందా? లేదా అని ఆరాతీయగా, ఎంఐ ఫ్యాన్‌ అయిన కమాల్‌ కంపెనీకి సంబంధించిన పలు ఇమేజ్‌ బిల్డింగ్‌ కార్యక్రమాల్లో పాల్గొంటాడని, అనుకోకుండా తనకు లక్‌ కలిసివచ్చి ఫోను పొందేందుకు కూపన్‌ గెలుచుకున్నాడని కంపెనీ ప్రతినిధి చెప్పారు. ఎలాగైతేనేం కమల్‌ విషయంలో మాత్రం ‘కమాల్‌’ జరిగిందనుకోవచ్చు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement