MI Smartphone
-
ఫోను దొరికే వరకు పెళ్లి చేసుకోను!
న్యూఢిల్లీ: ఇష్టపడే ఫోనుపై కస్టమర్ మోజు ఎంతదూరం పోతుందనేందుకు కమల్ అహ్మద్ ఉదంతం నిదర్శనంగా చెప్పవచ్చు. స్మార్ట్ ఫోన్ యుగంలో రోజుకు పలు మోడళ్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. కొన్ని ఫోన్లయితే కస్టమర్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అలాంటి వీరాభిమానుల్లో కమల్ ఒకరు. ఎంఐ కంపెనీకి పెద్ద అభిమానైన కమల్ సదరు కంపెనీ రూపొందించిన ఎంఐ 10టీ ప్రో ఫోను తన చేతికి వచ్చేవరకు పెళ్లి కూడా చేసుకోనని ప్రతినబూనాడు. ఇదే ఆశ్చర్యమనుకుంటే, అంతకుమించిన ఆశ్చర్యాన్నిస్తూ సదరు కంపెనీ కమల్‌కు నచ్చిన ఫోనును పంపింది. ‘‘ఎంఐ 10టీ ప్రో ఫోను దొరికే వరకు పెళ్లి చేసుకోను’’ అని డిసెంబర్ 11న కమల్ ట్వీటాడు. డిసెంబర్ 21న ఫోను తన చేతికి వచ్చిందని చెబుతూ దాని గుణగణాలు వర్ణిస్తూ మరో ట్వీట్ చేశాడు. చదవండి: 5జీ స్మార్ట్‌ఫోన్ కావాలంటున్నారు Finally received this monster. 🤩 The Mi 10T Pro display is indeed impressive. Most gorgeous phone. The amazing #108MP flagship #Mi10TPro. So many features. Under 40K, #Mi10T Pro is pretty good value for a phone. 👌 🥰 Thank you so much @manukumarjain @XiaomiIndia 🙏🙏 I ❤️ Mi pic.twitter.com/RkiyE6RiDx — #MiFan Kamal Ahamad (@kamalahamad65) December 21, 2020 షామీ ఇండియా హెడ్ మను కుమార్ జైన్‌కు కృతజ్ఞతలు కూడా చెప్పాడు. ఆయన కూడా సరదాగా ప్రతిస్పందిస్తూ ఇక కమల్ పెళ్లికి రెడీ కావచ్చని ట్వీట్ చేశాడు. ఇంతకీ కంపెనీ ఆయనకు నిజంగా ఫ్రీగా ఫోను ఇచ్చిందా? లేదా అని ఆరాతీయగా, ఎంఐ ఫ్యాన్ అయిన కమాల్ కంపెనీకి సంబంధించిన పలు ఇమేజ్ బిల్డింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటాడని, అనుకోకుండా తనకు లక్ కలిసివచ్చి ఫోను పొందేందుకు కూపన్ గెలుచుకున్నాడని కంపెనీ ప్రతినిధి చెప్పారు. ఎలాగైతేనేం కమల్ విషయంలో మాత్రం ‘కమాల్’ జరిగిందనుకోవచ్చు. haha! I think you are now ready to get married 😂😂 On a serious note, #Mi10TPro is probably the best flagship phone in India right now. I hope you like it. 🙏 Please do try out the #108MP camera and share your feedback with us. I ❤️ #Mi #Mi10 #Mi10T https://t.co/fsrOsQfVZP pic.twitter.com/mKVvZw9SH6 — Manu Kumar Jain (@manukumarjain) December 21, 2020 -
2 కొత్త ఫీచర్లతో Mi స్మార్ట్ బ్యాండ్ 5
ముంబై, సాక్షి: టెలికం కంపెనీ షియోమీ తయారీ ఎంఐ ఫిట్నెస్ బ్యాండ్ 5 తాజాగా రెండు కొత్త పీచర్స్‌ను జత చేసుకుంది. ఫర్మ్‌వేర్ అప్డేట్ ద్వారా ఫిట్నెస్ ట్రాకింగ్‌ను మరింత ఆధునీకరించింది. విజయవంతమైన ఎంఐ బ్యాండ్ 4కు పొడిగింపుగా.. స్లీక్ డిజైన్‌లో వచ్చిన ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 5లో రెండు ప్రధాన ఫీచర్స్‌ను అప్డేట్ చేసింది. 24గంటలపాటు నిద్రను ట్రాక్ చేసే స్లీప్ ట్రాకింగ్ సపోర్ట్ ఫీచర్‌ను ఏర్పాటు చేసింది. వెరసి ఈ సిరీస్‌లో వచ్చిన బ్యాండ్స్‌లో తొలిసారి స్లీప్ ట్రాకర్ ఫీచర్‌కు తెరతీసింది. ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 5 ఓలెడ్ డిస్ప్లేతో 1.2 అంగుళాల తెరను కలిగి ఉంటుంది. టచ్ బటన్ అడుగుభాగాన ఉంటుంది. యానిమేటెడ్ కేరక్టర్స్ ఎంఐ ఫిట్నెస్ బ్యాండ్ 5లో షియోమీ పలు సుప్రసిద్ధ కార్టూన్ కేరక్టర్స్‌తో కూడిన యానిమేటెడ్ వాచ్ ఫేసెస్‌కు వీలు కల్పించింది. ఫిట్నెస్ను ట్రాక్ చేసేందుకు 11 మోడ్స్ అందుబాటులో్ ఉంటాయి. మహిళలు మెన్స్ట్రువల్ సైకిల్స్‌ను ట్రాక్ చేసుకునేందుకు వీలుంది. శారీరక కదలికలు, హార్ట్‌రేట్ నమోదు చేసే పీఏఐ ఫంక్షనాలిటీని జత చేసింది. స్మార్ట్ఫోన్కుగల కెమెరా షట్టర్‌కు రిమోట్‌గా కూడా బ్యాండ్ 5ను వినియోగించవచ్చు. ఇక మరో ప్రధాన అంశం చార్జింగ్ టెక్నాలజీ. తాజా మోడల్లో చార్జింగ్ కోసం ట్రాకర్‌ను స్ట్రాప్స్ నుంచి వేరుచేయవలసిన అవసరముండదు. ఇతర స్మార్ట్ బ్యాండ్స్ తరహాలో మ్యాగ్నటిక్ డాక్‌ను అందిస్తోంది. తద్వారా స్ట్రాప్స్ తొలగించకుండానే బ్యాండ్‌ను డాక్లో ఉంచి చార్జింగ్ చేసుకోవచ్చు. -
షావోమి సేల్: అతి తక్కువ ధరలో స్మార్ట్ఫోన్లు
చైనా దిగ్గజం షావోమి ఐ లవ్ ఎంఐ డేస్ పేరుతో మూడు రోజుల సేల్‌ను ప్రకటించింది. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తోపాటు ఎంఐ స్టోర్లలో తగ్గింపు ధరల్లో ఈ ప్రత్యేక సేల్ నిర్వహిస్తుంది. నిన్న(ఫిబ్రవరి 11) మొదలైన ఈ సేల్ ఫిబ్రవరి 13 వరకు సాగుతుంది. రెడ్మి స్మార్ట్ఫోన్లు, ఎంఐ టీవీలు, ఎంఐ బ్యాండ్స్ , పవర్ బ్యాంక్స్‌తో పాటు ఇతర యాక్ససరీస్ పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. రెడ్ మి నోట్ 6 ప్రొ, పోకో ఎఫ్1లాంటి స్మార్ట్ఫోన్లపై రూ.3000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటు నో - కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. రెడ్ మి నోట్ 6 ప్రొ 6జీబీ /64 జీబీస్టోరేజ్ ధర రూ.12999 పోకో ఎఫ్ 1 6జీబీ /64 జీబీస్టోరేజ్ ధర రూ 19, 999 రెడ్మి నోట్ 5 ప్రొ 6జీబీ /64 జీబీస్టోరేజ్ ధర రూ.12,999 ఇంకా వీటిపై 2వేల రూపాయల ఎక్స్జేంజ్ ఆఫర్ ఉంది. ఇక షావోమి 43 అంగుళాల ఎంఐ 4ఏ టీవీని రూ. 22,999లకు లభ్యం. 49 అంగుళాల ఎంఐ 4ఏ టీవీని రూ. 30,999లకు అందిస్తోంది. ఇంకా 10ఎంఏహెచ్ సామర్థ్యం గల పవర్‌బ్యాంకును రూ.899కే అందిస్తోంది. పూర్తి సమాచారం ఎంఐ వెబ్సైట్లో లభ్యం. Don't make a 'M'istake! Get yourself India's most loved Note at an unbeatable price. Limited period offer. Grab it before it's gone. #ILoveMi@Flipkart: https://t.co/68WwnizXrChttps://t.co/cwYEXeds6Y: https://t.co/eptTGuK3Bu pic.twitter.com/xgldfQDEOv — Redmi India (@RedmiIndia) February 11, 2019 -
చైనా యాపిల్.. షియోమి వచ్చేసింది
న్యూఢిల్లీ: చైనా యాపిల్‌గా పేరు గాంచిన షియోమి కంపెనీ మంగళవారం భారత మార్కెట్లోకి అడుగిడింది. ఎంఐ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లోకి ఆవిష్కరించింది. చైనాలో బాగా ప్రాచుర్యం పొందిన ఎంఐ స్మార్ట్‌ఫోన్‌ను రూ.13,999కు అందిస్తోంది. వీటి విక్రయాలను ఈ నెల 22 నుంచి ప్రారంభిస్తామని పేర్కొంది. ఈ ఫోన్ల కొనుగోళ్లకు ముందస్తు రిజిస్ట్రేషన్లు ఇప్పటికే మొదలయ్యాయని, ఈ నెల 21 వరకూ రిజిస్టర్ చేసుకున్న వారే ఎంఐ 3 కొనుగోళ్లకు అర్హులని వివరించింది. ఎంఐ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓఎస్ ఆధారంగా షియోమి కస్టమైజ్ చేసిన ఎంఐయూఐ ఓఎస్‌పై పనిచేసే ఈ ఫోన్లో 5 అంగుళాల ఫుల్ హెచ్డీ 1080పి ఐపీఎస్ డిస్ప్లే, 2.3 గిగా హెర్ట్జ్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్, 800 ఏబీ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇం టర్నల్ స్టోరేజ్, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా 3,050ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం ఉత్పత్తుల విక్రయాల కోసం షియోమి కంపెనీ ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా 35 సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. మరికొన్ని వారాల్లో రెడ్ఎంఐ 1ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను, రెడ్ఎంఐ నోట్(ఫ్యాబ్లెట్)లను అందించనున్నామని తెలిపింది. 4.7 అంగుళాల రెడ్ఎంఐ 1ఎస్ ఫోన్‌ను రూ.6,999కు, 5.5 అంగుళాల డిస్ప్లే ఉన్న రెడ్ఎంఐ నోట్‌ను రూ.9,999కు విక్రయిస్తామని పేర్కొంది. షియోమి రెడ్ ఎంఐ 1 ఎస్ ఫోన్లో 4.7 అంగుళాల డిస్ప్లే, 1.6 గిగా హెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 1. 6 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లున్నాయి. ఇక రెడ్ఎంఐ నోట్ ఫ్యాబ్లెట్‌లో 5.5 అంగుళాల డిస్ప్లే, 1.7 గిగా హెర్ట్జ్మీడియా టెక్ ఆక్టకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 3100 ఎంఏహెచ్ బ్యాటరీ, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. రానున్న నెలల్లో 4 కే అల్ట్రా హెచ్డీ టీవీలను, సౌండ్ బార్లను, పవర్ బ్యాంక్లనూ ఈ కంపెనీ భారత మార్కెట్లోకి తేనుంది.