షావోమి సేల్‌: అతి తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్లు | Amazing offers on Xiaomi products for Valentinea Day | Sakshi
Sakshi News home page

షావోమి సేల్‌: అతి తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్లు

Published Tue, Feb 12 2019 1:45 PM | Last Updated on Tue, Feb 12 2019 4:37 PM

Amazing offers on Xiaomi products for Valentinea Day - Sakshi

చైనా దిగ్గజం  షావోమి ఐ లవ్‌ ఎంఐ డేస్‌ పేరుతో మూడు రోజుల సేల్‌ను ప్రకటించింది. ఈ కామర్స్‌ దిగ్గజం  ఫ్లిప్‌కార్ట్ తోపాటు ఎంఐ స్టోర్లలో తగ్గింపు ధరల్లో  ఈ ప్రత్యేక సేల్ నిర్వహిస్తుంది. నిన్న(ఫిబ్రవరి 11) మొదలైన ఈ సేల్ ఫిబ్రవరి 13 వరకు సాగుతుంది.  రెడ్‌మి స్మార్ట్‌ఫోన్లు, ఎంఐ టీవీలు, ఎంఐ బ్యాండ్స్‌ , పవర్‌ బ్యాంక్స్‌తో పాటు  ఇతర యాక్ససరీస్ పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. రెడ్‌ మి నోట్‌ 6 ప్రొ, పోకో ఎఫ్‌1లాంటి స్మార్ట్‌ఫోన్లపై   రూ.3000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటు నో - కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది.

రెడ్‌ మి నోట్‌ 6 ప్రొ 6జీబీ /64 జీబీస్టోరేజ్‌ ధర రూ.12999
పోకో ఎఫ్‌ 1 6జీబీ /64 జీబీస్టోరేజ్‌ ధర రూ 19, 999
రెడ్‌మి నోట్‌ 5 ప్రొ 6జీబీ /64 జీబీస్టోరేజ్‌ ధర రూ.12,999 
ఇంకా వీటిపై  2వేల రూపాయల ఎక్స్జేంజ్‌ ఆఫర్‌ ఉంది. 

ఇక  షావోమి 43 అంగుళాల  ఎంఐ 4ఏ టీవీని రూ. 22,999లకు  లభ్యం.  49 అంగుళాల  ఎంఐ 4ఏ టీవీని రూ. 30,999లకు అందిస్తోంది.   ఇంకా 10ఎంఏహెచ్‌ సామర్థ్యం గల పవర్‌బ్యాంకును రూ.899కే అందిస్తోంది. పూర్తి సమాచారం ఎంఐ వెబ్‌సైట్‌లో లభ్యం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement