చైనా యాపిల్.. షియోమి వచ్చేసింది
న్యూఢిల్లీ: చైనా యాపిల్‌గా పేరు గాంచిన షియోమి కంపెనీ మంగళవారం భారత మార్కెట్లోకి అడుగిడింది. ఎంఐ స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్లోకి ఆవిష్కరించింది. చైనాలో బాగా ప్రాచుర్యం పొందిన ఎంఐ స్మార్ట్‌ఫోన్‌ను రూ.13,999కు అందిస్తోంది. వీటి విక్రయాలను ఈ నెల 22 నుంచి ప్రారంభిస్తామని పేర్కొంది. ఈ ఫోన్‌ల కొనుగోళ్లకు ముందస్తు రిజిస్ట్రేషన్లు ఇప్పటికే మొదలయ్యాయని, ఈ నెల 21 వరకూ రిజిస్టర్ చేసుకున్న వారే ఎంఐ 3 కొనుగోళ్లకు అర్హులని వివరించింది.
ఎంఐ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు
ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓఎస్ ఆధారంగా షియోమి కస్టమైజ్ చేసిన ఎంఐయూఐ ఓఎస్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో 5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ 1080పి ఐపీఎస్ డిస్‌ప్లే, 2.3 గిగా హెర్ట్జ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్, 800 ఏబీ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇం టర్నల్ స్టోరేజ్, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా 3,050ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి.
ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం
ఉత్పత్తుల విక్రయాల కోసం షియోమి కంపెనీ ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా 35 సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. మరికొన్ని వారాల్లో రెడ్‌ఎంఐ 1ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను, రెడ్‌ఎంఐ నోట్(ఫ్యాబ్లెట్)లను అందించనున్నామని తెలిపింది. 4.7 అంగుళాల రెడ్‌ఎంఐ 1ఎస్ ఫోన్‌ను రూ.6,999కు, 5.5 అంగుళాల డిస్‌ప్లే ఉన్న రెడ్‌ఎంఐ నోట్‌ను రూ.9,999కు విక్రయిస్తామని పేర్కొంది.
షియోమి రెడ్ ఎంఐ 1 ఎస్ ఫోన్‌లో 4.7 అంగుళాల డిస్‌ప్లే, 1.6 గిగా హెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 1. 6 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లున్నాయి. ఇక రెడ్‌ఎంఐ నోట్ ఫ్యాబ్లెట్‌లో 5.5 అంగుళాల డిస్‌ప్లే, 1.7 గిగా హెర్ట్జ్‌మీడియా టెక్ ఆక్టకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 3100 ఎంఏహెచ్ బ్యాటరీ, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. రానున్న నెలల్లో 4 కే అల్ట్రా హెచ్డీ టీవీలను, సౌండ్ బార్‌లను, పవర్ బ్యాంక్‌లనూ ఈ కంపెనీ భారత మార్కెట్లోకి తేనుంది.