షియోమి నుంచి రెడ్ ఎంఐ 2 విడుదల | Xiaomi launches Redmi 2, first tablet Mi Pad in India | Sakshi
Sakshi News home page

షియోమి నుంచి రెడ్ ఎంఐ 2 విడుదల

Published Thu, Mar 12 2015 3:44 PM | Last Updated on Sat, Sep 2 2017 10:43 PM

షియోమి నుంచి రెడ్ ఎంఐ 2 విడుదల

షియోమి నుంచి రెడ్ ఎంఐ 2 విడుదల

చైనా యాపిల్గా పేరొందిన షియోమి కంపెనీ కొత్తగా మరో రెండు డివైజ్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. రెడ్ ఎంఐ2 అనే స్మార్ట్ ఫోన్తో పాటు.. ఎంఐ ప్యాడ్ టాబ్లెట్ పేరుతో మొట్టమొదటి టాబ్ను కూడా విడుదల చేసింది. వీటింలో రెడ్ ఎంఐ 2 ధరను రూ. 6999గా నిర్ణయించారు. దీని రిజిస్ట్రేషన్ గురువారం సాయంత్రం 6 గంటల నుంచి మొదలవుతుంది. ఫ్లిప్కార్ట్లో మార్చి 24వ తేదీన ఫ్లాష్ అమ్మకాలు ఉంటాయి. మొదటి విడతలో 30 వేల నుంచి 40 వేల ఫోన్లు అమ్మే అవకాశం ఉన్నట్లు షియోమి ఇండియా హెడ్ మను జైన్ చెప్పారు. ఇందులో 4.7 అంగుళాల డిస్ప్లే, క్వాడ్ కోర్ 64 బిట్ స్నాప్డ్రాగన్ 410 ప్రాసెసర్, 4జి డ్యూయల్ సిమ్ ఉంటాయి. వెనుక కెమెరా 8 మెగాపిక్సెల్స్, ఫ్రంట్ కెమెరా 2 మెగాపిక్సెల్స్ ఉన్నాయి.

ఇక ఎంఐ ప్యాడ్ ధరను రూ. 12,999గా నిర్ణయించారు. దీనికి 7.9 అంగుళాల డిస్ప్లే ఉంటుంది. ఇది కూడా మార్చి 24నే అమ్మకానికి వస్తుంది. అయితే వీటిలో కేవలం వై-ఫై ఆధారంగానే నెట్ అందుబాటులోకి వస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement