అజిత్‌ చిత్రానికి డేట్‌ ఫిక్స్‌ | Ajith New Film Start | Sakshi
Sakshi News home page

అజిత్‌ చిత్రానికి డేట్‌ ఫిక్స్‌

Published Thu, Jul 11 2019 8:14 AM | Last Updated on Thu, Jul 11 2019 8:14 AM

Ajith New Film Start - Sakshi

చెన్నై : హీరో అజిత్‌ చిత్రం విడుదలవుతుందంటే ఆయన అభిమానులకు పండగే. తాజాగా అజిత్‌ నటించిన చిత్రం ‘నేర్కొండ పార్వై’. కొత్తదనానికి, సహజత్వానికి ప్రాధాన్యతనిచ్చే అజిత్‌ ఈసారి మరో వైవిధ్యభరతమైన కథా చిత్రంతో తెరపైకి రానున్నారు. ఇది బాలీవుడ్‌లో సంచలన విజయాన్ని అందుకున్న ‘పింక్‌’ చిత్రానికి రీమేక్‌. హిందీలో అమితాబ్‌ బచ్చన్‌ నటించిన పవర్‌ఫుల్‌ పాత్రను అజిత్‌ చేశారు. ఇక తాప్సీ పాత్రలో నటి శ్రద్ధాశ్రీనాథ్‌ నటించింది. మరో కీలక పాత్రలో నటి విద్యాబాలన్‌ కనిపించనుంది. ఈమె కోలీవుడ్‌లో నటించిన తొలి చిత్రం ఇది. విలన్‌ పాత్రలో దర్శకుడు ఆదిక్‌ రవిచంద్రన్‌ నటించిన ఈ చిత్రాన్ని హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో బోనీకపూర్‌ జీ.స్టూడియోస్‌ సంస్థతో కలిసి నిర్మించారు. అజిత్‌ న్యాయవాదిగా సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ గెటప్‌లో నటించారు.

చిత్ర చివరి ఘట్టంలో అజిత్‌ నట విశ్వరూపాన్ని ప్రదర్శించినట్లు చిత్ర యూనిట్‌ టాక్‌. మరో విశేషం ఏమిటంటే యువన్‌శంకర్‌రాజా సంగీ తం అందించిన ఇందులో ఆంగ్ల సాంగ్‌ చోటు చేసుకోవడం. కవలై వేండామే తోళా అనే ఈ పాటలో ర్యాప్‌ సంగీతా నికి తగ్గట్టుగా ఆంగ్ల పదాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయట. కాగా కాలం అనే పాట ఇటీవలే విడుదలై సంగీత ప్రియులను విపరీతంగా అలరిస్తోంది. ఇక నేర్కొండ పార్వై చిత్రం ట్రైలర్‌ ఇప్పటికే విడుదలై ప్రేక్షకుల్లో విశేష ఆదరణను చూరగొంటోంది. చిత్ర విడుదల కోసం అజిత్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేర్కొండ పార్వై చిత్రాన్ని అక్టోబరు నెలలో విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు గతంలో వెల్లడించారు. అయితే తాజాగా ఒక నెల ముందే అంటే ఆగస్ట్‌ 8వ తేదీనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement