స్టార్‌ హీరోపై కన్నేసిన రష్మిక | Rashmika Mandanna Speaks About Hero Ajith And His Fanfollwing | Sakshi
Sakshi News home page

అజిత్‌పై కన్నేసిన క్రేజీ నటి

Published Fri, Sep 27 2019 9:49 AM | Last Updated on Fri, Sep 27 2019 12:14 PM

Rashmika Mandanna Speaks About Hero Ajith And His Fanfollwing - Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ అజిత్‌ను పొగడ్తలతో ముంచెత్తుతోంది నటి రష్మిక మందన. ఈ కన్నడి గుమ్మ తెలుగులో గీతగోవిందం చిత్రంతో ఒక్కసారిగా క్రేజ్‌ను సంపాదించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్‌లో మార్కెట్‌ ఉన్న కథానాయకిల లిస్ట్‌లో ఈ అమ్మడు చేరింది. టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ లో హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేసింది. అంతేకాకుండా అల్లుఅర్జున్‌ లాంటి స్టార్‌ హీరోలతోనూ నటిస్తూ బిజీగా ఉంది. అయితే కోలీవుడ్‌కు డియర్‌ కామ్రేడ్‌ చిత్రం ద్వారా పరిచయమైనా, ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడం రష్మికను నిరాశపరిచింది. అంతకంటే ఎక్కువగా హీరో విజయ్‌తో నటించే అవకాశం మిస్‌ కావడం. దీంతో ఎలాగైనా కోలీవుడ్‌లో జెండాను గట్టిగా పాతాలని కోరుకుంటున్న ఈ బ్యూటీ దృష్టి ఇప్పుడు విజయ్‌కు దీటైన నటుడు అజిత్‌పై పడినట్లు తెలుస్తోంది. 

అందుకు ఉదాహరణ ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న రష్మిక అజిత్‌ పేరు చెప్పి వార్తల్లో కెక్కింది. అజిత్‌కు దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఆయన సాధారణంగా తన సినిమాకు సంబంధించిన కార్యక్రమాల్లోనే పాల్గొనరు. అయినా అలాంటి కార్యక్రమాల్లో అజిత్‌ పేరు చెప్పగానే అభిమానులు ఈలలు, చప్పట్లతో ఆవరణ దద్దరిల్లుతుంది.  ఇది తెలిసిన రష్మిక తను పాల్గొన్న కార్యక్రమంలో మీకు కోలీవుడ్‌లో ఎవరితో నటించాలని ఆశ పడుతున్నారన్న వ్యాఖ్యాత ప్రశ్నకు టక్కున అజిత్‌ అని చెప్పింది.

ఇది విన్న అభిమానులు తలా అంటూ గట్టిగా కేకలు వేస్తూ డాన్స్‌ చేయడం ప్రారంభించారు. అది చూసిన నటి రష్మిక అజిత్‌ మాస్‌ అని అంది. అలా విజయ్‌తో నటించే అవకాశాన్ని కోల్పోయిన ఈ బ్యూటీ దాన్ని అజిత్‌తో నటించి భర్తీ చేయాలని కోరుకుంటోంది. అయితే అలాంటి అవకాశం ఈ అమ్మడికి ఎప్పుడు వస్తుందో చూడాలి. ఏదేమైనా నటి రష్మిక అజిత్‌ మాస్‌ అన్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అయితే ఇప్పటికే ఈ బ్యూటీ కార్తీకి జంటగా సుల్తాన్‌ అనే చిత్రంలో నటిస్తోందన్నది గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement