అదే నాతో వచ్చిన చిక్కు! | I Don't Use My Brain While Talking: Sonam Kapoor | Sakshi
Sakshi News home page

అదే నాతో వచ్చిన చిక్కు!

Published Fri, Dec 18 2015 11:37 PM | Last Updated on Sun, Sep 3 2017 2:12 PM

అదే నాతో వచ్చిన చిక్కు!

అదే నాతో వచ్చిన చిక్కు!

సినీ తారల్లో ముక్కుసూటిగా మాట్లాడేవాళ్ల సంఖ్య తక్కువ. ఎందుకొచ్చిన గొడవలే... అని చాలామంది తమ అభిప్రాయాలను వెల్లడించడానికి కాస్త భయపడతారు. కానీ సోనమ్‌కపూర్ స్టయిలే సెపరేటు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. అందుకే సినీ పరిశ్రమలో చాలా మంది ఆమె మీద మండిపడుతూ ఉంటారు. ఎంత మంది వ్యతిరేకించినా ‘నేనింతే’ అని అంటున్నారామె. కానీ చిన్నప్పటి సోనమ్ అంత యాక్టివ్ కాదని చెప్పుకొచ్చారు. ‘‘అప్పట్లో రిజర్వ్‌డ్‌గా, కామ్‌గా ఉండేదాన్ని. స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ.

ఎవరైనా కొత్తవాళ్లు కనబడితే మాత్రం అమ్మ వెనకాల దాక్కునేదాన్ని. ఒక యాక్టర్‌కు ఉండాల్సిన చొరవ, చురుకుదనం అస్సలు లేవు. సినీ పరిశ్రమలోకి వచ్చాకే నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నించాను. చివరకు సక్సెస్ అయ్యాను. నేను ఎవరితో మాట్లాడినా, ఏ పని చేపట్టినా  మనసుపెట్టి చేస్తాను. మెదడుతో అస్సలు ఆలోచించను. అదే నాతో వచ్చిన చిక్కు. కానీ నా స్నేహితులు మాత్రం నేను ఇలా ఉంటేనే ఇష్టపడతారు’’ అని సోనమ్ చెప్పుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement