వీ ఆర్‌ వీగన్స్ | What is Veganism? | Sakshi
Sakshi News home page

వీ ఆర్‌ వీగన్స్

Published Thu, Mar 6 2025 8:30 AM | Last Updated on Thu, Mar 6 2025 8:30 AM

What is Veganism?

 నగరంలో వీగనిజంపై అవగాహన ప్రచారం ప్రారంభం 

 మెర్సీ ఫర్‌ యానిమల్స్‌ ఇండియా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహణ 

వీగనిజం ప్రాముఖ్యత తెలియజేస్తున్న సినీతార  దక్ష నాగర్కర్‌

కొన్ని సంవత్సరాలుగా వీగన్స్, వీగనిజంపై విస్తృతంగా అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ వంటి నగరాల్లో వీగనిజంకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు, ప్రాముఖ్యత తెలిపే సదస్సులు నిర్వహిస్తున్నారు. జంతు సంరక్షణ, మూగజీవాల హక్కుల కోసం పాటు పడటం వంటి అంశాలపై వీగన్లు, వీగన్‌ సంస్థలు విశేషంగా కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా నగరం వేదికగా మెర్సీ ఫర్‌ యానిమల్స్‌ ఇండియా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రముఖ సినీతార దక్ష నాగర్కర్‌ భాగస్వామ్యంతో మొక్కల–ఆధారిత ఆహార జీవనాన్ని ప్రోత్సహించే అవగాహన ప్రచారాన్ని ప్రారంభించారు. స్వతాహ వీగన్‌ అయిన దక్ష నాగర్కర్‌ వీగనిజం ప్రాముఖ్యత, జంతువులపై హింస వద్దంటూ ఈ ప్రచారం ద్వారా తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో వీగనిజం గురించి, ప్రస్తుత తరుణంలో దాని ప్రాధాన్యత.. తదితర అంశాల గురించి ‘సాక్షి’తో పంచుకుంది. 

ప్రస్తుత మానవ జీవన విధానం జంతువులను అత్యంత హీనంగా హింసిస్తోంది. ముఖ్యంగా మాంసం కోసం 2, 3 నెలల జంతువులను కృత్రిమ విధానాలతో బలవంతంగా ఎక్కువ బరువు పెంచి సృష్టి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా డైరీ పామ్స్, ఫౌల్ట్రీ, పిగ్‌ ఫామ్స్‌లో కనీసం ఒక జంతువు స్వేచ్ఛగా తిరగకుండా కేజ్‌లలో బందించి వాటి ఉత్పత్తులను సేకరిస్తున్నారు. కొన్ని జంతువులైతే వాటి జీవిత కాలంలో సూర్యరశి్మకి కూడా చూడకుండా పెరుగుతున్నాయి. 

ఇది జీవవైవిధ్యానికి విరుద్దం. దేశంలో జనాభా పెరిగిపోయింది, ఇంతమందికి సరిపడా జంతు ఉత్పత్తులు అందించలేక, బ్యాలెన్స్‌ చేయలేక అనైతిక బ్రీడింగ్‌తో హింసిస్తున్నారు. ఈ సందర్భంగా ‘పవర్డ్‌ బై వెజ్జీస్‌‘ అంటూ కూరగాయలను మాత్రమే తినాలని ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాక్టరీలు, వాహనాల కాలుష్యం కన్నా ఫ్యాక్టరీ ఫార్మమింగ్‌తో ఎక్కువ కాలుష్యం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. 

గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించడం కోసం బాగా స్పందిస్తున్నారు. వారి జీవనంలో కొనసాగుతున్న ప్రాంతీయ వీగన్‌ వంటకాల విశిష్టతను తెలుసుకుంటున్నారు. కానీ నగరాల్లో మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది కదా అని వాదిస్తున్నారు. కానీ మొక్కల్లో స్టిమ్యులే మాత్రమే ఉంటుంది, జంతువుల్లో వలె నొప్పిని తెలియజేసే నాడీ వ్యవస్థ ఉండదని అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీగన్స్‌ అంటే మాంసాన్ని మాత్రమే కాదు.. పాలు, పెరుగు, గుడ్లు వంటి జంతు పదార్థాలతో పాటు జంతు ఉత్పత్తులతో తయారు చేసిన బ్యాగ్‌లు, దుస్తులు ఏ ఇతర వస్తువులను వినియోగించరు. 

జంతువులకు వాటి స్వేచ్ఛను ఇవ్వడంతో పాటు హింసకు దూరం చేయడం అవసరం. నేను నటించిన జాంబిరెడ్డి సినిమా షూటింగ్‌ సమయంలో మా దర్శకులు ఒక మేకను ఎంత జాగ్రత్తగా, సురక్షితంగా చూసుకున్నారో చూసి సంతోషపడ్డాను. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జంతువుల హింసించకూడదనే అంశంపై కొత్త చట్టాలను వెలువరించారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం కూడా జంతు పెంపకాలపై దృష్టి సారిస్తూ నియమాలను పాటిస్తుంది. సినిమాల విషయానికొస్తే త్వరలో మరో 2 సినిమాలు చేస్తున్నాను. తెలుగు ప్రజలకు దగ్గరవ్వడం చాలా సంతోషంగా ఉంది.  
– దక్ష నాగర్కర్‌

జంతు సంరక్షణే 
లక్ష్యంగా 2016లో ప్రారంభించిన మెర్సీ ఫర్‌ యానిమల్స్‌ ఇండియా ఫౌండేషన్‌ దేశవ్యాప్తంగా కృషి చేస్తోంది. సంస్థ పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో క్రూరంగా పందులను పెంచడం నిషేధించారు. ఇందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది. శాఖాహారం, మాంసాహారం ఉన్నట్లుగానే వీగన్‌ ఫుడ్‌కు కూడా లేబుల్‌ ఉండేలా మార్పు తీసుకొచ్చాం. జాన్‌ అబ్రహం, సోనాక్షి సిన్హ, సాక్షి మల్లిక్‌ మాదిరిగానే హైదరాబాద్‌లో వీగనిజం కోసం దక్షా నాగర్కర్‌ క్యాంపెయిన్‌ చేయడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఒక జంతువును చంపితే రూ.50 ఫైన్‌ కట్టి హాయిగా తిరుగుతున్నారు. ఒక మనిషిని చంపితే ఎలాంటి చట్టం ఉంటుందో జంతు హత్యలపై కూడా కఠినమైన చట్టాలు తీసుకురావాలని ఉన్నత న్యాయస్థానాలకు విన్నవించాం.  
– నికుంజ్‌ శర్మ, సీఈఓ, మెర్సీ ఫర్‌ యానిమల్స్‌ ఇండియా  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement