mercy
-
వీ ఆర్ వీగన్స్
కొన్ని సంవత్సరాలుగా వీగన్స్, వీగనిజంపై విస్తృతంగా అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో వీగనిజంకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు, ప్రాముఖ్యత తెలిపే సదస్సులు నిర్వహిస్తున్నారు. జంతు సంరక్షణ, మూగజీవాల హక్కుల కోసం పాటు పడటం వంటి అంశాలపై వీగన్లు, వీగన్ సంస్థలు విశేషంగా కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా నగరం వేదికగా మెర్సీ ఫర్ యానిమల్స్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ సినీతార దక్ష నాగర్కర్ భాగస్వామ్యంతో మొక్కల–ఆధారిత ఆహార జీవనాన్ని ప్రోత్సహించే అవగాహన ప్రచారాన్ని ప్రారంభించారు. స్వతాహ వీగన్ అయిన దక్ష నాగర్కర్ వీగనిజం ప్రాముఖ్యత, జంతువులపై హింస వద్దంటూ ఈ ప్రచారం ద్వారా తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో వీగనిజం గురించి, ప్రస్తుత తరుణంలో దాని ప్రాధాన్యత.. తదితర అంశాల గురించి ‘సాక్షి’తో పంచుకుంది. ప్రస్తుత మానవ జీవన విధానం జంతువులను అత్యంత హీనంగా హింసిస్తోంది. ముఖ్యంగా మాంసం కోసం 2, 3 నెలల జంతువులను కృత్రిమ విధానాలతో బలవంతంగా ఎక్కువ బరువు పెంచి సృష్టి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా డైరీ పామ్స్, ఫౌల్ట్రీ, పిగ్ ఫామ్స్‌లో కనీసం ఒక జంతువు స్వేచ్ఛగా తిరగకుండా కేజ్‌లలో బందించి వాటి ఉత్పత్తులను సేకరిస్తున్నారు. కొన్ని జంతువులైతే వాటి జీవిత కాలంలో సూర్యరశి్మకి కూడా చూడకుండా పెరుగుతున్నాయి. ఇది జీవవైవిధ్యానికి విరుద్దం. దేశంలో జనాభా పెరిగిపోయింది, ఇంతమందికి సరిపడా జంతు ఉత్పత్తులు అందించలేక, బ్యాలెన్స్ చేయలేక అనైతిక బ్రీడింగ్‌తో హింసిస్తున్నారు. ఈ సందర్భంగా ‘పవర్డ్ బై వెజ్జీస్‘ అంటూ కూరగాయలను మాత్రమే తినాలని ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాక్టరీలు, వాహనాల కాలుష్యం కన్నా ఫ్యాక్టరీ ఫార్మమింగ్తో ఎక్కువ కాలుష్యం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించడం కోసం బాగా స్పందిస్తున్నారు. వారి జీవనంలో కొనసాగుతున్న ప్రాంతీయ వీగన్ వంటకాల విశిష్టతను తెలుసుకుంటున్నారు. కానీ నగరాల్లో మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది కదా అని వాదిస్తున్నారు. కానీ మొక్కల్లో స్టిమ్యులే మాత్రమే ఉంటుంది, జంతువుల్లో వలె నొప్పిని తెలియజేసే నాడీ వ్యవస్థ ఉండదని అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీగన్స్ అంటే మాంసాన్ని మాత్రమే కాదు.. పాలు, పెరుగు, గుడ్లు వంటి జంతు పదార్థాలతో పాటు జంతు ఉత్పత్తులతో తయారు చేసిన బ్యాగ్‌లు, దుస్తులు ఏ ఇతర వస్తువులను వినియోగించరు. జంతువులకు వాటి స్వేచ్ఛను ఇవ్వడంతో పాటు హింసకు దూరం చేయడం అవసరం. నేను నటించిన జాంబిరెడ్డి సినిమా షూటింగ్ సమయంలో మా దర్శకులు ఒక మేకను ఎంత జాగ్రత్తగా, సురక్షితంగా చూసుకున్నారో చూసి సంతోషపడ్డాను. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జంతువుల హింసించకూడదనే అంశంపై కొత్త చట్టాలను వెలువరించారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం కూడా జంతు పెంపకాలపై దృష్టి సారిస్తూ నియమాలను పాటిస్తుంది. సినిమాల విషయానికొస్తే త్వరలో మరో 2 సినిమాలు చేస్తున్నాను. తెలుగు ప్రజలకు దగ్గరవ్వడం చాలా సంతోషంగా ఉంది. – దక్ష నాగర్కర్జంతు సంరక్షణే లక్ష్యంగా 2016లో ప్రారంభించిన మెర్సీ ఫర్ యానిమల్స్ ఇండియా ఫౌండేషన్ దేశవ్యాప్తంగా కృషి చేస్తోంది. సంస్థ పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో క్రూరంగా పందులను పెంచడం నిషేధించారు. ఇందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది. శాఖాహారం, మాంసాహారం ఉన్నట్లుగానే వీగన్ ఫుడ్‌కు కూడా లేబుల్ ఉండేలా మార్పు తీసుకొచ్చాం. జాన్ అబ్రహం, సోనాక్షి సిన్హ, సాక్షి మల్లిక్ మాదిరిగానే హైదరాబాద్‌లో వీగనిజం కోసం దక్షా నాగర్కర్ క్యాంపెయిన్ చేయడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఒక జంతువును చంపితే రూ.50 ఫైన్ కట్టి హాయిగా తిరుగుతున్నారు. ఒక మనిషిని చంపితే ఎలాంటి చట్టం ఉంటుందో జంతు హత్యలపై కూడా కఠినమైన చట్టాలు తీసుకురావాలని ఉన్నత న్యాయస్థానాలకు విన్నవించాం. – నికుంజ్ శర్మ, సీఈఓ, మెర్సీ ఫర్ యానిమల్స్ ఇండియా -
ఆర్ద్రహృదయం
ఒకసారి ఒకవ్యక్తి ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి వెళుతున్నప్పుడు దారి మధ్యలో కొందరు దొంగలు ఆ వ్యక్తిని కొట్టి, గాయపరిచి అతడి వద్ద ఉన్న విలువైన వస్తువులను, వస్త్రాలనూ దోచుకుని ఆ వ్యక్తిని అక్కడే పడేసి వెళ్లిపోయారు, ఆ వ్యక్తికి స్పృహ లేదు... అయితే కాసేపటికి ఆ మార్గం గుండా ఒక యాజకుడు (దేవుని పని చేసేవాడు) వెళుతూ ఆ దొంగలు కొట్టి పడేసిన ఆ వ్యక్తిని చూసి పక్కనుండి తప్పుకుని వెళ్లి పోయాడు, అలాగే ఇంకో వ్యక్తి కూడా అలాగే తప్పుకుని వెళ్లాడే తప్ప అతనికి ఏ సహాయమూ చేయలేదు, ఇలా రెండోసారి వెళ్ళిన వ్యక్తి కూడా భక్తుడే, అప్పుడు అక్కడ నుండి ఒక మనిషి ఆ దారి గుండా వెళుతూ ఆ పడి ఉన్న వ్యక్తిని చూసి అతడి వద్దకు వెళ్లి అతని మీద జాలిపడి తనవద్ద ఉన్న నూనెతో అతడి గాయాలను కట్టి, అతడిని దగ్గర్లో ఉన్న ఒక పూటకూళ్ల ఇంటికి తీసుకెళ్లి అతడిని అక్కడ ఉంచాడు, అంతే కాకుండా మళ్లీ తిరిగి తెల్లవారు ఝామున ఆ పూటకూళ్లవాని వద్దకు వచ్చి అతనికి కొంత ధనం ఇచ్చి ఆ దొంగలు కొట్టి పడవేసిన వ్యక్తిని జాగ్రత్తగా చూసుకొనమని, అతడికి ఇంకా ఏదైనా వైద్య సహాయం అవసరం అయితే చే యించమని, ఆ ధనాన్ని తాను ఇస్తానని చెప్పి వెళ్లిపోయాడు. ఆ సహాయం చేసిని వ్యక్తికీ ఆ దొంగలు కొట్టి పడవేసిన వ్యక్తికీ ఎలాంటి సంబంధం లేదు, అయితే ముందు ఆ మార్గం గుండా వెళ్లిన ఇద్దరి వ్యక్తుల దృష్టిలో ఈ సహాయం చేసిన వ్యక్తి చెడ్డవాడుగా ఉండేవాడు...ఇప్పుడు ఆలోచించండి, మొదలు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు లోకం దృష్టిలో చాలా గొప్పవారిగా, భక్తులుగా చెలామణి అయ్యేవారు, దేవుని వద్ద పూజలు చేస్తూ అందరికీ కనిపించేట్టు ప్రార్థనలు చేస్తూ భక్తుల ముద్ర వేసుకున్నవారు. అయితే ఆ సహాయం చేసిన వ్యక్తి లోకం దృష్టిలో చాలా చెడ్డవాడు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు (మత్తయి 22:39), అని క్రీస్తు చెప్పిన మాట పరమార్థం ఇదే కదా... ఒక వ్యక్తి సహాయం కోసం చూస్తుంటే అతనికి సహాయ పడకుండా త్వరగా వెళ్లి ప్రార్థన చేయాలనో లేదా సమయానికి గుడికి వెళ్లకపోతే దేవునికి కోపం వస్తుందనో అనుకునే భక్తులకు ఈ ఉపమానం గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది. దేవునికి ఇష్టమైనట్టు బతకడమే నిజమైన భక్తి అని ఈ ఉపమానం ద్వారా మనకు తెలుస్తుంది. దేవుని పని చేసేవాడు ముందుగా దేవుని హృదయాన్ని తెలుసుకోవాలి, భక్తుడు దేవునికి నచ్చిన దానిని చేయాలి. – బెల్లంకొండ రవికాంత్ -
మనుషుల్లో లే'దయా'!
మా ఇంటికొస్తే ఏం తెస్తారు? మీ ఇంటికొస్తే ఏమిస్తారు?ఇవ్వాళ, రేపు అంతటా ఇదే తంతు నడుస్తోంది. ఒత్తిడితో కూడిన నేటి పోటీ ప్రపంచంలో మనుషుల్లో దయాగుణం తగ్గిపోతోంది. అందుకేనేమో.. ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు’వంటి పాటలు మనిషిలో మాయమైపోతోన్న గుణాన్ని గుర్తు చేస్తున్నాయి. మనిషి దయతో బతకాలనే స్ఫూర్తిని గుర్తు చేసేందుకు ఏటా నవంబర్ 13న వరల్డ్ కైండ్‌నెస్ డే నిర్వహిస్తున్నారు. చిన్న సాయమైనా పెద్ద మనసుతో.. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో దయా గుణం అనేది అంతర్భాగం. దానిని నేటి తరంలో నింపడానికి మన దేశం ఏటా ఈ దినోత్సవాన్ని ఆచరిస్తోంది. అవసరాల్లో ఉన్నవారిని ఆదుకోవడం, అనాథ పిల్లల్ని దత్తత తీసుకోవడం, పేదవారికి ఆహారాన్ని పంచడం, చిన్నారుల చదువులకు సాయపడటం, వృద్ధులకు చేయూతనివ్వడం, ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కున్న వారిని బయటకు తెచ్చే మార్గాల్ని అన్వేషించడం.. ఇలా చేసేది ఉడతా భక్తి సాయమైనా పర్లేదు.. కాస్తంత దయతో, చిత్తశుద్ధితో చేస్తే చాలు. అమెరికాలో కైండ్ నెస్ ఇన్స్టిట్యూట్ ఇతరుల బాధను పంచుకోవాలంటే మనలో దయాగుణం పెరగాలి. భావితరాల్లో దీనిపై సామాజిక స్పృహ పెంచే లక్ష్యంతో అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ గత సెప్టెంబర్‌లో ఒక ఇన్‌స్టిట్యూట్‌నే ప్రారంభించింది. దయా గుణం అనేది అంతర్లీనంగా అందరిలో ఉన్నా.. దానిని ఎలా చూపాలో తెలియని వారికి ఈ సంస్థ దిశానిర్దేశం చేస్తుంది. పౌరుల్లో దయాగుణాన్ని పెంచడం, మానవీయ సమాజాలు నెలకొల్పే దిశగా నాయకుల్లో స్ఫూర్తి నింపడం వంటివి ఇక్కడ నేర్పిస్తారు. మనిషిలో హింసా ప్రవృత్తిని నివారించే మార్గాలను అన్వేషిస్తారు. సమాజంలో దయకు స్థానం ఎందుకు తగ్గిపోతోందో అధ్యయనం చేస్తారు. మనుషుల్లో పుట్టుకతోనే కొన్ని గుణాలు అబ్బుతాయి. వాటిపై కుటుంబం, స్నేహాల ప్రభావం ఉంటుంది. ఇటువంటి ఇన్స్టిట్యూట్ వల్ల తోటివారికి సాయపడే గుణం పెరుగుతుందని కాలిఫోరి్నయా వర్సిటీలోని కైండ్‌నెస్ ఇన్స్టిట్యూట్ డీన్ డార్నెల్ హంట్ అంటున్నారు. మయన్మార్‌లో దయాగుణం ఎక్కువ తెరవాడ బుద్ధిజం.. గౌతమబుద్ధుని బోధనల్ని, నమ్మకాల్ని ఆచరిస్తూ ప్రచారం చేసే ఒక వర్గమిది. మయన్మార్‌లో పెద్దసంఖ్యలో ఉండే వీరు సంఘ దానాలకు ప్రాధాన్యమిస్తారు. తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసిన ఒక జాబితా ప్రకారం అత్యధికంగా చారిటీలకు విరాళాలిచ్చే దేశాల జాబితాలో మయన్మార్ టాప్‌లో ఉంది. ఈ జన్మలో చేసే మంచి పనులే వచ్చే జన్మలో మెరుగైన జీవితాన్నిస్తాయని తెరవాడ బౌద్ధుల నమ్మకం. మయన్మార్‌లో ఏకంగా 81 శాతం మంది ప్రజలు చారిటీలకు విరాళాలిస్తున్నారని చారిటీస్ ఎయిడ్ ఫౌండేషన్స్ వరల్డ్ గివింగ్ ఇండెక్స్ వెల్లడిస్తోంది. థాయ్‌లాండ్‌లోనూ తెరవాడ బౌద్ధులు ఎక్కువే.. ఆ దేశంలో 71 శాతం మంది ప్రజలు వివిధ రూపాల్లో సాటి మనుషులకు సాయపడుతుంటారని తేలింది. సంపన్న రాజ్యమైన అమెరికా దయాగుణం గల టాప్–10 దేశాల్లో లేదు. ‘దయ’లో టాప్–10 దేశాలు దయాగుణం గల వారి సంఖ్య శాతాల్లో 1. మయనన్మార్ 81 2. యూకే 71 3. మాల్టా 71 4. థాయ్‌లాండ్ 71 5. నెదర్లాండ్స్ 71 6. ఇండోనేషియా 69 7. ఐర్లాండ్ 69 8. ఆస్ట్రేలియా 68 9. న్యూజీలాండ్ 65 10. కెనెడా 63 -
‘కారుణ్యం’ కొందరిపైనే
– ఏడాది తరువాత కారుణ్య నియామకాలు చేపట్టిన ఆర్టీసీ – 52 శ్రామిక్ పోస్టులను భర్తీ చేసేందుకు సర్టిఫికెట్ల పరిశీలన కర్నూలు(రాజ్‌విహార్): ఆర్టీసీ అధికారుల వైఖరితో సంస్థలో పనిచేస్తూ చనిపోయిన కార్మికుల ఇళ్లలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. కారుణ్య నియామకాల కింద మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఈ అవకాశం కోసం కర్నూలు రీజియన్‌లో వీరి సంఖ్య 150 మందికి పైగా ఉండగా గత ఏడాది ఫిబ్రవరిలో చేపట్టిన కానిస్టేబుల్ (సెక్యూరిటీ విభాగం) నియామకాల్లో 35 మందికి పోస్టులు ఇచ్చారు. దీనికి వయస్సు నిబంధన పెట్టడంతో అనేక మంది వెనుదిరగాల్సి వచ్చింది. ప్రస్తుతం 120 మంది మిగిలి ఉన్నారు. శ్రామిక్ (మెకానిక్ విభాగం) పోస్టుల్లో నియమించేందుకు పోస్టుల్లో తీసుకోవాలంటూ సంస్థ గత వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టరు నండూరి సాంబశివరావు జూలై మొదటి వారంలో ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో స్థానిక అధికారులు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపించి ఈ శ్రామిక్ ఉద్యోగంలో చేరేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి అదేనెల 31వ తేదీలోపు మరోసారి దరఖాస్తులు స్వీకరించారు. ఆగస్టులోగా అభ్యర్థుల విద్యార్హత, కుల, నివాస తదితర సర్టిఫికెట్ల పరిశీలన చేసి ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉన్నా సెలక్షన్ కమిటీ ఎంపికలో జాప్యం జరిగింది. 58 మంది హాజరు: కారుణ్య నియామకాల కింద 52 శ్రామిక్ పోస్టుల భర్తీకి బుధవారం దరఖాస్తుల పరిశీలనకు 60 మందిని పిలవగా 58 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇంకా 68 మంది మిగిలి ఉన్నారు. బుధవారం వచ్చిన అభ్యర్థుల విద్యార్హత, ఇరత సర్టిఫికెట్లను పరిశీలించారు. సాధారణంగా శ్రామిక్ పోస్టులకు 10వ తరగతి తరువాత ఐటీఐలో డిజిల్ మెకానిక్ చేసిన అభ్యర్థులతోనే గతంలో భర్తీ చేసేవారు. అయితే కారుణ్య నియామకాల కింద ఉద్యోగం కోరుతూ సంవత్సరాల తరబడి నిరీక్షిస్తున్న ఉద్యోగుల పిల్లలకు ఊరట కల్పించారు. ఐటీఐ లేకపోయినా కేవలం 10వ తరగతి ఉత్తీర్ణత సాధిస్తే చాలని సడలించారు. ఓసీ అభ్యర్థుల వయస్సు 22 నుంచి 35 సంవత్సరాలలోపు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఇవ్వగా 40 ఏళ్లు నిబంధన ఉండగా మహిళలు, శారీరక వికలాంగులు అనర్హులు కావడంతో కాల్ లెటర్లు పంపలేదు. సర్టిఫికెట్ల పరిశీల కమిటీకి డిప్యూటీ చీఫ్ పర్సనల్ మేనేజర్ గోపి చైర్మన్ కాగా సభ్యులుగా డీసీఎంఈ రమేష్ బాబు, డీసీటీఎం శ్రీనివాసులు, కో ఆర్డినేటర్‌గా పీఓ సర్దార్ హుసేన్ వ్యవహరించారు. -
ఒబామా భారీ క్షమ
78 మందికి క్షమాభిక్ష, 153 మందికి శిక్ష తగ్గింపు హŸనలులు: పదవీకాలం ముగుస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా భారీ ఎత్తున క్షమాగుణం ప్రదర్శించారు. 78 మందిని క్షమించిన ఆయన.. మరో 153 మంది ఖైదీలకు శిక్ష తగ్గించారు. ఇంతమందికి క్షమాభిక్ష పెట్టడం గతంలో ఏ అధ్యక్షుడు చేయలేదని వైట్ హౌస్ వర్గాలు చెప్పాయి. క్షమాభిక్షలపై గత కొన్ని నెలలు ఒబామా వేగంగా నిర్ణయం తీసుకుంటున్నారు. వీటిల్లో శిక్ష తగ్గించేవి ఎక్కువగా ఉంటున్నాయి. క్షమాభిక్షలో ఓటు వేయడంపై ఉన్న నిషేధాన్ని తొలగించడం, పదవులకు అర్హత, న్యాయస్థానంలో తీర్పులు చెప్పే అర్హత పొందటం లాంటివి ఉంటాయి. ఇంకా శిక్షలో తీవ్రతను తగ్గిస్తారు. ఈసారి క్షమాభిక్ష పొందిన వారిలో ఎక్కువ మంది నకిలీ కరెన్సీ మార్పిడి, పేలుడు పదార్థాలతో దొరికినవారు, అనుకోకుండా జరిగిన మారణకాండలో పాల్గొన్నవారు ఉన్నారు. అధ్యక్షుడిగా ఒబామా ఇప్పటి వరకూ 148 మందికి క్షమాభిక్ష పెట్టగా.. 1176 మంది ఖైదీలకు శిక్ష తగ్గించారని వైట్ హౌస్ న్యాయవాది నీల్ ఎగ్గెల్స్టన్ తెలిపారు. -
ఈ రాజు లక్షన్నరమంది ఖైదీలను ఏం చేస్తారో?
బ్యాంకాక్: థాయిలాండ్ కొత్త రాజు మహా వజ్రలాంకార్న్ దయామయుడిగా మారబోతున్నారు. ఆయన దాదాపు లక్షన్నర మంది నేరస్తులకు క్షమా భిక్ష పెట్టనున్నారు. శిక్షల స్థాయిని తగ్గించడమో, మొత్తానికే రద్దు చేయడమో వంటి చర్యలకు దిగబోతున్నారు. ఈ నేరస్తుల్లో రాజద్రోహానికి పాల్పడిన వారు, అత్యంత కఠినమైన చట్టాల కింద అరెస్టయిన వారు కూడా ఉన్నారు. రాజుగా వజ్రలాంకార్న్ ఈ నెల(డిసెంబర్) 1న కిరీటం ధరించారు. తండ్రి భూమిబోల్ అదుల్యాదేజ్ గత అక్టోబర్ 13న కన్నుమూయడంతో ఆయన స్థానంలో రాజుగా వచ్చారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత నేరస్తుల విషయంలో ఆయన ముందుకు వచ్చిన అతిపెద్ద అవకాశం ఇదేనని రాయల్ గెజిట్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. మొత్తం లక్షన్నరమంది ఖైదీల జాబితా సిద్ధంగా ఉందని, వీరు విడుదలకావడమో, లేక శిక్షా కాలాన్ని తగ్గించడమోనన్న నిర్ణయం రాజు చూపించే దయపైనే ఆధారపడి ఉందని ఆ ప్రకటన పేర్కొంది. అయితే, వారు ఇప్పటికే అనుభవించిన శిక్షా కాలం, ప్రవర్తన, వయసు ఆధారంగానే రాజు తుది నిర్ణయం తీసుకుంటారని కూడా తెలిపింది. -
మోదీ..కరుణించేనా..?
సంగారెడ్డి రోడ్డు విస్తరణకు నిధులు రాబట్టేందుకు సర్కార్ యత్నం నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నివేదించునున్న ప్రభుత్వం భువనగిరి చిట్యాల– సంగారెడ్డి రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించేందుకు కేంద్రం నుంచి నిధులు రాబట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఆదివారం మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా చిట్యాల– సంగారెడ్డి రోడ్డు విస్తరణకు నిధులు ఇవ్వాలని విన్నవించనున్నారు. దీంతోపాటు నల్లగొండ, మెదక్ జిల్లాల వాహనాలతో పాటు, ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలు వెళ్తున్న చిట్యాల– భువనగిరి–గజ్వేల్–సంగారెడ్డి రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించాలని ప్రధానిని కోరనున్నారు. ఐదేళ్ల క్రితమే ప్రతిపాదనలు.. మూడు జాతీయ, మూడు రాష్ట్ర రహదారులను కలుపుతూ అంతర్జిల్లా వ్వాపార వాణిజ్య అవసరాలకు ప్రధాన మార్గంగా ఉన్న భువనగిరి–గజ్వేల్– తూప్రాన్–సంగారెడ్డి లింక్ రోడ్డును నాలుగులేన్లుగా మార్చాలనే ప్రతిపాదనలు ఐదేళ్ల క్రితమే చేశారు. ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ రహదారిని చేపట్టాలని సంకల్పించి, పలుమార్లు ట్రాఫిక్ సర్వే చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. ఉమ్మడి ఏపీలో మంజూరు కాని ఈ రోడ్డు స్వరాష్ట్రంలో మంజూరు చేయించుకోవడానికి అధికారులు నివేదికను రూపొందించారు. మూడుసార్లు ప్రకటనలు.. జిల్లాలోని చిట్యాల నుంచి గజ్వేల్ మీదుగా సంగారెడ్డి వరకు 170 కి.మీల పొడవున ఉన్న ఈ లింక్ రోడ్డు 163, 44, 65 మూడు జాతీయ రహదారులతో పాటు రాజీవ్ రహదారి హైదరాబాద్–మెదక్, సంగారెడ్డి రూట్లలో మరో మూడు రాష్ట్ర ర హదారులను కలుపుతుండటం వల్ల వ్వాపార, వాణిజ్య అవసరాలకు ప్రధాన మార్గంగా మారింది. దక్షిణ, ఉత్తర భారతదేశాల మధ్యన నడిచే వ్యాపార, వాణిజ్య వాహనాలకు ఈ రోడ్డు ద్వారా చాలా దూరాభారం తగ్గుతుంది. దీంతో పాటు రాజధాని హైదరాబాద్‌పై వాహనాల భారం పడకుండా నేరుగా సమయం అదా అయ్యే అవకాశం ఉంది. ఈ రోడ్డును పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్) కింద నాలుగు లేన్లుగా మార్చడానికి ఇప్పటివరకు మూడుసార్లు ప్రకటన వెలువడింది. ఈ క్రమంలోనే పలుమార్లు ఈ రోడ్డుపై ట్రాఫిక్ సర్వే కూడా పూర్తి చేశారు. కానీ కార్యాచరణకు అమలుకు నోచుకోలేదు. ప్రధాని పర్యటనలోనైనా రోడ్డు విస్తరణకు మోక్షం లభించే అవకాశం కోసం జిల్లా వాసులతో పాటు అధికారులు ఎదురు చూస్తున్నారు. -
జైలు నుంచి జనంలోకి..
• క్షమాభిక్ష ఫలం.. 39 మంది ఖైదీలకు విముక్తి • విశాఖ జైలు నుంచి 41 మంది విడుదలకు అనుమతి • పూచికత్తు కట్టలేక ఒకరు.. వేరే కేసులో శిక్షతో మరొకరు జైలులోనే • బంధువుల పరామర్శలు.. ఆత్మీయ పలకరింపులు • జైలు బయట ఉద్విగ్న వాతావరణం సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది.. సర్కారు కరుణించింది.. గణతంత్ర దినోత్సవం రోజు వారికి స్వేచ్ఛ లభించింది. వివిధ నేరాల్లో జీవిత ఖైదు అనుభవిస్తూ.. సత్ప్రవర్తనతో మెలిగిన వారిని విడుదల చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో.. వారందరూ శిక్షాకాలం ముగియకముందే బాహ్య ప్రపంచాన్ని చూడగలిగారు. స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలిగారు. బంధువులను చెంతకు చేరగలిగారు. క్షణికావేశంలో తప్పు చేసి జైలులో మగ్గిపోయామని.. విలువైన జీవితాన్ని కోల్పోయామని.. జీవితంలో మరోసారి తప్పు చేయబోమని వారు స్పష్టం చేశారు. విడుదలైనా.. తప్పని నిరీక్షణ.. జైలు నుంచి విముక్తి లభించినా.. ఆ ఆవరణ నుంచి బయటపడేందుకు ఇద్దరికి సుదీర్ఘ నిరీక్షణ తప్పలేదు. తమతోపాటు విడుదలైనవారంతా బంధువులతో కలిసి ఆనందంగా వెళ్లిపోగా.. ఆ ఇద్దరు వృద్ధులు మాత్రం సాయంత్రం వరకు జైలు బయటే ఉసూరుమంటూ ఉండిపోయారు. కారణం.. వారి బంధువులెవరూ రాకపోవడమే. మాచెర్ల సూరిబాబు(54), నిమ్మల బెన్ను(53) వృద్ధులు. వారిని తీసుకెళ్లడానికి బంధువులెవరూ జైలు వద్దకు రాలేదు. దీంతో ఊరెలా వెళ్లాలో తెలియక వారిద్దరూ జైలు ఆవరణలోనే నిరాశతో కూర్చుండిపోయారు. బెన్ను బంధువులు మధ్యాహ్నానికి అక్కడికి చేరుకుని అతన్ని తమతో తీసుకెళ్లారు. సూరిబాబు బంధువులు మాత్రం సాయంత్రానికి కూడా రాలేదు. దాంతో జైలు అధికారులే సిబ్బంది సహాయంతో అతన్ని స్వగ్రామమైన చోడవరం మండలం దోడపూడికి పంపించారు. ఆరిలోవ: మంగళవారం ఉదయం.. పిల్లలు, పెద్దలు అందరూ గణతంత్ర దినోత్సవ సంబరాల్లో ఉన్నారు. జిల్లా కేంద్ర కారాగారం వద్ద ఆ సంబరాలతోపాటు ఒక రకమైన ఉద్విగ్న వాతావరణం నెలకొంది. జైలు బయట అనేక మంది ఆతృతతో ఎదురుచూస్తున్నారు. కొద్దిసేపటికి వారి నిరీక్షణ ఫలించింది. జైలు తలుపులు తెరుచుకున్నాయి. ఒక్కొక్కరు బయటకు రావడం ప్రారంభించారు. వారంతా జీవితఖైదు శిక్ష పడిన వారే. బయటకొస్తూనే ఒకవైపు అధికారులకు వీడ్కోలు.. మరోవైపు తమ బంధువులను చూసిన ఆనందంతో ఉబ్బితబ్బియ్యారు. పలకరింతలు.. పరామర్శలతో ఆ ప్రాంగణంలో ఆనందం వెల్లివిరిసింది. సత్ప్రవర్తనతో మెలిగిన జీవిత ఖైదీలను శిక్షాకాలానికి ముందే విడుదల చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు గణతంత్ర దినోత్సవమైన మంగళవారం విశాఖ కేంద్ర కారాగారం నుంచి 39 మంది ఖైదీలను విడుదల చేశారు. 41మందికి అవకాశమున్నా.. గత ఏడాది నవంబరు 18న ఖైదీల క్షమాభిక్షకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోలోని మార్గదర్శకాల ప్రకారం.. విశాఖ జైలు నుంచి విడుదలకు అర్హులైన 41 మంది ఖైదీల పేర్లతో అధికారులు జాబితా రూపొందించి ఉన్నతాధికారులకు పంపారు. దానికి ప్రభుత్వ ఆమోదం కూడా లభించింది. ఆ మేరకు 41 మంది విడుదలకు అధికారులు రంగం సిద్ధం చేశారు. అయితే ఆదినారాయణ అనే ఖైదీ రూ 50 వేల వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వలేక విడుదల నోచుకోలేదు. ఒకటి, రెండు రోజుల్లో ఆయన బంధువులు వచ్చి పూచీకత్తు ఇచ్చిన వెంటనే ఆయన్ను విడుదల చేస్తారు. మరో ఖైదీ జామి కుమార్ మరో కేసులో రెండేళ్ల శిక్ష అనుభవించాల్సి ఉన్నందున ఆయన్ను విడుదల చేయలేదు. మిగిలిన 39 మంది విముక్తి పొందారు. మరోసారి ఎలాంటి తప్పులు చేయకుండా సత్ప్రవర్తనతో మెలుగుతామంటూ జైలు అధికారులకు హామీ ఇచ్చి.. వీడ్కోలు తీసుకున్నారు. తప్పు చేస్తే క్షమాభిక్ష రద్దే విడుదలైనవారు మళ్లీ తప్పు చేసి జైలుకు వస్తే క్షమాభిక్ష రద్దయ్యే అవకాశం ఉందని, అందువల్ల సత్ప్రవర్తనతో మెలగాలని విడుదలైన ఖైదీలకు జైలు సూపరింటెండెంట్ ఇండ్ల శ్రీనివాసరావు సూచించారు. జైలు ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిబంధనల ప్రకారం క్షమాభిక్ష పొందిన ఖైదీల నుంచి రూ 50 వేల వ్యక్తిగత పూచీకత్తు తీసుకొని విడిచిపెట్టామన్నారు. విడదులైనవారందరిలో మంచి మార్పు వచ్చిందన్నారు. వారు మరోసారి తప్పు చేయరనే నమ్మకం ఉందన్నారు. 498(ఎ) ఖైదీలకూ విముక్తి విడుదలైన వారిలో 498(ఎ) కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు ఉన్నారు. భార్యను హత్యచేసిన కేసులో 498(ఎ) సెక్షన్ కింద శిక్ష పడితే 14 ఏళ్ల సాధారణ జీవిత ఖైదుతోపాటు మరో ఆరేళ్లు రెమిషన్ పీరియడ్.. మొత్తం 20 ఏళ్ల శిక్ష అనుభవించాలి. ఇటువంటి శిక్షలు పడిన వివాఖ నగరానికి చెందిన జి.ఎల్లయ్యరెడ్డి, డి.నాగేశ్వరరావులకు కూడా క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేశారు. జీవో ప్రకారం విడుదలకు అర్హులైన మహిళలు, 65 ఏళ్ల దాటిన వృద్ధులు మాత్రం లేరు. -
క్షమ లేదిక.. ఏదో ఒకటి చేసేస్తాం
జైపూర్: 'మనది క్షమాగుణం కలిగిన దేశం. చాలామందిని చాలా విషయాల్లో క్షమిస్తూ వస్తున్నాం. కానీ ఇప్పుడు కాలం మారింది. క్షమ లేదిక. ఏదో ఒక విధంగా తప్పుచేసినవాళ్ల భరతం పడతాం' అంటూ పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ హెచ్చరికలు జారీచేశారు రక్షణ మంత్రి మనోహర్ పారికర్. శనివారం జైపూర్ లోని సీఐఎస్ఎఫ్ మైదానంలో ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీని ప్రారంభించిన ఆయన అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడారు. భారతీయ యువకులు గొప్ప దేశభక్తులని, జాతీయవాద భావాలు నిండినవారని అందుకే సైన్యంలో చేరేందుకు ఉత్సాహం చూపుతారని కితాబిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రక్షణ రంగ ఉద్యోగులు ఉగ్రవాద సంస్థల ఉచ్చులో పడిపోకుండా అన్నివిధాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఇటీవల పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల దాడికి ఎయిర్ ఫోర్స్ లోని కొందరు ఉద్యోగులే సహకరించారనే ఆరోపణలు వెలుగుచేసిన నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ 'హనీట్రాప్ కేసులు వెలుగులోకి రావటం వాస్తవమే అయినప్పటికీ ఉన్నతస్థాయి అధికారులెవ్వరూ ఆ ఉచ్చులో పడలేదు. ఒకరిద్దరు కిందిస్థాయి ఉద్యోగులే కుట్రకు పాల్పడ్డారు. నిజానికి వ్యవస్థ అత్యంత బలంగా ఉన్నప్పుడే శత్రువులు హనీట్రాప్ తరహా పాచికలువేస్తారు. ఏదిఏమైనప్పటికీ ఉద్యోగులు ఉగ్రవాదుల ఉచ్చులో పడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం' అని పారికర్ పేర్కొన్నారు. -
ఉరిశిక్ష కేసుల్లో క్షమాభిక్షలే ఎక్కువ
ఇప్పటివరకు 306 మందికి క్షమాభిక్ష 131 పిటిషన్ల తిరస్కరణ న్యూఢిల్లీ: మరణశిక్షను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లలో 306 పిటిషన్లను భారత రాష్ట్రపతులు ఆమోదించి.. పిటిషనర్లకు పడిన మరణశిక్షను రద్దుచేశారు. న్యాయ కమిషన్ సోమవారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. ఉగ్రవాదం, దేశంపై యుద్ధం కేసుల్లో మినహా మిగతా కేసుల్లో మరణశిక్షను రద్దు చేయాలని సిఫార్సు చేసిన ఆ నివేదికలో.. 1950 జనవరి 26 నుంచి మంగళవారం వరకూ రాష్ట్రపతులు పరిష్కరించిన క్షమాభిక్ష పిటిషన్ల వివరాలను తెలిపింది. మొత్తం 437 క్షమాభిక్ష దరఖాస్తులు అందగా, వాటిలో 306 పిటిషన్లను ఆమోదించి, వారి మరణశిక్షను జీవితాంతం జైలుశిక్షగా మార్చారని, 131 పిటిషన్లను తిరస్కరించారని వివరించింది. మరణశిక్ష ఎదుర్కొంటున్న దోషి జీవన్మరణాల భవిష్యత్తు.. అప్పటి సర్కారు అభిప్రాయాలపైనే కాకుండా.. రాష్ట్రపతుల వ్యక్తిగత అభిప్రాయాలపై కూడా ఆధారపడి ఉందని పేర్కొంది. వివరాలు.. బాబూరాజేంద్రప్రసాద్ 181 క్షమాభిక్ష దరఖాస్తులపై నిర్ణయం తీసుకోగా.. వాటిలో కేవలం ఒక్క దరఖాస్తునే తిరస్కరించారు. ఎస్. ధాకృష్ణన్ నిర్ణయం తీసుకున్న 57 దరఖాస్తులనూ ఆమోదించారు. జాకీర్‌హుస్సేన్, వి.వి.గిరిలు తాము నిర్ణయం తీసుకున్న అన్ని క్షమాభిక్ష పిటిషన్లనూ ఆమోదించారు. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, నీలం సంజీవరెడ్డిలు వారి హయాంలో ఏ ఒక్క క్షమాభిక్ష పిటిషన్‌పైనా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. 1950-1982 మధ్య ఆరుగురు రాష్ట్రపతులు కేవలం ఒకే పిటిషన్‌ను మాత్రమే తిరస్కరించి.. 262 పిటిషన్లను ఆమోదించారు. 1982-1997 మధ్య ముగ్గురు రాష్ట్రపతులు 93 క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించి.. 7 పిటిషన్లను ఆమోదించారు. జైల్‌సింగ్ తను నిర్ణయించిన 32 పిటిషన్లలో 30 పిటిషన్లను తిరస్కరించారు. ఆర్.వెంకటరామన్ 50 పిటిషన్లపై నిర్ణయం తీసుకుని 45 పిటిషన్లను తిరస్కరించారు. శంకర్‌దయాళ్‌శర్మ తన ముందుకు వచ్చిన మొత్తం 18 క్షమాభిక్ష పిటిషన్లనూ తిరస్కరించారు. 1997-2007 మధ్య ఇద్దరు రాష్ట్రపతులు తమ వద్దకు వచ్చిన దాదాపు అన్ని పిటిషన్లనూ పెండింగ్‌లో పెట్టారు. కె.ఆర్.నారాయణన్ తన ముందుకు వచ్చిన ఏ ఒక్క క్షమాభిక్ష పిటిషన్ పైనా నిర్ణయమూ తీసుకోలేదు. అబ్దుల్‌కలాం కేవలం రెండు క్షమాభిక్ష పిటిషన్లపైనే నిర్ణయం తీసుకున్నారు. ఒక దాన్ని ఆమోదించి, మరొకదాన్ని తిరస్కరించారు. ప్రతిభాపాటిల్ తన హయాంలో ఐదు క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించి.. 34 క్షమాభిక్ష పిటిషన్లను ఆమోదించారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఇప్పటివరకూ 33 క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయం తీసుకోగా.. వాటిలో 31 క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించారు. క్షమాభిక్ష అభ్యర్థనలపై రాష్ర్టపతులనిర్ణయాలు అంగీకారం తిరస్కారం మొత్తం బాబూ రాజేంద్రప్రసాద్ 180 1 181 సర్వేపల్లి రాధాకృష్ణన్ 57 0 57 జాకీర్‌హుస్సేన్ 22 0 22 వీవీ గిరి 3 0 3 ఫకృద్దీన్ అలీ అహ్మద్ - - - నీలం సంజీవరెడ్డి - - - జ్ఞానీ జైల్‌సింగ్ 2 30 32 ఆర్.వెంకట్రామన్ 5 45 50 శంకర్‌దయాళ్‌శర్మ 0 18 18 కేఆర్ నారాయణన్ 0 0 0 అబ్దుల్ కలాం 1 1 2 ప్రతిభాపాటిల్ 34 5 39 ప్రణబ్ ముఖర్జీ 2 31 33 -
అర్ధరాత్రి తెరుచుకున్న ‘సుప్రీం’ తలుపులు
-
400 మంది ఖైదీలకు క్షమాభిక్ష
చెన్నై: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు వందల మంది ఖైదీలకు పెరోల్ లభించింది. రాష్ట్రంలో ఉన్న తొమ్మిది సెంట్రల్ జైళ్లలో ఐదు వేల మందికి పైా ఖైదీలు నిర్బంధంలో ఉన్నారు. వీరిలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు తరచూ పెరోల్‌పై విడుదల చేస్తారు. ప్రస్తుతం పొంగల్ పండుగ సందర్భంగా చాలా మంది ఖైదీలు పెరోల్ కోరుతూ జైలు అధికారులకు వినతిపత్రా లు అందజేశారు. దీని ప్రకారం తొమ్మిది సెంట్రల్ జైళ్ల నుంచి సుమారు 400 ఖైదీలకు పెరోల్ అందజేసినట్లు జైలు అధికారి ఒకరు తెలిపారు. దీని ప్రకారం సేలం సెంట్రల్ జైళ్లో 40 మంది శిక్షా ఖైదీలకు పెరోల్ లభించింది. ఒక్కొక్కరికి మూడు రోజుల నుంచి ఆరు రోజుల వరకు పెరోల్ అందజేశారు. దీని గురించి జైలు అధికారి మాట్లాడుతూ జైలులో వున్న శిక్షా ఖైదీ ప్రవర్తనను దృష్టిలో ఉంచుకుని పెరోల్ అందజేస్తామన్నారు. ఈ పెరోల్ ముగియగానే వారు జైళ్లకు చేరుకోవాలని తెలిపారు. -
జైళ్లలో జీవిత ఖైదీలు
20 ఏళ్లుగా మగ్గుతున్న వందమంది కమిటీ సిఫార్సుల మాటేమిటి? చెన్నై, సాక్షి ప్రతినిధి: రాజీవ్‌గాంధీ హత్యకేసులో ఉరిశిక్ష ఖైదీల క్షమాభిక్ష, విడుదల పుణ్యమా అని జైళ్లలోని ఖైదీల స్థితిగతుల వ్యవహారం చర్చనీయాంశమైంది. ఆ ఏడుగురి విడుదలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోరుసాగుతుండగా, తమ సంగతేంటని 20 ఏళ్లుగా జైళ్లలో మగ్గుతున్న జీవితఖైదీలు ప్రశ్నిస్తున్నారు. రాజీవ్ హత్యకేసులో ఉరిశిక్ష ఖైదీలుగా శిక్షను అనుభవిస్తున్న పేరరివాళన్, శాంతన్, మురుగన్‌లకు సుప్రీం కోర్టు క్షమాభిక్ష ప్రసాదిస్తూ జీవితఖైదీలుగా మార్చిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ ముగ్గురిని జైలు నుంచి విడుదల చేసే అధికారాన్ని కొన్ని చిన్నపాటి షరతులతో సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సీఎం జయలలిత పై ముగ్గురితోపాటూ ఆ కేసులో శిక్షను అనుభవిస్తున్న మరో నలుగురిని కలుపుకుని మొత్తం ఏడుగురిని విడుదల చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. అయితే ఇందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ క్షమాభిక్షకు నోచుకున్న ఏడుగురి విడుదల ప్రశ్నార్థకమైంది. ఏడుగురు ఖైదీల విడుదలకు కేంద్రం అడ్డుకోవడం రాష్ట్రంలో ఆగ్రహాన్ని రగిల్చింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. 4 వేల మంది జీవితఖైదీలు: రాష్ట్రంలో నాలుగువేల మంది జీవిత ఖైదీలు వివిధ జైళ్లలో ఉన్నారు. వీరిలో సుమారు వందమంది 20 ఏళ్లకు పైగా శిక్షను అనుభవిస్తున్నారు. జీవితఖైదీకి గురైన వ్యక్తి జైలులో సత్ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే, సెలవులు ఇతర దినాలను కలుపుకుని పదేళ్లకే విడుదలయ్యే అవకాశం ఉంది. అదే ఉరిశిక్ష ఖైదీ యావజ్జీవ ఖైదీగా మారిన పక్షంలో అతని ప్రవర్తనను బట్టీ 14 ఏళ్ల తరువాత విడుదలయ్యే వెసులుబాటు ఉంది. జైలు జీవితంలో ఎటువంటి తప్పిదాలకు పాల్పడినా, ఆరోపణలకు గురైనా చట్టపరంగా పొందే రాయితీలన్నీ అమల్లోకి రావు. ఖైదీల ప్రవర్తనను విశ్లేషించి నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జైలు సూపరింటెండెంట్, ఇద్దరు సంఘ సంస్కర్తలతో ఒక కమిటీ పనిచేస్తుంది. ఖైదీల ప్రవర్తనపై ఒక నివేదికను తయారుచేసి విడుదలకు అర్హులైన ఖైదీల పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతారు. ఈ నివేదికను ఆధారం చేసుకుని ప్రభుత్వం తన నిర్ణయాన్ని అమలుచేస్తుంది. ఈ లెక్కన రాష్ట్రం మొత్తం మీద వివిధ జైళ్లలో నాలుగు వేల మంది జీవితఖైదీలు ఉన్నారు. వీరిలో వందమంది ఖైదీలు 20 ఏళ్ల శిక్షాకాలాన్ని దాటివేశారు. రాజీవ్‌హత్యకేసులోని ఏడుగురి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడం తమ సంతోషకరమే, అయితే నడవడిక ప్రకారం విడుదల కావాల్సిన తమ మాటేమిటని వారు పోతున్నారు. సత్ప్రవర్తనా కమిటీ సమావేశమై అర్హులకు జైలు జీవితం నుంచి విముక్తి ప్రసాదించాలని వేడుకుంటున్నారు.