దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనట్లుగా సుప్రీంకోర్టు తలుపులు అర్ధరాత్రి తెరుచుకున్నాయి. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు కోర్టు తలుపులు తీశారు. ఉరిశిక్షను వాయిదా వేయాలంటూ యాకూబ్ మెమన్ తరఫు న్యాయవాదులు చిట్టచివరి నిమిషంలో దాఖలు చేసిన పిటషన్ ను విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు అంగీకరించడంతో సుప్రీంకోర్టు చరిత్రలోనే ఎన్నడూ లేనట్లుగా అర్ధరాత్రి 4వ నెంబరు కోర్టులో వాదనలు కొనసాగాయి.