
యస్పీ బాలసుబ్రహ్మణ్యం
కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు కావాల్సిన జాగ్రత్తలు పాటించమని సినిమా స్టార్స్ తమ సోషల్ మీడియా ద్వారా అభిమానులందర్నీ కోరుతున్నారు. అయితే ఒక్కొక్కరిదీ ఒక్కో స్టయిల్. ప్రముఖ గాయకులు యస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాపై తమిళంలో ఓ పాట కంపోజ్ చేసి, పాడారు. ఈ పాటను రచయిత వైరముత్తు రచించారు. ప్రస్తుత సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ ఈ పాటను రాశారు. ఈ పాటను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు యస్పీబీ.
Comments
Please login to add a commentAdd a comment