కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌కు ప్రజలకు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు సెలబ్రిటీలు సైతం సామాజిక దూరాన్ని పాటించాలంటూ ఎవరికి తోచిన విధంగా వారు అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా ప్రజలు సామాజిక దూరం పాటించాలంటూ పాట ద్వారా సోషల్ మీడియాలో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. కరోనా వ్యాప్తిని ఎలా అరికట్టాలో పాటించాల్సిన విధానాన్ని స్టేప్ బై స్టేప్ వివరిస్తున్న పాటను సోషల్ మీడియాలో శుక్రవారం షేర్ చేశారు. ఈ పాటను ప్రముఖ రచయిత వైరముత్తు రాసినట్లు కూడా ఆయన తెలిపారు. (భయం, నిర్లక్ష్యం వద్దు: చిరంజీవి)
ఇక ఈ వీడియో చివరలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వైరముత్తులు ప్రజలు ఈ మహమ్మారిపై ఆందోళన చెందకుండా వ్యక్తిగత శుభ్రత పాటించాలని కోరారు. వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే ప్రజలు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఇటీవల ‘కరోనా ప్రాణాంతక వైరస్ కాకపోవచ్చు కానీ నిర్లక్ష్యం చేస్తే మహమ్మారిగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి షేక్ హ్యండ్ ఇవ్వకుండా.. నమస్కారం చెబుదాం’ అంటూ మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో ద్వారా అభిమానులకు, ప్రజలకు సామాజిక దూరం పాటించాలంటూ సందేశం అందించిన విషయం తెలిసిందే. (కరోనా: సెలబ్రిటీల ప్రతిజ్ఞ)
Comments
Please login to add a commentAdd a comment