
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత తాను కరోనా బారిన పడినట్లు తెలిపారు. కొద్ది రోజుల క్రితం తనకు మహమ్మారి సోకిందని.. అయితే ప్రసుతం దాని నుంచి కోలుకున్నట్లు వెల్లడించారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందవద్దని అభిమానులు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు సునీత ఫేస్‌బుక్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.
ఓ ప్రోగ్రాం షూటింగ్ సమయంలో తనకు తలనొప్పి రాగా టెస్టు చేయించుకోవడంతో.. కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. అప్పటి నుంచి వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటూ హోం ఐసోలేషన్‌లో ఉండి ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్లు తెలిపారు. మహమ్మారితో పోరాటం అంత సులువేమీ కాదని.. కాబట్టి అందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.(సింగర్ సునీత పేరుతో బయటపడ్డ మరో మోసం)
బాలు సర్ త్వరగా కోలుకోవాలి
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై సునీత ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని తాను, తన కుటుంబ సభ్యులు ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా బాలసుబ్రహ్మణ్యం ఈనెల 5న కరోనా బారిన పడిన విషయం విదితమే. దీంతో గత కొన్ని రోజులుగా చెన్నై చూలైమేడులోని ఎంజీఎం ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం బాలు కోలుకుంటున్నట్లు ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.(బాలూ కోలుకో)
Comments
Please login to add a commentAdd a comment