vairamuthu
-
ఆ పని నాది కాదు.. వైరముత్తుకు కౌంటర్ ఇచ్చిన ఇళయరాజా!
తమిళసినిమా: ఇతరుల గురించి పట్టించుకోవడం తన పని కాదని, అంత తీరిక కూడా తనకు లేదని, తన పనిని తాను సక్రమంగా చేసుకుంటున్నానని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పేర్కొన్నారు. ఇటీవల ఈయన పేరు నిత్యం వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఇళయరాజా సంగీతాన్ని అందించిన పాటకు కాపీ రైట్స్ కోరుతున్న విషయం విధితమే. ఈ వ్యవహారం కోర్టులో ఉంది. ఇటీవల తన అనుమతి లేకుండా తన సంగీతాన్ని కాపీ కొట్టారంటూ సన్ పిక్చర్స్ సంస్థకు నోటీసులు కూడా జారీ చేశారు. అసలు సంగీతం గొప్పదా? సాహిత్యం గొప్పదా? అనే ప్రశ్నకు గీతరచయిత వైరముత్తు తెర లేపారు. ఇలాంటి పరిస్ధితుల్లో ఇళయరాజా గురువారం ఒక వీడియోను తన సామాజిక మాధ్యమం ద్వారా విడుదల చేశారు. అందులో ఇటీవల తన గురించి ఏవేమో వార్తలు వస్తున్నట్లు వింటున్నానన్నారు. అయితే వాటి గురించి పట్టించుకునే సమయం తనకు లేదని, అలాంటి వాటిపై దృష్టి పెట్టడం తన పని కాదన్నారు. తన పని తాను సక్రమంగా చేసుకుంటున్నానని, చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూనే, ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నానని, అయినప్పటికీ 35 రోజుల్లో సింపోనీ రాసి పూర్తిచేసినట్లు చెప్పారు. ఇది సంతోషకరమైన విషయం అని పేర్కొన్నారు. ఇళయరాజా జూలై 14న భారీ సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్థానిక నందనంలోని వీఎంసీఏ గ్రౌండ్లో జరగనున్న ఈ సంగీత విభావరిలో ఇళయరాజా కనీసం 50 నుంచి 60 పాటలు పాడే అవకాశం ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. pic.twitter.com/6Bkj59HOhi— Ilaiyaraaja (@ilaiyaraaja) May 16, 2024 -
మళ్లీ రెచ్చిపోయిన సింగర్ చిన్మయి.. తమిళనాడు సీఎంపైనే విమర్శలు!
ప్రముఖ సింగర్ చిన్మయి మరోసారి తన రెచ్చిపోయింది. తనని లైంగికంగా వేధించి, కెరీర్ సర్వనాశనం అయ్యేలా చేసిన వ్యక్తిపై, అతడితో పాటు ఉన్న కమల్ హాసన్, పి.చిదంబరం, సీఎం స్టాలిన్ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సింగర్ చిన్మయి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. (ఇదీ చదవండి: ఎంగేజ్మెంట్ చేసుకున్న 'దసరా' విలన్.. అమ్మాయి ఎవరో తెలుసా?) అసలేం జరిగింది? ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు రాసిన 'మహా కవితై' పుస్తకావిష్కరణ తాజాగా చెన్నైలో జరిగింది. దీనికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరం, స్టార్ హీరో కమల్‌హాసన్ తదితరులు హాజరయ్యారు. 'నన్ను వేధింపులకు గురిచేసిన వ్యక్తితో కలిసి తమిళనాడుకు చెందిన కొందరు ప్రముఖులు వేదికపై ఉన్నారు. అతడి గురించి బయటకు చెప్పిన నేను మాత్రం నిషేధానికి గురయ్యాను. కొన్నేళ్లపాటు నా వృత్తి జీవితాన్ని కోల్పోయాను. నా కోరిక నెరవేరేవరకు ప్రార్ధించడం మినహా నేను చేసేది ఏమీలేదు' అని చిన్మయి ట్వీట్స్ చేసింది. అసలేంటి గొడవ? సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ అయిన చిన్మయి.. 2018లో రైటర్ వైరముత్తుపై ఆరోపణలు చేసింది. తనని ఈయన లైంగికంగా వేధించాడని బయటపెట్టింది. మీటూ ఉద్యమం జరుగుతున్న సమయంలో చిన్మయి ఈ ఆరోపణలు చేసింది. ఈమెతో పాటు పలువురు కూడా వైరముత్తు నిజస్వరూపాన్ని బయటపెట్టారు. అయితే వైరముత్తుపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. తమిళ ఇండస్ట్రీలో చిన్మయిపై నిషేధం విధించారు. దీంతో అప్పటినుంచి వైరముత్తపై చిన్మయి ఎప్పటికప్పుడు విరుచుకపడుతూనే ఉంది. ఇప్పుడు కూడా అలానే వైరముత్తుకి సపోర్ట్ చేస్తున్న స్టాలిన్, కమల్ తదితరులపై కూడా విమర్శలు చేసింది. (ఇదీ చదవండి: న్యూ ఇయర్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 25 సినిమాలు) Some of the most powerful men in Tamilnadu platforming my molester whilst I got banned - years of my career lost. May the entire ecosystem that promotes and supports sex offenders whilst incarcerating honest people who speak up start getting destroyed from this very moment,… https://t.co/J7HcqJYAcV — Chinmayi Sripaada (@Chinmayi) January 1, 2024 Thodangi? yevangalta nyayathukku poganum? Ivangaltaya? Just check the number of politicians with Vairamuthu alone. How does one get justice in this ecosystem? https://t.co/0ubXKXZq7e pic.twitter.com/xjnVZL0xwb — Chinmayi Sripaada (@Chinmayi) January 1, 2024 -
పాత సినిమాల పోస్టర్లు అలా ఉండేవి.. కానీ ఇప్పుడు?: వైరముత్తు
మాపిల్ లీఫ్ ప్రొడక్షన్స్ పతాకంపై నటుడు ఈవీ గణేష్ బాబు కథానాయకుడిగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం కట్టిల్. ప్రముఖ ఎడిటర్ బి.లెనిన్ కథ, కథనాలు అందించిన ఈ చిత్రంలో సృష్టిడాంగే హీరోయిన్గా నటించారు. వైరముత్తు మదన్ పాటలను రాసిన ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత శ్రీకాంత్ దేవా సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 24న విడుదలకు సిద్ధమవుతోంది. తుపాకీ శబ్ధాల మధ్య పిల్లనగ్రోవిలా ఉంటుందీ సినిమా ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చైన్నెలోని సత్యం థియేటర్లో చిత్ర ఆడియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న గీత రచయిత వైరముత్తు మాట్లాడుతూ కట్టిల్ వంటి చిన్న చిత్రాలు బాగా ఆడితేనే తమిళ సినిమాకు మంచిదని పేర్కొన్నారు. ఇలాంటి చిత్రాలతోనే ప్రతిభావంతులైన నూతన కళాకారులు లభిస్తారన్నారు. భారీ బడ్జెట్ సినిమాలు చూడాలని ఆసక్తిని కలిగిస్తాయని.. అలాంటి తుపాకీ శబ్దాల మధ్య గణేష్ బాబు కట్టిల్ చిత్రంతో పిల్లల గ్రోవి వాయిస్తున్నారని పేర్కొన్నారు. మంచి కథాంశంతో రూపొందిన చిన్న చిత్రాలు మన మనసుల్ని ఉల్లాసపరిచి గాల్లో తేలేలా చేస్తాయన్నారు. కట్టిల్ చిత్ర ఆడియో ఆవిష్కరణలో ప్రముఖులతో యూనిట్ సభ్యులు అలాంటివి చూస్తున్నారా? ఇలాంటి చిత్రాలే ఆలోచనలను పెంచుతాయన్నారు. పాత సినిమాల పోస్టర్లను చూస్తే అందులో మహిళలకు ప్రాముఖ్యత నిచ్చేవిగా ఉన్నాయన్నారు. ఇప్పుడు మహిళలకు ప్రాధాన్యతనిచ్చే చిత్రాలను చూడగలుగుతున్నామా..? అని ప్రశ్నించారు. మహిళలకు సమానత్వం కలిగించే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రిలీజయినప్పుడే అది మంచి కాలం అనీ, అలాంటి కాలాన్ని గణేష్ బాబు కట్టిల్ చిత్రంతో తీసుకొచ్చారని వైరముత్తు పేర్కొన్నారు. ఆయన భావాలను, బాధను తెరపై ఆవిష్కరించిన చిత్రం కట్టిల్ అనీ, ఈ చిత్ర గీత రచయిత మదన్ కార్తీకి, దర్శకుడు గణేష్ బాబుకు జాతీయ అవార్డు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చదవండి: భార్యకు విడాకులు ఇవ్వనున్న విజయ్? ఈ నటి మాటల్లోనే ఆన్సర్ దొరికేసింది! -
మీరు అలా మాట్లాడుతుంటే సిగ్గేస్తోంది సార్: సీఎం తీరుపై సింగర్ ఫైర్
సింగర్ చిన్మయి పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై ఇప్పటికీ పోరాడుతూనే ఉంది. గతంలో మీటూ ఉద్యమంలో పలువురిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. తమిళ పాటల రచయిత వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలతో ఆమెను కోలీవుడ్ నుంచి నిషేధానికి కుడా గురైంది. అయితే తాజాగా గురువారం వైరముత్తు బర్త్ డే సందర్భంగా సీఎం స్టాలిన్ చేసిన పనికి మరోసారి వార్తల్లో నిలిచింది. ట్విటర్ వేదికగా ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. (ఇది చదవండి: నాది చాలా చిన్న వయసు.. వారి ఉద్దేశమేంటో గుర్తించలేకపోయా: బుల్లితెర నటి) సింగర్ చిన్మయి చేసిన ట్వీట్ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వైరముత్తు బర్త్ డే సందర్భంగా సీఎం స్టాలిన్ వ్యక్తిగతంగా కలిసి.. ఇంటికి వెళ్లి మరీ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సింగర్ చిన్మయికి ఆగ్రహం తెప్పించింది. రాజకీయ నాయకులు మహిళల భద్రతల గురించి మాట్లాడితే సిగ్గేస్తోందని ఘాటుగా విమర్శించింది. రాజకీయ నాయకుల అండతోనే వారు మరింత రెచ్చిపోతున్నారని ఆరోపించింది. ట్వీట్లో చిన్మయి రాస్తూ.. 'తమిళనాడు ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంటికి వెళ్లి అతని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపడం. నేను ఒక మహిళగా అతనిపై మీటూ ఉద్యమంలో ఆరోపణలు చేసినందుకు 2018 నుంచి తమిళ ఇండస్ట్రీలో బ్యాన్ విధించారు. రాజకీయ అండతో ఒక రచయిత ఏ స్త్రీపైనా చేయి వేయగలడని ఫిక్స్ అయిపోయాడు. రాజకీయ నాయకులతో అతనికి ఉన్న సాన్నిహిత్యంతో మౌనంగా ఉండమని ఓ మహిళను బెదిరించాడు. అందుకే పద్మ అవార్డులు, సాహిత్య నాటక అకాడమీ, జాతీయ అవార్డులను అందుకున్నాడు. ఈ మనిషికి ఉన్న శక్తి ఇది. నన్ను చాలా మంది మహిళలు ఇంతకు ముందు ఎందుకు మాట్లాడలేదని అడిగారు. తమిళనాడులో రాజకీయ నాయకులు చేసే ప్రసంగాల్లో మహిళల భద్రత కోసం మాట్లాడడం తలుచుకుంటే సిగ్గేస్తోంది. ఎందుకంటే వైరముత్తు అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు వారంతా మౌనంగా ఉంటారు. ఈ భూమి అద్భుతమైన సంస్కృతిని కలిగి ఉంది. ప్రతి సంవత్సరం మహిళలను వేధించేవారి పుట్టినరోజు జరుపుకుంటారు. కానీ వీటిపై మాట్లాడిన మహిళలను వేధిస్తారు. మనకు సున్నితత్వం, సానుభూతి, విద్యపైనా అవగాహన మాత్రం శూన్యం. బ్రిజ్ భూషణ్ నుంచి వైరముత్తు వరకు ఎల్లప్పుడు రాజకీయ నాయకులు వీరిని కాపాడతారు. ఈ భూమిలో ప్రాథమికంగా దొరకని న్యాయం కోసం ఎదురుచూడటం బాధాకరమైన విషయం' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (ఇది చదవండి: ప్రియుడిని పెళ్లాడిన హీరోయిన్, వీడియో వైరల్) The Chief Minister of Tamilnadu personally visits the home of a man accused by several women of sexual harassment to wish him on his birthday; I, as a multiple award winning singer and voice over artiste, face a work ban by the Tamil Film Industry since 2018, for naming this poet… https://t.co/8RpQ120swZ — Chinmayi Sripaada (@Chinmayi) July 13, 2023 -
వైరముత్తు నవలలో విక్రమ్ నటిస్తారా?
తమిళ సినిమా: వైవిధ్యానికి మారుపేరు నటుడు విక్రమ్. ఈయన నటించే చిత్రాల్లో నటుడు కనిపించరు పాత్రలే కనిపిస్తాయి. అన్నియన్, ఐ వంటి చిత్రాలు ఈ కోవలోకే వస్తాయి. తాజాగా విక్రమ్ నటిస్తున్న మరో విభిన్నమైన కథా చిత్రం తంగలాల్. పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్‌ను గుర్తు పట్టడం చాలా కష్టం. అంతగా మేకోవర్ అయ్యి ఆ పాత్రకు ప్రాణం పోస్తున్నారు. కాగా ఈయన నటుడు కార్తీ, జయం రవి, విక్రమ్ ప్రభు, త్రిష, ఐశ్వర్య రాయ్, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, ప్రభు, పార్తీపన్ వంటి ప్రముఖ నటీనటులతో కలిసి మణిరత్నం దర్శకత్వంలో నటించిన భారీ చారిత్రాత్మక కథా చిత్రం పొన్నియిన్ సెల్వన్. ఈ చిత్ర రెండో భాగం భారీ అంచనాల మధ్య ఈ నెల 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. మరిన్ని చిత్రాలు విక్రమ్ చేతిలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఆసక్తికరమైన ప్రచారం కోలీవుడ్‌లో జరుగుతోంది. ప్రముఖ గీత రచయిత వైరముత్తు రాసిన నవల కళ్లికాట్టు ఇతిహాసం. 14 గ్రామ ప్రజల పోరాటమే ఈ నవలలోని ప్రధానాంశం. ఇది 2003 సాహితీ అకాడమీ అత్యున్నత అవార్డును గెలుచుకుంది. కాగా ఈ నవల ఆంగ్లం, హిందీ తదితర 7 భాషల్లో అనువదించారు. తాజాగా ఈ నవలను సినిమాగా తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. చదవండి: ఇది నా జీవితం.. నిర్ణయం కూడా నేనే తీసుకుంటా: సిమ్రాన్ దీనికి మదయానై కూట్టం చిత్రం ఫేమ్ విక్రమ్ సుకుమార్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. అసలు విషయం ఏమిటంటే ఇందులో నటుడు సియాన్ విక్రమ్‌ను కథానాయకుడిగా నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. అయితే ఆయన అందులో నటించడానికి సమ్మతిస్తారా? లేదా అన్నది ఆసక్తిగా మారింది. -
ఆ నిర్మాతను కలిసిన నటి.. వార్నింగ్ ఇచ్చిన సింగర్ చిన్మయి
సింగర్ చిన్మయి.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. గాయనీగా, నటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా చిన్మయి ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఆమె సింగర్‌గా కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా మీ టూ ఉద్యమం నేపథ్యంలో చిన్మయి బాగా పాపులర్ అయ్యింది. అప్పట్లో నిర్మాత వైరముత్తుపై ఆమె చేసిన లైంగిక ఆరోపణలు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ఇక చిన్మయి సోషల్ మీడియా వేదికగా కూడా పలు సామాజీక అంశాలపై స్పందిస్తూ ఉంటుంది. చదవండి: ఆనందంలో ఐశ్వర్యను హగ్ చేసుకున్న అభిషేక్, ఆకట్టుకుంటున్న వీడియో అంతేకాదు యువతకు, మహిళలు సూచనలు ఇస్తూ వారిలో ధైర్యం నింపుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా చిన్మయి సోషల్ మీడియా వేదికగా ఓ నటిని హెచ్చరించింది. ప్రముఖ తమిళ నిర్మాతను కలిసి ఆమెకు చిన్మయి వార్నింగ్ ఇస్తూ సూచనలు ఇచ్చింది. వివరాలు.. తమిళ నటి, వీజే అర్చనా అర్చన ఓ సినిమా షూటింగ్లో పాల్గొంది. ఆ షూటింగ్ సెట్‌కు వచ్చిన నిర్మాత వైరముత్తును ఆమె కలుసుకుంది. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో తన ఫొటోలపై చిన్మయి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘అది ఇలాగే మొదలవుతుంది. అతనితో చాలా జాగ్రత్తగా ఉండు. వీలైతే అతడికి తగినంత దూరం పాటించు. ముఖ్యంగా ఇలా ఒంటరిగా అసలు కలవకు. నీతో తోడుగా ఎవరైనా ఉండేలా చూసుకో.. జాగ్రత్త’ అంటూ అర్చన పోస్ట్‌కు కామెంట్ చేసింది. దీంతో ఆమె కామెంట్ తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. కాగా నటి చిన్మయి శ్రీపాద ప్రముఖ తమిళ పాటల రచయిత వైరముత్తు మధ్య గత కొన్నేళ్లుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. వైరముత్తు తనను లైంగికంగా వేధించాడంటూ చిన్మయి సంచలన ఆరోపణలు చేశారు. చదవండి: రామ్ చరణ్‌పై ‘కింగ్ ఖాన్’ షారుక్ ఆసక్తికర వ్యాఖ్యలు View this post on Instagram A post shared by Archana R (@vj_archana_) -
అందుకే ఆయన పొన్నియిన్ సెల్వన్‌లో భాగం కాలేదు: మణిరత్నం
కోలీవుడ్‌లో తెరకెక్కిన ఎన్నో హిట్ చిత్రాలకు పనిచేసిన పాటల రచయిత 'వైరముత్తు'. అంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్నా ఆయన.. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పలు చిత్రాలకు గతంలో సాహిత్యమందించారు. వైరముత్తు పాటలు సినీ ప్రియుల్ని కట్టిపడేసేలా ఉంటాయి. మరీ తాజాగా మణిరత్నం రూపొందించిన కొత్త చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’లో మాత్రం వైరముత్తు ఎందుకు లేరు. దీనికేమైనా ప్రత్యేక కారణాలున్నాయా అన్న చర్చ నడుస్తోంది. అయితే ఇటీవల జరిగిన ఓ సమావేశంలో అడిగిన ప్రశ్నకు తాజాగా మణిరత్నం స్పందించారు. 'వైరముత్తు టాలెంట్ విషయంలో ఎలాంటి సందేహం లేదు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సైతం వైరముత్తు టాలెంట్‌ను మెచ్చుకునేవారు. నేను ఆయనతో కలిసి ఎన్నోసార్లు పనిచేశా. ఆయన సాహిత్యాన్ని నా సినిమాల్లో ఉపయోగించా. అతనొక అద్భుతం. అయితే వైరముత్తును మించిన కొత్త టాలెంట్ ప్రస్తుతం పరిశ్రమలో ఉంది. కొత్త తరానికి ప్రోత్సాహమందించాలి’ అందుకే అని మణిరత్నం వివరణ ఇచ్చారు. గతంలో వైరముత్తుపై మీటూ ఆరోపణలు రావడంతో దూరం పెట్టారని కోలీవుడ్‌లో వార్తలొస్తున్నాయి. (చదవండి: పొన్నియిన్ సెల్వన్ ఆ నటితో చేద్దామనుకున్నా: మణిరత్నం) అయితే గతంలో వైరముత్తు తమను వేధింపులకు గురి చేశాడంటూ కొంతమంది మహిళలు ‘మీటూ’ వేదికగా ఆరోపించారు. ప్రముఖ గాయని చిన్మయి సైతం ఆయనపై ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే వైరముత్తుతో పనిచేసేందుకు పలువురు సినీ ప్రముఖులు వెనకాడుతున్నట్లు అప్పట్లోనే కోలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొట్టాయి. మణిరత్నం, వైరముత్తు చివరి చిత్రం 'చెక్క చివంత వానం' (2018). ఈ చిత్రంలో 'మజై కురువి' 'భూమి భూమి' లాంటి హిట్ సాంగ్స్ ఉన్నాయి. పొన్నియిన్ సెల్వన్ కోసం ఇళంగో కృష్ణన్ మూడు పాటలు, కబిలన్, శివ అనంత్, కృతికా నెల్సన్లు మరో మూడు పాటలు రాశారు. -
వైరముత్తుకు సీఎం, రాజకీయ నేతలు అండగా నిలవాలి : భారతీరాజా
చెన్నై: సినీ గీత రచయిత వైరముత్తుకి సీఎం, రాజకీయ నాయకులు అండగా నిలవాలని సీనియర్ దర్శకుడు భారతీరాజా విజ్ఞప్తి చేశారు. గీత రచయిత వైరముత్తు నాలుగైదు రోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. కేరళకు చెందిన ప్రఖ్యాత దివంగత కవి, గీత రచయిత ఓఎన్వీ గురుప్ పేరుతో నెలకొల్పిన ఓ ఎన్ వి జాతీయ సాహితీ అవార్డును వైరముత్తుకు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అనంతరం ఆయన ఈ అవార్డును ప్రకటించడంపై మలయాళనటి పార్వతి, గాయని చిన్మయి వంటి వారు తీవ్రంగా వ్యతిరేకించారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఓ ఎన్ వి జాతీయ సాహితీ అవార్డును ప్రధానం చేయడమా? అంటూ విమర్శించారు. దీంతో ఓ ఎన్ వి సాంస్కృతిక అకాడమీ నిర్వాహకులు వైరముత్తుకు ఈ అవార్డును ప్రదానం చేయనుండటంపై పునరాలోచన చేస్తామని వెల్లడించారు. ఈ వ్యవహారం వైరముత్తుకు తీవ్ర అవమానమే అనిచెప్పవచ్చు. అయితే ఈ అవార్డును అందుకోకుండానే వైరముత్తు దాన్ని తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించి మరోసారి విమర్శలకు గురయ్యారు. ఇలాంటి పరిణామాల మధ్య సీనియర్ దర్శకుడు భారతీరాజా వైరముత్తుకు అండగా నిలిచారు. ఆయన శనివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. భాష, రాజకీయ విద్వేషాలు కలిగి ఎక్కడి నుంచో వచ్చి మాతృభూమికి కళంకం ఏర్పరిచే విధంగా కొందరు మతం, జాతి, భాష పేరుతో విడగొట్టే దాడులు చేస్తున్నారు. ఇలాంటి చర్యలను తమిళులమైన మనమందరం పుల్‌స్టాప్ పెట్టాలి. ప్రపంచ తమిళుందరితో కవి పేరరసు అనే బిరుదుతో గంభీరంగా నిలబడే కవి మిమ్మల్ని వంచాలని ప్రయత్నించే వారి కల కలగానే మిగిలిపోతుంది. తమిళులకు ఎప్పుడు అండగా నిలబడి తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతలు, ఇతర రాజకీయ వాదులు వైరముత్తుకు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నానని దర్శకుడు భారతీరాజా పేర్కొన్నారు. చదవండి : వైరముత్తుకు భారీ షాక్.. ఓఎన్వీ అవార్డు వెనక్కి? లైంగిక ఆరోపణలేగా!.. మేమూ తగ్గం -
వైరముత్తుకు భారీ షాక్.. ఓఎన్వీ అవార్డు వెనక్కి?
చెన్నై: సినీ గీత రచయిత వైరముత్తు తీవ్ర భంగపాటుకు గురి కాబోతున్నారని తెలుస్తోంది. ఆయనకు ఓఎన్వీ జాతీయ సాహితీ అవార్డును అందజేయనున్నట్టు ఆ అకాడమీ నిర్వాహకులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇంతకు ముందు తమిళంలో పూ, మరియాన్ తదితర చిత్రాల్లో కథానాయికగా నటించిన మలయాళ నటి పార్వతి ఓఎన్వీ గురుప్ అవార్డులు వైరముత్తుకు ప్రకటించడాన్ని తీవ్రంగా విమర్శించారు. గొప్ప కవి, సినీ గీత రచయిత ఓఎన్వీ పేరుతో నెలకొల్పిన అవార్డును లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వైరముత్తుకు ప్రకటించడం ఆయన్ని అగౌరవపరచడమేనని పేర్కొన్నారు. ఇక సంచలన గాయని చిన్మయి కూడా చాలాసార్లు వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆమె కూడా వైరముత్తుకు ఓఎన్వీ అవార్డు ప్రకటించడాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో అవార్డు ప్రదానం చేసే విషయాన్ని పునర్ పరిశీలించనున్నట్లు ఓఎన్వీ కల్చరల్ అకాడమీ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. చదవండి : అవార్డు పొందడం సంతోషంగా ఉంది : వైరముత్తు వైరముత్తుకి పురస్కారం.. హీరోయిన్ల ఆగ్రహం -
అవార్డు పొందడం సంతోషంగా ఉంది : వైరముత్తు
చెన్నై: ప్రఖ్యాత గీత రచయిత వైరముత్తుకు అరుదైన పురస్కారం లభించింది. మలయాళంలో దివంగత ప్రఖ్యాత కవి, సినీ గీత రచయిత ఓఎన్వీ గురుప్ పేరుతో 2017లో జాతీయ సాహితీ అవార్డులు ఏర్పాటు చేశారు. దీన్ని మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ కవులు, గీత రచయితలకే ప్రదానం చేస్తున్నారు. ఈ ఏడాది తమిళ ప్రఖ్యాత గీత రచయిత వైరముత్తుకు ప్రకటించారు. ఈ అవార్డును రాష్ర్టేతర ప్రముఖులకు ప్రకటించడం ఇదే ప్రథమం. అవార్డు గ్రహీతకు జ్ఞాపికతో పాటు, ధ్రువీకరణ పత్రం, రూ.3 లక్షల నగదు అందజేస్తారు. ఓఎన్వీ గురుప్ జాతీయ సాహితీ అవార్డుకు ఎంపిక కావడం గర్వంగా భావిస్తున్నట్లు వైరముత్తు పేర్కొన్నారు. వైరముత్తును సీఎం స్టాలిన్ అభినందించారు. చదవండి : వైరముత్తుకి పురస్కారం.. హీరోయిన్ల ఆగ్రహం -
లైంగిక ఆరోపణలేగా!.. మేమూ తగ్గం
చెన్నై: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ గేయ రచయిత వైరముత్తుకు వ్యతిరేకంగా మరోసారి గళం వినిపిస్తోంది. కేరళ ఒఎన్వీ గురువ్ జాతీయ పురస్కారాన్ని వైరముత్తుకు అందించడంపై పెద్ద ఎత్తున్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ ఆ పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గతంలో వైరముత్తుపై ఆరోపణలు చేసిన సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయితో పాటు మాలీవుడ్ హీరోయిన్లు కొందరు ఈ క్యాంపెయిన్‌లో పాల్గొంటున్నారు. కాగా, 2018 మీటూ ఉద్యమ సమయంలో గేయరచయిత వైరముత్తుపైనా చిన్మయితోపాటు మరో పదహారు మంది తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలపై ఎటూ తేలకముందే.. ఓఎన్వీ అవార్డు ఇవ్వడం ఇప్పుడు మారం రేపుతోంది. మలయాళ నటి పార్వతి తిరువొతు, గీతూ మోహన్‌దాస్, రీమా కళింగల్ తో పాటు చిన్మయి కూడా గొంతు కలిపింది. అర్హతలేని ఆ వ్యక్తి నుంచి పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. అది జరగదు ఈ విమర్శలపై ఒఎన్వీ కల్చరల్ అకాడమీ ప్రెసిడెంట్ అదూర్ గోపాలకృష్ణన్ స్పందించారు. ఈ పురస్కారం ప్రతిభ ఆధారంగా ఇచ్చిందే తప్ప.. క్యారెక్టర్ చూసి కాదని అన్నారు. వైరముత్తు మంచి గేయ రచయిత. అయినా ఆయనపై ఉన్నవి కేవలం ఆరోపణలు మాత్రమే. ఈరోజుల్లో ఎవరు.. ఎవరిపైన అయినా ఆరోపణలు చేయొచ్చు. జ్యూరీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు అని గోపాలకృష్ణన్ స్పష్టం చేశారు. ఈ తరుణంలో తాము పోరాటాన్ని ఆపబోమని హీరోయిన్లు స్పష్టం చేశారు. నాన్-మలయాళీ మలయాళంలో దివంగత ప్రఖ్యాత కవి, సినీ గీత రచయిత ఓఎన్వీ గురుప్ పేరుతో 2017లో జాతీయ సాహితీ అవార్డులు ఏర్పాటు చేశారు. దీన్ని మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ కవులు, గీత రచయితలకే ప్రదానం చేస్తున్నారు. ఈ ఏడాది తమిళ ప్రఖ్యాత గీత రచయిత వైరముత్తుకు ప్రకటించారు. ఈ అవార్డును రాష్ట్రేతర ప్రముఖులకు ప్రకటించడం ఇదే ప్రథమం. ఇక ఓఎన్వీ గురుప్ జాతీయ సాహితీ అవార్డు అందుకున్న వైరముత్తును తమిళనాడు సీఎం స్టాలిన్ అభినందించారు కూడా. -
గీత రచయిత వైరముత్తుకు అరుదైన పురస్కారం
తమిళ సినిమా: ప్రఖ్యాత గీత రచయిత వైరముత్తుకు అరుదైన పురస్కారం లభించింది. మలయాళంలో దివంగత ప్రఖ్యాత కవి, సినీ గీత రచయిత ఓఎన్వీ గురుప్ పేరుతో 2017లో జాతీయ సాహితీ అవార్డులు ఏర్పాటు చేశారు. దీన్ని మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ కవులు, గీత రచయితలకే ప్రదానం చేస్తున్నారు. ఈ ఏడాది తమిళ ప్రఖ్యాత గీత రచయిత వైరముత్తుకు ప్రకటించారు. ఈ అవార్డును రాష్ట్రేతర ప్రముఖులకు ప్రకటించడం ఇదే ప్రథమం. అవార్డు గ్రహీతకు జ్ఞాపికతో పాటు, ధ్రువీకరణ పత్రం, రూ.3 లక్షల నగదు అందజేస్తారు. ఓఎన్వీ గురుప్ జాతీయ సాహితీ అవార్డుకు ఎంపిక కావడం గర్వంగా భావిస్తున్నట్లు వైరముత్తు పేర్కొన్నారు. వైరముత్తును సీఎం స్టాలిన్ అభినందించారు. చదవండి:అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన కోలీవుడ్ స్టార్ శింబు ‘ఏక్ మినీ కథ’ మూవీపై హీరో శర్వానంద్ కామెంట్స్.. -
ఆపదొస్తే అణుబాంబై పేలడం తెలీదా?
ఒప్పందం నాకు సమ్మతమే నువ్వు మాలవై ఉంటానంటే అందులో నేను పువ్వై ఉండటమే కాదు నువ్వు ఎడారివై ఉంటానంటే అందులో నేను ఇసుకై ఉండేందుకు ... నిరీక్షణ నీకోసం నిరీక్షిస్తున్నాను ప్రతి నిముషమూ నాపై అగ్గిరవ్వ అణువణువూ తాకగా నీకోసం నిరీక్షిస్తున్నాను అది ఒక సుఖ నరకం నీకోసం తీసుకొచ్చాను ఒకే ఒక్క గులాబీ అయిదు నిముషాలకు ఓ రేకు చొప్పున తుంచి తుంచి కింద పడేస్తున్నాను ఒకటీ రెండూ.... మూడూ... మంచివేళ ఆఖరి రేకు తుంచేందుకు చేతులు వణకగా దూరాన వర్ణచుక్కలై నువ్వు రావడం కనిపించింది లేకుంటే నా హదయ గులాబీలోనూ తొడిమే మిగిలేది నడపండి మీ వేదిక మీ నాలుక ఏదైనా మాట్లాడండి మీ పెన్నూ మీ ముద్రణ ఏదైనా రాయండి మీ త్రాసు మీ తూనిక రాళ్ళు ఏదైనా విమర్శించండి మీ గోడలు మీ కాగితం ఏదైనా అంటించండి మీ వాయిద్యం మీ కచ్చేరీ ఏదైనా వాయించండి మీ కుంచె మీ వర్ణం ఏదైనా గీయండి కానీ రేపు కాలం విమర్శ మీ శవాలను సైతం తవ్వి తీసి ఉరి వేస్తుంది అనేది మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి తమిళ మూలం : కవి వైరముత్తు అనుసజన : యామిజాల జగదీశ్ పూలకత్తులు సేద్యపు మడులలో స్వేదనదులై ప్రవహించే వాళ్లకు కాంక్రీట్ కట్టడాల్ని వరదై ముంచెత్తడం తెలీదా? అవనికి అమ్మతనం కమ్మదనం రుచి చూపించేవాళ్లకు దేశం ఆకుపై పాకుతున్న స్వార్థం పురుగుల్ని సంహరించడం తెలీదా? నాగరికతకు నడకలు నేర్పి అందరి కంచాలలో అన్నం మెతుకులై మెరిసే వాళ్లకు ఆపదొస్తే అణుబాంబై పేలడం తెలీదా? కార్పొరేట్ కళ్లద్దాలను తొడుక్కుని కమతాలకు ఖరీదు కడతామంటే కాలం కొండ మీద ఎర్రజెండాౖయె ఎగరటం చలిచీమల్లాంటి ఆ శ్రమజీవులకు వెన్నతో పెట్టిన విద్య! వాళ్లిప్పుడు... ఆకలి చెట్లకి పూసిన పూలకత్తులు చీకటి మెట్లను చీల్చుతున్న వెలుగు సుత్తులు ఆ భూమిపుత్రుల్ని ముందుకు నడిపిస్తున్నది... టెర్రరిస్టులో, క్యాపిటలిస్టులో కాదు, అస్తిత్వం కోసం ఆరాటపడుతున్న ఆవేదన పిడికిళ్లు బానిసత్వ శృంఖలాల్ని బద్దలు కొడుతున్న చైతన్యపాదాలు (సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు చేస్తున్న మహా పోరాటానికి మద్దతుగా...) -మామిడిశెట్టి శ్రీనివాసరావ మేలిపద్యం మతి తప్పిన ప్రభువులతో సతమతమయిపోయి జనులు ఛస్తావుంటే గతి తప్పి వచ్చి రుతువులు వెత పెడితే యెటుల మనవి ‘వెదరు’ గరీబూ! (దేవీప్రియ ‘గరీబు గీతాలు’ నుంచి) పోలీసులు మిత్రులనే వ్రేలాడే బోర్డు చూసి వింతగ జనముల్ ఈలాంటి జోకులేలని వ్రేలేసుక ముక్కుమీద వెళ్లిరి సుమనా! (ఎన్.ఆర్.వెంకటేశం ‘కందాల మకరందాలు’ నుంచి) కుమిలి క్రుళ్లుచు నిరుపేద గుడిసెలెల్ల నేడు కంపుకొట్టుచునుండు నిజము కాని అద్యతన నాగరిక హృదయాలకంటె ఎంత పరిశుభ్రమైనవో ఎంచి చూడు (డా. నండూరి రామకృష్ణమాచార్యులు ‘తారాతోరణం’ నుంచి) -
కరోనా పాట
కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు కావాల్సిన జాగ్రత్తలు పాటించమని సినిమా స్టార్స్ తమ సోషల్ మీడియా ద్వారా అభిమానులందర్నీ కోరుతున్నారు. అయితే ఒక్కొక్కరిదీ ఒక్కో స్టయిల్. ప్రముఖ గాయకులు యస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాపై తమిళంలో ఓ పాట కంపోజ్ చేసి, పాడారు. ఈ పాటను రచయిత వైరముత్తు రచించారు. ప్రస్తుత సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ ఈ పాటను రాశారు. ఈ పాటను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు యస్పీబీ. -
ఎస్పీ బాలు నోటా కరోనా పాట!
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌కు ప్రజలకు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు సెలబ్రిటీలు సైతం సామాజిక దూరాన్ని పాటించాలంటూ ఎవరికి తోచిన విధంగా వారు అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా ప్రజలు సామాజిక దూరం పాటించాలంటూ పాట ద్వారా సోషల్ మీడియాలో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. కరోనా వ్యాప్తిని ఎలా అరికట్టాలో పాటించాల్సిన విధానాన్ని స్టేప్ బై స్టేప్ వివరిస్తున్న పాటను సోషల్ మీడియాలో శుక్రవారం షేర్ చేశారు. ఈ పాటను ప్రముఖ రచయిత వైరముత్తు రాసినట్లు కూడా ఆయన తెలిపారు. (భయం, నిర్లక్ష్యం వద్దు: చిరంజీవి) ఇక ఈ వీడియో చివరలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వైరముత్తులు ప్రజలు ఈ మహమ్మారిపై ఆందోళన చెందకుండా వ్యక్తిగత శుభ్రత పాటించాలని కోరారు. వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే ప్రజలు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఇటీవల ‘కరోనా ప్రాణాంతక వైరస్ కాకపోవచ్చు కానీ నిర్లక్ష్యం చేస్తే మహమ్మారిగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి షేక్ హ్యండ్ ఇవ్వకుండా.. నమస్కారం చెబుదాం’ అంటూ మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో ద్వారా అభిమానులకు, ప్రజలకు సామాజిక దూరం పాటించాలంటూ సందేశం అందించిన విషయం తెలిసిందే. (కరోనా: సెలబ్రిటీల ప్రతిజ్ఞ) -
హార్వీ భారత్‌లో పుట్టి ఉంటేనా: చిన్మయి
చెన్నై: అత్యాచార ఆరోపణల కేసులో ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్ జైలుపాలు కావడంపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద స్పందించారు. అనేక మందిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ హార్వీకి 23 ఏళ్ల శిక్ష పడిందన్న చిన్మయి.. భారత రాజకీయ పార్టీలపై వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఈ మేరకు... ‘‘ప్రస్తుతం తాను భారత్‌లో జన్మించి ఉంటే బాగుండేదని హార్వీ కోరుకుని ఉంటాడు. ముఖ్యంగా తమిళనాడులో పుట్టాలని బలంగా అనుకుని ఉంటాడు. ఇక్కడైతే తను స్టార్లు, రాజకీయ నాయకులతో సంతోషంగా పార్టీలు చేసుకునేవాడు. పద్యాలు, కవితలు రాసుకునేవాడు. నువ్వు గనుక ఇక్కడ ఉండి ఉంటే 100 శాతం రాజకీయపార్టీలు నీకే మద్దతుగా నిలిచేవి’’ అని ట్విటర్లో నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.(లైంగిక వేధింపుల కేసు.. బడా నిర్మాతకు భారీ షాక్!) కాగా లైంగిక వేధింపుల కేసులో హార్వీ వెయిన్‌స్టీన్‌కు 23ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యూయార్క్ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ సందర్భంగా హార్వీ మాట్లాడుతూ.. ‘‘నాకు అంతా అయోమయంగా ఉంది. నేను దేశం గురించి బాధపడుతున్నా’’ అంటూ వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో చిన్మయి పైవిధంగా ట్వీట్ చేశారు. అదే విధంగా హార్వీ వర్సెస్ వైరముత్తు అంటూ హార్వీ వెయిన్‌స్టీన్, ప్రముఖ పాటల రచయిత వైరముత్తుకు సంబంధించిన వార్తా కథనాల ఫొటోలను షేర్ చేశారు.('ఆయనకు ఉత్తమ కామాంధుడి అవార్డు ఇవ్వండి') కాగా హార్వీ ఉదంతంతో హాలీవుడ్లో మొదలైన మీటూ ఉద్యమాన్ని భారత్‌లో బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా ప్రారంభించగా... దక్షిణాదిన చిన్మయి ముందుండి నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ గేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత వైరముత్తు తనను లైంగికంగా వేధించారంటూ ఆమె పలు సంచలన ఆరోపణలు చేశారు. తను ఇచ్చిన స్ఫూర్తితో మరికొంత మంది కూడా వైరముత్తు వల్ల తాము ఎదుర్కొన్న ఇబ్బందులను బయటపపెట్టారు. అయితే సినీ ఇండస్ట్రీ అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు సరికదా.. చిన్మయిపై కక్ష సాధింపు చర్యలకు దిగి ఆమె కెరీర్‌ను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక చిన్మయిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. Harvey Weinstein sentenced to 23 years in Prison. This is the time he’d wish he were born in India. Especially in Tamilnadu. He’d have been partying with stars, politicians and have odes written. You’d actually be supported by political parties 100% pic.twitter.com/TKfQKZxhtj — Chinmayi Sripaada (@Chinmayi) March 11, 2020 Harvey Weinstein vs Vairamuthu That’s how we roll, baby! pic.twitter.com/A2viTUUcEJ — Chinmayi Sripaada (@Chinmayi) March 11, 2020 -
'ఆయనకు ఉత్తమ కామాంధుడి అవార్డు ఇవ్వండి'
చెన్నై: తొమ్మిది మంది మహిళలను లైంగికంగా వేధించాడన్న ఆరోపణలున్న తమిళ సినీ కవి వైరముత్తుపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా.. తమిళ భాషకు ఆయన చేసిన సేవలను గౌరవిస్తూ రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్.. వైరముత్తును సత్కరించనున్నారు. ఈ విషయం చిన్మయి దృష్టికి రావడంతో ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి మీకు ఓ విషయాన్ని గుర్తుచేయాలని అనుకుంటున్నాను. 'ఆరోపణలు ఎదుర్కొన్నవారికి ఏమీ కాదు. ఆరోపణలు చేసిన వారికే పని దొరక్కుండా చేస్తారు. తమిళ భాష పట్ల వైరాముత్తుకు ఉన్న పట్టును గుర్తించి ఈ డాక్టరేట్ ఇస్తున్నారని నాకు తెలుసు. అదే విధంగా ఉత్తమ కామాంధుడు అనే పురస్కారం కూడా ఇస్తారని ఆశిస్తున్నా' అని సింగర్ చిన్మయి ట్విటర్ వేదికగా మండిపడ్డారు. చదవండి: ఫ్రీగా పాన్ ఇవ్వలేదని.. ముక్కు, పెదవులు కొరికేశాడు..! నేను చేసిన ఆరోపణలపై ఎవరూ విచారణ జరపకపోగా ప్రముఖుల చిత్రాల్లో అవకాశాలు ఇస్తూ అతడి ఆగడాలను సమర్ధిస్తున్నారు. లోకమంతా ఆయనకు కీర్తి కండువా కప్పుతోంది. ఇక నాపై కామెంట్స్ చేస్తున్న వారికి ఒక్క విషయం చెప్తున్నా.. మీ జీవితంలోనూ వైరముత్తు లాంటి వ్యక్తి ఉంటే అప్పుడు నేనెంత బాధపడ్డానో తెలిసొస్తుంది. అనుభవాన్ని మించిన గురువు మరొకటి ఉండదు. నేను కేవలం న్యాయం కావాలని అడుగుతున్నాను. నా ఆరోపణలు విని ఓ కామాంధుడి అభిమానులు ఎందుకు రియాక్ట్ అవుతున్నారో అర్థం కావడంలేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు చిన్మయి. చదవండి: మహేంద్రన్‌పై చిన్మయి ఫైర్ చదవండి: చిన్నారి హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష -
వాళ్లను చూస్తుంటే భయమేస్తోంది: చిన్మయి
సాక్షి, చెన్నై: సీనియర్ సినీ పాటల రచయిత వైరముత్తుపై సంచలన గాయనీ, డబ్బింగ్ కళాకారిణి చిన్మయి మరోసారి ఫైర్ అయ్యారు. అంతేకాకుండా ప్రముఖనటుడు, మక్కళ్ నీదిమయ్యం పార్టీ అద్యక్షుడు కమలహాసన్పై కూడా ఆమె పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. చిన్మయి గతంలో కూడా వైరముత్తుపై మీటూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమె ఆరోపణలు సినీ పరిశ్రమలో పెద్ద సంచలనాలనే సృష్టించాయి. ఫలితంగా తనూ నష్టపోయారు. దీంతో సయయం వచ్చినప్పుడల్లా చిన్మయి వైరముత్తును టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా కమల్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యాలయంలో దివంగత దర్శకుడు కే.బాలచందర్ శిలావిగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రజనీకాంత్‌తో పాటు వైరముత్తు పాల్గొన్నారు. దీంతో గాయనీ చిన్మయి వైరముత్తుపై మరోసారి విరుచుకుపడ్డారు. ‘అత్యాచార ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆయన జీవితం నశించిపోతుంది. ఇక బయట ప్రపంచంలో తలెత్తుకుని తిరగలేరు. ఇలాంటి వారిని కార్యక్రమాలకు అతిధులుగా ఎలా ఆహ్వానిస్తారు?అని ఆరోపించారు. మీటూ ఆరోపణలను ఎదుర్కొంటున్న వైరముత్తు ఈ ఏడాది పలు కార్యక్రమాల్లో, రాజకీయ కార్యక్రమాల్లోనూ అతిధిగా పాల్గొన్నారు. ఆయనకు జరిగిన నష్టం ఏమీలేదు అయితే బాధింపుకు గురైన నేను మాత్రం నిషేధానికి గురైయ్యాను. ఇదే సినీరంగంలో పెద్దల ద్వారా నాకు లభించిన న్యాయం. అత్యాచార ఆరోపణలను ఎదుర్కొంటున్నవారు బహిరంగ వేదికలపై తమ ఇమేజ్ను ఎలా కాపాడుకోవాలన్నది బాగానే తెలుసుకున్నారు. అలాంటి వారిలో కొందరు రాజకీయనాయకులూ ఉన్నారు. వారిని చూస్తుంటే భయం కలుగుతోంది’ అని చిన్మయి చేసిన ట్వీట్ ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాఫిక్‌గా మారింది. -
డబ్బింగ్ చెప్పనిస్తారా?
‘మీటూ’ ఉద్యమంలో డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్ చిన్మయి శ్రీపాద కీలకపాత్ర పోషించారు. ప్రముఖ తమిళ కవి వైరముత్తుపై ఆరోపణలు చేయడమే కాకుండా, అజ్ఞాతంగా ఉంటూ ఆయనపై ఆరోపణలు చేసినవారి ట్వీట్స్‌ను తన ట్వీటర్లో పోస్ట్ చేశారామె. అది మాత్రమే కాదు.. నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ అధ్యక్షుడు రాధారవిపై కూడా చిన్మయి ఆరోపణలు చేశారు. దాంతో గత ఏడాది నవంబర్‌లో ఎటువంటి ముందస్తు సమాచారం అందించకుండానే డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ సభ్యత్వ ఫీజు చెల్లించలేదనే కారణం చూపి చిన్మయిని యూనియన్ నుంచి పక్కనపెట్టారు. ఈ విషయంలో న్యాయం కోసం చిన్మయి మద్రాస్ హై కోర్టును ఆశ్రయించారు. తాజాగా హై కోర్టు టెంపరరీ స్టే ఇస్తూ, ఈ విషయం మీద మార్చి 25లోగా వివరణ ఇవ్వాలని రాధారవిని ఆదేశించింది. ‘‘ఇది కేవలం కొన్ని రోజుల స్టే మాత్రమే. రాధారవి, అతని అనుచరులు ఎలా స్పందిస్తారో, అప్పుడు కేసు ఎలా ముందుకు నడుస్తుందో చూడాలి. ఇది వరకు యూనియన్ నుంచి తప్పించబడ్డ వాళ్ల అనుభవాలు వింటే ఇది కొన్నేళ్లపాటు సాగే పోరాటం అని అర్థం అవుతోంది’’ అని పేర్కొన్నారు చిన్మయి. ఇలా కేసు ఏళ్ల తరబడి సాగితే చిన్మయి గొంతు తమిళంలో మళ్లీ ఎప్పుడు వినిపించాలి? అసలు చిన్మయికి మళ్లీ డబ్బింగ్ చెప్పుకునే అవకాశం ఇస్తారా? కాలమే చెప్పాలి. -
చిన్మయి ఫిర్యాదు.. స్పందించిన మేనకా గాంధీ
బాలీవుడ్లో తను శ్రీ దత్తా ప్రారంభించిన మీటూ ఉద్యమాన్ని సౌత్‌లో ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ముందుండి నడిపించారు. చిన్మయి కూడా స్వయంగా లైంగిక వేధింపుల బాధితురాలే. మీటూ ఉద్యమంలో భాగంగా 18 ఏళ్ల వయసులో వైరముత్తు తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని షాకింగ్ విషయాలను బయటపెట్టి సంచలనం సృష్టించారు చిన్మయి. ఆ తరువాత మరి కొందరు వైరముత్తుపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఇండస్ట్రీ వైరముత్తుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ చిన్మయిని మాత్రం కోలీవుడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ నుంచి తప్పించారు. అప్పటి నుంచి వైరముత్తుకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు చిన్మయి. తాజాగా ఈ విషయం గురించి ట్విటర్ వేదికగా కేంద్ర మంత్రి మేనకా గాంధీకి ఫిర్యాదు చేశారు చిన్మయి. ‘మేడమ్.. వైరముత్తు నన్ను లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేసి నాలుగు నెలలు అవుతోంది. ఈ విషయంలో నాకు న్యాయం జరగకపోగా.. నన్ను తమిళనాడు ఫిలిం ఇండస్ట్రీ నుంచి తప్పించారు. ప్రస్తుతం నేను కేసు పెట్టలేని పరిస్థితిలో ఉన్నాను. మీరే నాకేదన్నా దారి చూపండి’ అంటూ ప్రధాని నరేంద్రమోదీ, మేనకా గాంధీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు చిన్మయి. ఈ ట్వీట్‌పై మేనకా గాంధీ స్పందించారు. ‘మీ కేసును ఎన్సీడబ్ల్యూ (జాతీయ మహిళా కమిషన్) దృష్టికి తీసుకెళ్లాను. మీ వివరాలను నాకు పంపించండి’ అని రిట్వీట్ చేశారు మేనకా గాంధీ. (తమిళంలో చిన్మయి గొంతు వినిపించదు) I have taken up your case with @NCWIndia. Kindly DM your contact details. @Chinmayi @sharmarekha https://t.co/louSvb4Ge6 — Maneka Gandhi (@Manekagandhibjp) February 27, 2019 -
వైరముత్తుపై యువ రచయిత సంచలన ఆరోపణలు!
కోలీవుడ్‌లో హిట్ మూవీగా నిలిచిన విజయ్ సేతుపతి- త్రిషల ‘96’ సినిమాలో ‘అంతాతీ నీ సాంగ్‌తో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చాడు యువ రచయిత కార్తిక్ నేత. గతేడాది విడుదలైన చిత్రాల్లోని ఉత్తమ పాటల్లో ఒకటిగా నిలిచిన పాటతో కార్తిక్ ఫుల్ ఫేమస్ అయ్యాడు. ఈ క్రమంలో పలు ఎంటర్టేన్మెంట్ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో జాతీయ అవార్డు గ్రహీత, ప్రసిద్ధ రచయిత వైరముత్తుపై కార్తిక్ సంచలన ఆరోపణలు చేశాడు. ‘వాగై సోడా వా’ అనే సినిమాలో ‘సారా సారా సరకాత్తు’ అనే పాటను రాసింది తానైతే.. టైటిల్ కార్డ్స్‌లో మాత్రం వైరముత్తు తన పేరు వేయించుకున్నారని కార్తిక్ వ్యాఖ్యానించాడు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో తన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తన పాటలకు ఆయన క్రెడిట్ కొట్టేశారంటూ ఆరోపించాడు. ఈ క్రమంలో అతని ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో కార్తిక్ వెనక్కి తగ్గాడు. ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ... ‘ ఇటీవల నేను ఇంటర్వ్యూలు ఇచ్చిన మాట వాస్తవమే. అయితే అప్పుడు నేనేం మాట్లాడానో నాకు సరిగ్గా గుర్తులేదు. నేను నా మాటలను అంగీకరించలేను అలాగే తిరస్కరించలేను కూడా. ప్రస్తుతం నేను సిటీలో లేను. ఈ విషయం గురించి ఇప్పుడు నేనేం మాట్లాడలేను’ అని పేర్కొన్నాడు. కాగా మీటూ ఉద్యమంలో భాగంగా వైరముత్తుపై లైంగిక ఆరోపణలు చేసిన గాయని చిన్మయి శ్రీపాద కార్తిక్‌కు మద్దతుగా నిలిచారు. ‘ కార్తిక్ నేత తనకు జరిగిన అన్యాయం గురించి నోరు విప్పడం హర్షించదగ్గ విషయం’ అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. -
తమిళంలో చిన్మయి గొంతు వినిపించదు
‘మీటూ’ ఉద్యమం గురించి సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి నిర్భయంగా మాట్లాడిన సంగతి గుర్తుండే ఉంటుంది. తన ట్వీటర్ ఖాతా ద్వారా చాలా మంది అజ్ఞాత స్త్రీల ఆరోపణలకు గొంతునిచ్చారు. ప్రముఖ పాటల రచయిత వైరముత్తు, నటుడు రాధారవి మీద ఆరోపణలు చేశారు. వీటివల్ల మీకు అవకాశాలేమైనా తగ్గుతాయనుకుంటున్నారా? అని ఆ మధ్య ‘సాక్షి’ అడిగినప్పుడు ‘అలాంటిదేం లేదు. ఏం జరిగినా ధైర్యంగా ఎదుర్కొంటా’’ అని చిన్మయి అన్నారు. మరి.. తాజా పరిణామాన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి. విషయం ఏంటంటే.. చిన్మయిని డబ్బింగ్ అసోసియేషన్ నుంచి తొలగించారు. ‘‘నన్ను డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగించారు. అంటే.. ఇక తమిళ సినిమాలకు డబ్బింగ్ చెప్పలేను. రెండు సంవత్సరాలుగా నేను యూనియన్ ఫీజŒ కట్టలేదన్నదాన్ని కారణంగా చూపించారు. కానీ, ఇన్ని రోజులు డబ్బింగ్ చెప్పడం వల్ల నాకొచ్చిన ఆదాయంలో 10శాతం తీసుకున్నారు. పాత బకాయిలున్నట్టు మెసేజ్ కానీ, లెటర్ కానీ పంపకుండా నా మెంబర్షిప్ తొలగించారు. మళ్లీ తమిళ సినిమాలకు డబ్ చేస్తానో లేదో తెలియదు’’ అని చిన్మయి ట్వీట్ చేశారు. విశేషం ఏంటంటే.. డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్‌కు రాధారవి ప్రెసిడెంట్. -
నిజానిదే గెలుపు
‘‘చదువుకునే రోజుల్లో ఇంట్లో తినడానికి తిండి లేకపోతే మా నాన్నగారు తోటల్లో రెండు టమాటా పండ్లు కోసుకుని తిని, పరీక్షలకు వెళ్లిన రోజులు ఎవరికీ తెలియవు. కాలేజీ ఫీజు 150 రూపాయలు కట్టడానికి అప్పు కోసం ఎన్ని ఊళ్లు తిరిగి, ఎన్ని అవమానాలు భరించారో ఎవరికీ తెలియదు. హైస్కూల్‌కి వెళ్లేవరకూ కాళ్లకు చెప్పులు లేకుండా రాళ్లు, ముళ్లు గుచ్చుకున్నా లెక్కచేయక వెళ్లి చదువుకున్న రోజులు తెలియవు. అమ్మా, నాన్నలది ప్రేమ వివాహం. ఒక్క ఫ్యాన్ వసతి కూడా లేని ఇంట్లో ఒకరు తమిళ టీచర్‌గా, ఒకరు కవిగా ఇద్దరు కన్నబిడ్డల ఆలనా పాలనా చూసుకోవడానికి పడిన తిప్పలు తెలియవు. ఒక మారుమూల గ్రామం నుంచి నగరానికి వచ్చి, దేశంలో ఉన్న ప్రముఖుల్లో ఓ ప్రమఖుడిగా ఎదిగిన మా నాన్న గురించి ఈ ‘టెక్నాలజీ యువత’కు ఏం తెలుసు? ఎంతో ఎత్తుకి ఎదిగిన నాన్నగారి జీవితం యువతకు ఎంతో ఆదర్శప్రాయం. ఆయన అందుకోని అవార్డులు లేవు. ప్రశంసలు లేవు. అలాంటి ఆయన కీర్తి ప్రతిష్టలకు మకిలి పట్టించడానికి ప్రయత్నిస్తున్నవారిని చూస్తే జాలిగా ఉంది’’ అని ‘నిజానిదే గెలుపు’ అంటూ ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు తనయుడు, రచయిత కబిలన్ ట్వీటర్లో ఓ సుదీర్ఘ లేఖను పొందుపరిచారు. వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చి దాదాపు 15 రోజులు పైనే అయింది. ‘‘ఇన్నాళ్లూ మౌనంగా ఉండి ఇప్పుడు స్పందించడానికి కారణం ఇంత సుదీర్ఘంగా రాసే మానసిక స్థితి లేకపోవడమే’’ అన్నారు కబిలన్. ‘‘ఆధారాలు లేకుండా పురుషులను స్త్రీలు, స్త్రీలను పురుషులు నిందించడం అనే ఈ ట్రెండ్ చాలా ప్రమాదకరమైనది. మన దేశం ప్రధాన బలం మన కట్టుబాట్లు. అవి ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయంలో కొంతవరకూ మనల్ని కాపాడటానికి కారణమయ్యాయి. పాశ్చాత్య ప్రభావం మెల్లిగా మన కుటుంబ కట్టుబాట్ల నాశనానికి కారణమవుతోంది. మా నాన్నగారికి వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం వెనక పొలిటికల్ ఎజెండా ఉందని కొందరు, అలాంటిదేమీ లేదని మరికొందరు అంటున్నారు. ఎవరు ఏమన్నా చట్టపరమైన చర్యల ద్వారా న్యాయం జరుగుతుందన్నది నా అభిప్రాయం. ఈ మొత్తం సమస్య (ఆరోపణలు) ఓ మెగా ఈవెంట్‌లా అయిపోయింది. అది మనల్ని దేశంలో ఎన్నో ముఖ్యమైన సమస్యల నుంచి దృష్టి మళ్లిస్తోంది. ‘మీటూ’ అంటూ ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఈ ఉద్యమం ఏ దిశలో వెళుతోందో చెప్పేంత పరిపక్వత నాకు లేదు’’ అంటూ పలు విషయాలు పంచుకున్నారు. ఈ ట్వీట్‌ని వైరముత్తు మరో కుమారుడు, కబిలన్ సోదరుడు మదన్ కార్కీ రీ–ట్వీట్ చేశారు. అయితే కబిలన్ ట్వీట్‌కి పలు విమర్శలు వచ్చాయి. ‘‘మా నాన్నగారు అన్ని కష్టాలు పడ్డారు.. ఇన్ని కష్టాలు పడ్డారు అని చెప్పావు కానీ, మా నాన్న నిజాయితీపరుడు, మా అమ్మకు ద్రోహం చేయలేదు. ఏ అమ్మాయి దగ్గరా తప్పుగా ప్రవర్తించలేదని బలంగా చెబుతున్నాను అని మీరు చెప్పకపోవడానికి కారణం మీ మనసాక్షి ఒప్పుకోకపోవడమే’’ అని కొందరు విమర్శించారు. -
వైరముత్తు అలాంటివాడే!
కొన్ని రోజులుగా వైరముత్తు తనతో పని చేసేవారి మీద లైంగిక వేధింపులు జరిపాడు అంటూ గాయని చిన్మయి పలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఆరోపణలకు మద్దతు పలికారు సంగీత దర్శకుడు రెహమాన్ సోదరి, సంగీత దర్శకురాలు, నిర్మాత రైహానా. ‘‘వైరముత్తు అలాంటివాడే అన్న విషయం ఇండస్ట్రీలో ఓపెన్ సీక్రెట్. వైరముత్తు ఇలాంటి వాడు అన్న సంగతి రెహమాన్‌కి తెలియదు. ‘నిజమా? ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే పరిస్థితి ఏంటి?’ అని రెహమాన్ నన్ను అడిగాడు. రెహమాన్ పుకార్లను పట్టించుకోడు. తన పనేంటో తను చేసుకుంటూ వెళ్తాడు. అలాగే కాంట్రవర్శీలు ఉన్నవాళ్లతో తను పనిచేయడు. మరి రెహమాన్ వీళ్లతో కలసి పనిచేయడా? అంటే.. అది తన ఇష్టం’’ అని పేర్కొన్నారు. చెడ్డవాడు హీరోయిన్ లేఖా వాషింగ్టన్ కూడా ‘మీటూ’ అంటూ పేరు చెప్పకుండా ఓ వ్యక్తిని ఆరోపించారు. శింబుతో కలసి లేఖ ‘కెట్టవన్’ అనే సినిమాలో యాక్ట్ చేయాల్సింది. అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు ట్వీటర్లో ‘ఒకే ఒక్క పదం.. కెట్టవన్.. మీటూ’ అని ట్వీట్ చేశారు. అంటే.. ఆమె ఎవర్ని అన్నారో ఊహించడం ఈజీ. అన్నట్లు ‘కెట్టవన్’ అంటే చెడ్డవాడు అని అర్థం. -
వైరముత్తు మంచోడేం కాదు: మరో గాయని
గీత రచయిత వైరముత్తు అంత సచ్చీలుడేంకాదు అంటూ ఆయనకు వ్యతిరేకంగా మరో మహిళ గొంతు విప్పింది. లైంగిక వేధింపులపై మీటూ అంటూ సామాజిక మాధ్యమం ద్వారా పలువురు గొంతు విప్పుతున్నారు. మీటూ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మీటూతో ఒక కేంద్రమంతినే పదవి కోల్పాయారంటే ఆ ప్రభావం ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక కోలీవుడ్‌లో ప్రముఖ గీత రచయిత వైరముత్తుపై గాయని చిన్మయి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలాన్నే రేపుతున్నాయి. వైరముత్తులోని మరో కోణం గురించి బాధిత మహిళలు గొంతు విప్పుతున్నారు. చిన్మయి తరువాత అమెరికాకు చెందిన ఇద్దరు మహిళలు వైరముత్తు వేధింపుల బాధితులమేనని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా దివంగత ప్రఖ్యాత గాయకుడు, నటుడు మలేషియా వాసుదేవన్ కోడలు, గాయని హేమమాలిని వైరముత్తు గురించి మాట్లాడుతూ ఆయనేమంత సచ్చీలుడు కాదని పేర్కొంది. ఈమె తన ఫేస్బుక్లో గాయని చిన్మయికి మద్దతుగా నిలిచింది. హేమమాలిని పేర్కొంటూ తమిళ సినీ పరిశ్రమ గాయని చిన్మయికి మద్దతుగా ఎందుకు నిలబడడం లేదో తనకు అర్ధం కావడం లేదన్నారు. వైరముత్తు సచ్చీలుడు కాదన్న విషయం సినీపరిశ్రమకే తెలుసన్నారు. చిన్మయి ఎందుకు ఆ సంఘటనను 10 ఏళ్ల క్రితం చెప్పలేదు? అని ఆమెను ప్రశ్నిస్తున్నారెందుకు. ఇప్పటికైనా బహిరంగపరిచినందుకు దానిపై నిజా నిజాలను నిగ్గతేల్చాలన్నారు. చిన్నయిని ప్రశ్నిస్తున్న వారు వైరముత్తును ప్రశ్నించడం లేదే అని నిలదీశారు. ఆరోపణలను ఎదుర్కొంటున్నవారిని వదిలి బాధితులను ప్రశ్నించడం ఏంటని వాపోయారు. చిత్రపరిశ్రమ ఏక పక్షంగా వ్వవహరిస్తోందని ఆరోపించారు. తాను ఒక ప్రైవేట్ చానల్లో పనిచేస్తున్న సమయంలో వైరముత్తు అక్కడ పనిచేసే ఒక యువ యాంకర్‌తో ఈ వ్యవహారంపై వేధించిన విషయం తనకు తెలుసని చెప్పారు. ఆయన గురించి తాను10 ఏళ్లలో పలు చోట్ల మాట్లాడాని తెలిపింది. కాగా నోరు లేని వారి కోసం తన గొంతు విప్పుతున్న గాయని చిన్మయినిని అభినంధిస్తున్నాను అని గాయని హేమమాలిని పేర్కొన్నారు. ఇంతకు ముందు వైరముత్తుపై లైంగికవేధింపుల ఆరోపణలు చేసిన సింధూజా రాజారాం కూడా హేమమాలిని చెప్పిన ప్రైవేట్ చానల్లో పని చేసిన యువ యాంకర్ గురించి ప్రస్ధావించారన్నది గమనార్హం. ఆస్పత్రిలో వైరముత్తు.. లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న వైరముత్తు శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మదురైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. ఆయనకు ఫుడ్ పాయిజన్ అయినట్లు సమాచారం.