తమిళసినిమా: ఇతరుల గురించి పట్టించుకోవడం తన పని కాదని, అంత తీరిక కూడా తనకు లేదని, తన పనిని తాను సక్రమంగా చేసుకుంటున్నానని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పేర్కొన్నారు. ఇటీవల ఈయన పేరు నిత్యం వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఇళయరాజా సంగీతాన్ని అందించిన పాటకు కాపీ రైట్స్ కోరుతున్న విషయం విధితమే. ఈ వ్యవహారం కోర్టులో ఉంది. ఇటీవల తన అనుమతి లేకుండా తన సంగీతాన్ని కాపీ కొట్టారంటూ సన్ పిక్చర్స్ సంస్థకు నోటీసులు కూడా జారీ చేశారు.
అసలు సంగీతం గొప్పదా? సాహిత్యం గొప్పదా? అనే ప్రశ్నకు గీతరచయిత వైరముత్తు తెర లేపారు. ఇలాంటి పరిస్ధితుల్లో ఇళయరాజా గురువారం ఒక వీడియోను తన సామాజిక మాధ్యమం ద్వారా విడుదల చేశారు. అందులో ఇటీవల తన గురించి ఏవేమో వార్తలు వస్తున్నట్లు వింటున్నానన్నారు. అయితే వాటి గురించి పట్టించుకునే సమయం తనకు లేదని, అలాంటి వాటిపై దృష్టి పెట్టడం తన పని కాదన్నారు.
తన పని తాను సక్రమంగా చేసుకుంటున్నానని, చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూనే, ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నానని, అయినప్పటికీ 35 రోజుల్లో సింపోనీ రాసి పూర్తిచేసినట్లు చెప్పారు. ఇది సంతోషకరమైన విషయం అని పేర్కొన్నారు. ఇళయరాజా జూలై 14న భారీ సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్థానిక నందనంలోని వీఎంసీఏ గ్రౌండ్‌లో జరగనున్న ఈ సంగీత విభావరిలో ఇళయరాజా కనీసం 50 నుంచి 60 పాటలు పాడే అవకాశం ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు.
— Ilaiyaraaja (@ilaiyaraaja) May 16, 2024
Comments
Please login to add a commentAdd a comment