Parvathy Chinmayi Shocking Comments About ONV Award Presented To Vairamuthu - Sakshi
Sakshi News home page

వైరముత్తుకి పురస్కారం.. హీరోయిన్ల ఆగ్రహం

Published Fri, May 28 2021 2:35 PM | Last Updated on Fri, May 28 2021 6:39 PM

Vairamuthu ONV Award Not Correct Says Parvathy Chinmayi - Sakshi

మాలీవుడ్​ నటి పార్వతి, గేయ రచయిత వైరముత్తు

చెన్నై:  లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ గేయ రచయిత వైరముత్తుకు వ్యతిరేకంగా మరోసారి గళం వినిపిస్తోంది. కేరళ ఒఎన్​వీ గురువ్​ జాతీయ పురస్కారాన్ని వైరముత్తుకు అందించడంపై పెద్ద ఎత్తున్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ ఆ పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గతంలో వైరముత్తుపై ఆరోపణలు చేసిన సింగర్​, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయితో పాటు మాలీవుడ్​ హీరోయిన్లు కొందరు ఈ క్యాంపెయిన్​లో పాల్గొంటున్నారు.   

కాగా, 2018 మీటూ ఉద్యమ సమయంలో గేయరచయిత వైరముత్తుపైనా చిన్మయితోపాటు మరో పదహారు మంది తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలపై ఎటూ తేలకముందే.. ఓఎన్​వీ అవార్డు ఇవ్వడం ఇప్పుడు మారం రేపుతోంది. మలయాళ నటి పార్వతి తిరువొతు, గీతూ మోహన్​దాస్​, రీమా కళింగల్​ తో పాటు చిన్మయి కూడా గొంతు కలిపింది. అర్హతలేని ఆ వ్యక్తి నుంచి పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తులు చేస్తున్నారు.
 

అది జరగదు
ఈ విమర్శలపై ఒఎన్​వీ కల్చరల్​ అకాడమీ ప్రెసిడెంట్ అదూర్​ గోపాలకృష్ణన్ స్పందించారు. ఈ పురస్కారం ప్రతిభ ఆధారంగా ఇచ్చిందే తప్ప.. క్యారెక్టర్​ చూసి కాదని అన్నారు. వైరముత్తు మంచి గేయ రచయిత. అయినా ఆయనపై ఉన్నవి కేవలం ఆరోపణలు మాత్రమే. ఈరోజుల్లో ఎవరు.. ఎవరిపైన అయినా ఆరోపణలు చేయొచ్చు. జ్యూరీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు అని గోపాలకృష్ణన్​ స్పష్టం చేశారు. ఈ తరుణంలో తాము పోరాటాన్ని ఆపబోమని హీరోయిన్లు స్పష్టం చేశారు.
 

నాన్​-మలయాళీ
మలయాళంలో దివంగత ప్రఖ్యాత కవి, సినీ గీత రచయిత ఓఎన్‌వీ గురుప్‌ పేరుతో 2017లో జాతీయ సాహితీ అవార్డులు ఏర్పాటు చేశారు. దీన్ని మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ కవులు, గీత రచయితలకే ప్రదానం చేస్తున్నారు. ఈ ఏడాది తమిళ ప్రఖ్యాత గీత రచయిత వైరముత్తుకు ప్రకటించారు. ఈ అవార్డును రాష్ట్రేతర ప్రముఖులకు ప్రకటించడం ఇదే ప్రథమం. ఇక ఓఎన్‌వీ గురుప్‌ జాతీయ సాహితీ అవార్డు అందుకున్న వైరముత్తును తమిళనాడు సీఎం స్టాలిన్‌ అభినందించారు కూడా.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement