తమిళ సినిమా: వైవిధ్యానికి మారుపేరు నటుడు విక్రమ్. ఈయన నటించే చిత్రాల్లో నటుడు కనిపించరు పాత్రలే కనిపిస్తాయి. అన్నియన్, ఐ వంటి చిత్రాలు ఈ కోవలోకే వస్తాయి. తాజాగా విక్రమ్ నటిస్తున్న మరో విభిన్నమైన కథా చిత్రం తంగలాల్. పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్‌ను గుర్తు పట్టడం చాలా కష్టం. అంతగా మేకోవర్ అయ్యి ఆ పాత్రకు ప్రాణం పోస్తున్నారు.
కాగా ఈయన నటుడు కార్తీ, జయం రవి, విక్రమ్ ప్రభు, త్రిష, ఐశ్వర్య రాయ్, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, ప్రభు, పార్తీపన్ వంటి ప్రముఖ నటీనటులతో కలిసి మణిరత్నం దర్శకత్వంలో నటించిన భారీ చారిత్రాత్మక కథా చిత్రం పొన్నియిన్ సెల్వన్. ఈ చిత్ర రెండో భాగం భారీ అంచనాల మధ్య ఈ నెల 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. మరిన్ని చిత్రాలు విక్రమ్ చేతిలో ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఆసక్తికరమైన ప్రచారం కోలీవుడ్లో జరుగుతోంది. ప్రముఖ గీత రచయిత వైరముత్తు రాసిన నవల కళ్లికాట్టు ఇతిహాసం. 14 గ్రామ ప్రజల పోరాటమే ఈ నవలలోని ప్రధానాంశం. ఇది 2003 సాహితీ అకాడమీ అత్యున్నత అవార్డును గెలుచుకుంది. కాగా ఈ నవల ఆంగ్లం, హిందీ తదితర 7 భాషల్లో అనువదించారు. తాజాగా ఈ నవలను సినిమాగా తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.
చదవండి: ఇది నా జీవితం.. నిర్ణయం కూడా నేనే తీసుకుంటా: సిమ్రాన్
దీనికి మదయానై కూట్టం చిత్రం ఫేమ్ విక్రమ్ సుకుమార్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. అసలు విషయం ఏమిటంటే ఇందులో నటుడు సియాన్ విక్రమ్‌ను కథానాయకుడిగా నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. అయితే ఆయన అందులో నటించడానికి సమ్మతిస్తారా? లేదా అన్నది ఆసక్తిగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment