కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తాజాగా నటించిన భారీ యాక్షన్ చిత్రం తంగలాన్. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు హీరోయిన్లుగా నటించారు. కర్ణాటకలోని కేజీఎఫ్ గనుల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రం విక్రమ్ ఆటవిక జాతికి చెందిన పాత్రలో మెప్పించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్‌లో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు.
అయితే రిలీజ్‌కు తంగలాన్ నిర్మాతకు ఇబ్బందులు ఎదురు కావడంతో విడుదలపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలోనే మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నిర్మాత కేఈ జ్ఞానవేల్ రూ.1 కోటి రూపాయలు డిపాజిట్ చేశారు. తాజాగా తంగలాన్ రిలీజ్‌కు లైన్ క్లియర్ అయింది. దీంతో విక్రమ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాకుండా సూర్య హీరోగా నటిస్తోన్న కంగువా చిత్రం విడుదలకు ముందు కూడా కోటి రూపాయలు డిపాజిట్ చేయాలని నిర్మాతకు సూచించింది. కాగా.. గతంలో సుందర్‌దాస్ అనే వ్యక్తికి చెల్లించాల్సి డబ్బుల విషయంలో ఆయన కుటుంబం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
అసలేం జరిగిందంటే..
గతంలో అర్జున్‌లాల్ సుందరదాస్ అనే వ్యక్తితో కలిసి నిర్మాత జ్ఞానవేల్ రాజా రూ.40 కోట్లతో ఓ సినిమా నిర్మించాలని అనుకున్నారు. అయితే ప్రీ-ప్రొడక్షన్‌కి ఖర్చులకు గానూ స్టూడియో గ్రీన్ నిర్మాణ సంస్థకు సుందర్‌దాస్ రూ.12.85 కోట్లు చెల్లించారు. తర్వాత ఆర్థికపరమైన ఇబ్బందులు రావడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి సుందర్‌దాస్ తప్పుకున్నాడు. అయితే అందులో కేవలం రూ.2.5 కోట్లు మాత్రమే తిరిగి వచ్చాయి. ఆ తర్వాత ఆయన మరణించడంతో మిగిలిన రూ.10.35 కోట్ల కోసం సుందర్‌దాస్ కుటుంబసభ్యులు కోర్టును ఆశ్రయించారు.
అయితే ఈ కేసు గురించి నిర్మాత కేఈ జ్ఞానవేలు మాట్లాడుతూ... మూడు తమిళ సినిమాల హిందీ డబ్బింగ్ హక్కులకు ఇవ్వాల్సిన డబ్బుకు బదులుగా.. ఆ రూ.12.85 కోట్లు ఇచ్చాడని తెలిపారు. అంతే కానీ తమకు ఎలాంటి డబ్బు ఇవ్వలేదని చెప్పారు. కానీ గ్రీన్ స్టూడియోస్ తమకు రూ.10.25 కోట్లను 18 శాతం వార్షిక వడ్డీతో తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ అర్జున్ లాల్ సుందర్ దాస్ కుటుంబం కోర్టులో దావా వేసింది. ఈ కేసుపై విచారణ చేపట్టినా ధర్మాసనం నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా సినిమాల రిలీజ్‌కు ముందు కోటి రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment