కారులో థియేటర్‌కు వచ్చిన స్టార్ హీరో.. అభిమానుల దెబ్బకు ఆటోలో! | Kollywood Hero Vikram takes auto to avoid crowd after screening of Movie | Sakshi
Sakshi News home page

Vikram: కారులో థియేటర్‌కు వచ్చిన విక్రమ్.. అభిమానుల దెబ్బకు ఆటో ఎక్కేశాడు!

Published Fri, Mar 28 2025 5:17 PM | Last Updated on Fri, Mar 28 2025 5:36 PM

Kollywood Hero Vikram takes auto to avoid crowd after screening of Movie

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తాజాగా వీర ధీర శూర మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాలో రాయన్ మూవీ ఫేమ్ దుషారా విజయన్ హీరోయిన్‌గా నటించింది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ మూవీ ఎస్‌యూ అరుణ్‌కుమార్‌ దర్శకత్వం వహించారు. అయితే ఊహించని విధంగా తొలి రోజే ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఓటీటీ హక్కుల విషయంలో వివాదం తలెత్తడంతో మార్నింగ్ షోలు ఓవర్‌సీస్‌తో పాటు దేశవ్యాప్తంగా రద్దయ్యాయి. అయితే ఆ తర్వాత వివాదం సద్దుమణగడంతో ఈవినింగ్‌ నుంచి సినిమాను ప్రదర్శించారు.

ఈ మూవీ చూసేందుకు విక్రమ్ హీరో శివ కార్తికేయన్‌తో కలిసి చెన్నైలోని ఐకానిక్ సత్యం థియేటర్‌లో వీక్షించారు. అభిమానుల సమక్షంలో సినిమాను చూసి ఎంజాయ్ చేశారు. వీరి ధీర సూర మూవీ చూసిన తర్వాత విక్రమ్‌ తన కారులో కాకుండా ఆటోలో ప్రయాణించారు. థియేటర్‌ నుంచి ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కారు. దీనికి సంబంధించిన వీడియోను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే అభిమానుల నుంచి తప్పించుకోవడానికే విక్రమ్ ఆటోలో వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన కూర్చున్న ఆటోను కూడా అభిమానులు చుట్టుముట్టారు. దీంతో వారి నుంచి తప్పించుకునే క్రమంలోనే ఎగ్జిట్ గేట్ నుంచి ఆటోలో బయలుదేరి వెళ్లాడు. కాగా.. ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజరమూడు  ప్రధాన పాత్రల్లో నటించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement