
చెన్నై: ప్రఖ్యాత గీత రచయిత వైరముత్తుకు అరుదైన పురస్కారం లభించింది. మలయాళంలో దివంగత ప్రఖ్యాత కవి, సినీ గీత రచయిత ఓఎన్‌వీ గురుప్ పేరుతో 2017లో జాతీయ సాహితీ అవార్డులు ఏర్పాటు చేశారు. దీన్ని మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ కవులు, గీత రచయితలకే ప్రదానం చేస్తున్నారు. ఈ ఏడాది తమిళ ప్రఖ్యాత గీత రచయిత వైరముత్తుకు ప్రకటించారు. ఈ అవార్డును రాష్ర్టేతర ప్రముఖులకు ప్రకటించడం ఇదే ప్రథమం. అవార్డు గ్రహీతకు జ్ఞాపికతో పాటు, ధ్రువీకరణ పత్రం, రూ.3 లక్షల నగదు అందజేస్తారు. ఓఎన్‌వీ గురుప్ జాతీయ సాహితీ అవార్డుకు ఎంపిక కావడం గర్వంగా భావిస్తున్నట్లు వైరముత్తు పేర్కొన్నారు. వైరముత్తును సీఎం స్టాలిన్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment