గీత రచయిత వైరముత్తు అంత సచ్చీలుడేంకాదు అంటూ ఆయనకు వ్యతిరేకంగా మరో మహిళ గొంతు విప్పింది. లైంగిక వేధింపులపై మీటూ అంటూ సామాజిక మాధ్యమం ద్వారా పలువురు గొంతు విప్పుతున్నారు. మీటూ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మీటూతో ఒక కేంద్రమంతినే పదవి కోల్పాయారంటే ఆ ప్రభావం ఎంతుందో అర్థం చేసుకోవచ్చు.
ఇక కోలీవుడ్‌లో ప్రముఖ గీత రచయిత వైరముత్తుపై గాయని చిన్మయి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలాన్నే రేపుతున్నాయి. వైరముత్తులోని మరో కోణం గురించి బాధిత మహిళలు గొంతు విప్పుతున్నారు. చిన్మయి తరువాత అమెరికాకు చెందిన ఇద్దరు మహిళలు వైరముత్తు వేధింపుల బాధితులమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
తాజాగా దివంగత ప్రఖ్యాత గాయకుడు, నటుడు మలేషియా వాసుదేవన్ కోడలు, గాయని హేమమాలిని వైరముత్తు గురించి మాట్లాడుతూ ఆయనేమంత సచ్చీలుడు కాదని పేర్కొంది. ఈమె తన ఫేస్‌బుక్‌లో గాయని చిన్మయికి మద్దతుగా నిలిచింది. హేమమాలిని పేర్కొంటూ తమిళ సినీ పరిశ్రమ గాయని చిన్మయికి మద్దతుగా ఎందుకు నిలబడడం లేదో తనకు అర్ధం కావడం లేదన్నారు.
వైరముత్తు సచ్చీలుడు కాదన్న విషయం సినీపరిశ్రమకే తెలుసన్నారు. చిన్మయి ఎందుకు ఆ సంఘటనను 10 ఏళ్ల క్రితం చెప్పలేదు? అని ఆమెను ప్రశ్నిస్తున్నారెందుకు. ఇప్పటికైనా బహిరంగపరిచినందుకు దానిపై నిజా నిజాలను నిగ్గతేల్చాలన్నారు. చిన్నయిని ప్రశ్నిస్తున్న వారు వైరముత్తును ప్రశ్నించడం లేదే అని నిలదీశారు. ఆరోపణలను ఎదుర్కొంటున్నవారిని వదిలి బాధితులను ప్రశ్నించడం ఏంటని వాపోయారు.
చిత్రపరిశ్రమ ఏక పక్షంగా వ్వవహరిస్తోందని ఆరోపించారు. తాను ఒక ప్రైవేట్ చానల్‌లో పనిచేస్తున్న సమయంలో వైరముత్తు అక్కడ పనిచేసే ఒక యువ యాంకర్‌తో ఈ వ్యవహారంపై వేధించిన విషయం తనకు తెలుసని చెప్పారు. ఆయన గురించి తాను10 ఏళ్లలో పలు చోట్ల మాట్లాడాని తెలిపింది.
కాగా నోరు లేని వారి కోసం తన గొంతు విప్పుతున్న గాయని చిన్మయినిని అభినంధిస్తున్నాను అని గాయని హేమమాలిని పేర్కొన్నారు. ఇంతకు ముందు వైరముత్తుపై లైంగికవేధింపుల ఆరోపణలు చేసిన సింధూజా రాజారాం కూడా హేమమాలిని చెప్పిన ప్రైవేట్ చానల్‌లో పని చేసిన యువ యాంకర్ గురించి ప్రస్ధావించారన్నది గమనార్హం.
ఆస్పత్రిలో వైరముత్తు..
లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న వైరముత్తు శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మదురైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. ఆయనకు ఫుడ్ పాయిజన్ అయినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment