SP Balasubrahmaniyam
-
స్టార్ హీరోయిన్ బ్లాక్ బస్టర్ మూవీ.. దాదాపు 30 ఏళ్ల తర్వాత!
ప్రభుదేవా, నగ్మా జంటగా నటించిన ప్రేమికుడు చిత్రం రీ రిలీజ్‌కు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్‌కు నిర్మాతలుగా రమణ, మురళీధర్ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రీ రిలీజ్‌కు సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్, దర్శకులు ముప్పలనేని శివ, శివనాగు, శోభారాణి పాల్గొన్నారు. ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ముప్పలనేని శివ మాట్లాడుతూ.. '30 ఏళ్ల క్రితం వచ్చిన ప్రేమికుడు ఇప్పుడు రీ రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. అప్పట్లో ప్రభుదేవని చూసి స్ప్రింగ్‌లు ఏమన్నా మింగాడా అనుకునేవాళ్లం. ఒక మంచి ప్రేమ కథగా సెన్సేషన్ సృష్టించిన సినిమా ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందరితోపాటు ఈ సినిమా కోసం నేను కూడా ఎదురు చూస్తున్నా' అని అన్నారు. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ..' ఈ సినిమా రీ రిలీజ్ కూడా మంచి విజయం అందుకుంటుంది. గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం నటన అద్భుతంగా ఉంటుంది. ప్రభుదేవ నటన, డాన్సులు నగ్మ అందాలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. మా సోదరి సుధారాణికి ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అని అన్నారు. దర్శకుడు శివనాగుమాట్లాడుతూ.. 'ప్రేమికుడు ఈ తరంలో వచ్చుంటే కచ్చితంగా రూ.100 కోట్ల వసూళ్లు సాధించేంది. అప్పుడున్న బడ్జెట్‌కి రూ.3 కోట్లతో చేసిన సినిమా ఇప్పుడు కూడా రూ.30 కోట్లు సాధిస్తుందని ఆశిస్తున్నా. ఎస్పీ బాలసుబ్రమణ్యం నటన అద్భుతంగా ఉంటుంది. ప్రభుదేవా డాన్సులు ఈ సినిమాకి హైలెట్. రీ రిలీజ్ కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా' అని అన్నారు. కాగా.. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించగా.. కేటి కుంజుమన్ నిర్మించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. -
యూత్ నన్ను లెజెండ్ అని పిలుస్తున్నారు.. నేను ఎంత పుణ్యం చేసుకున్నాను..
-
యూత్ నన్ను లెజెండ్ అని పిలుస్తున్నారు.. నేను ఎంత పుణ్యం చేసుకున్నాను..
-
ఆయన మరణం తర్వాత నన్ను ఏ సంఘటన కదిలించడం లేదు: సునీత
టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మధుర గాత్రంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసే ఆమెకు పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారామె. ఇక తన జీవితంలో ఆమె ఎన్నో ఒడిదుడుకులు చూసిన సునీత తన కన్నీరు ఇంకిపోయాయనిచ, ప్రస్తుతం తనకు కన్నీళ్లు రావడం లేదంటూ తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఇండస్ట్రీలో ఆమె ఎక్కువ అభిమానించేది లెజెండరి సింగర్ దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యం అనే విషయం తెలిసిందే. చదవండి: అప్పట్లో సంచలనమైన మాధురీ లిప్‌లాక్, అత్యంత కాస్ట్లీ కిస్ ఇదేనట! ఆయనను మామయ్య అంటూ అప్యాయంగా పిలుస్తారామె. ఇక ఎస్పీ బాలు మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణాంతరం బాలుగారిని గుర్తు చేసుకుంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుని సునీత కన్నీరు పెట్టుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే తాజాగా ఈ ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. ‘నా జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి బాలూగారిని పోగొట్టుకున్నాను. ఆ సంఘటన తరువాత నాకు కన్నీళ్లు రావడం లేదు. జీవితంలో అంతకు మించి చలించే సంఘటనలు ఇంకా ఏముంటుంది? అనిపించింది. ఆయన మరణవార్త తర్వాత అంతగా నన్ను ఏ సంఘటనలు కదిలించడం లేదు. చదవండి: అప్పుడే ఓటీటీకి వారసుడు మూవీ! ఆ రోజు నుంచే స్ట్రీమింగ్? ఆయన జ్ఞాపకాలతో .. ఆయన చూపించిన మార్గంలో నడవడమే ఆయనకి మనమిచ్చే గౌరవం’ అని అన్నారు. అనంతరం తనపై వచ్చే విమర్శలపై స్పందించింది. ‘జీవితంలో నాకంటూ కొన్ని విలువలు, బాధ్యతలు ఉన్నాయి. నన్ను ద్వేషించేవారినీ, విమర్శించేవారిని పట్టించుకోకుండా నా ముందున్న లక్ష్యాన్ని చేరుకోవడానికే ప్రయత్నిస్తూ వెళ్లాను. నేను ఏం చేయాలి, ఏం చేయగలను అనే స్పష్టత నాకు ఉంది. ఆ క్లారిటీతోనే ముందుకు వెళ్తున్నా’ అని చెప్పుకొచ్చారు. కాగా కరోనా మహమ్మారి బారిన పడిన బాల సుబ్రహ్మణ్యం సుదీర్ఘ పోరాటం అనంతరం 2020 సెప్టెంబర్ 25న తుదిశ్వాస విడిచారు. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) -
న్యూజెర్సీలో ఎస్పీ బాలుకు స్వర నీరాజనం!
న్యూ జెర్సీ: అమెరికాలో గాన గంధర్వుడు ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం పాటలు మరింత మారుమోగేలా చేసేందుకు అమెరికాలో కళావేదిక అనే స్వచ్ఛంద సంస్థ బాలు స్వరఝరి అనే కొత్త విభాగాన్ని జూన్ 4న ఏర్పాటు చేసింది. బాల సుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా న్యూజెర్సీలో ఈ విభాగాన్ని ప్రారంభించింది. బ్రిడ్జ్‌వాటర్‌లోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో జరిగిన ఈ ప్రారంభ కార్యక్రమంలో సంగీత దర్శకుడు కోటి, స్టెర్లీ ఎస్. స్టాన్లీ (న్యూజెర్సీ జనరల్ అసెంబ్లీ సభ్యుడు), ఉపేంద్ర చివుకుల (కమిషనర్, న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ పబ్లిక్ యుటిలిటీస్) పలువురు తెలుగు ప్రముఖులు పాల్గొన్నారు. వారితో పాటుగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్), తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా), అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఎటిఎ), తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ (టాటా), తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ (టిఎఫ్ఎఎస్), తెలుగు లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్ (టిఎల్‌సిఎ) సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక సాయి దత్త పీఠం వ్యవస్థాపకులు, ప్రధాన అర్చకులు రఘుశర్మ శంకరమంచి వేద స్వస్తి తో ప్రారంభించారు. స్థానిక ప్రముఖ గాయకుడు ప్రసాద్ సింహాద్రి ‘శంకరా..! నాద శరీరా పరా’ పాటతో ఎస్పీ బాలుకు ఘన నివాళి అర్పించారు. అనంతరం పలువురు స్థానిక నాయకులు బాలు గారితో తమ అనుబంధాలను గుర్తుచేసుకున్నారు. గాన గంధర్వుడు ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా బాలూ స్వరఝరి సంస్థ లక్ష్యమని కళా వేదిక అధ్యక్షులు, వ్యవస్థాపకురాలు స్వాతి అట్లూరి తెలిపారు. స్వరఝరి కార్యక్రమం ద్వారా కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఎంతగానో దోహదం చేస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా తమ స్వచ్చంద సంస్థ ద్వారా కరోనా కష్ట కాలంలో ఇబ్బందులు పడుతున్న పలువురు సినీ కళాకారులకు తమవంతు సాయం అందచేస్తామని స్వాతి అట్లూరి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సంగీత ప్రముఖ సంగీత దర్శకుకుడు కోటి మాట్లాడుతూ.. ఎస్పీ బాలుతో కలిసి 2 వేలకు పైగా పాటల్లో పనిచేశానని పేర్కొన్నారు. ప్లేబ్యాక్ సింగర్ ఉష ఎస్పీ బాలుకు నివాళులు అర్పించారు. కాగా ఉష స్వరఝరి సంస్థకు కార్యదర్శిగా కూడా వ్యవహరించనున్నారు. ఈ సంస్థకు ఎస్పీ చరణ్, ఎస్పీ శైలజ, హరీష్ శంకర్ గౌరవ సలహాదారులుగా వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్, దేవి శ్రీ ప్రసాద్, అనుప్ రూబెన్స్, పలువురు టాలీవుడ్ గాయకులు స్వర ఝరీ బృందానికి తమ శుభాకాంక్షలను తెలిపారు. -
గాన గంధర్వుడికి అపూర్వనివాళి
పుదుచ్చేరి: 2020వ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది సంగీతాభిమానులను తీవ్ర విషాదంలో ముంచేసిన వార్త గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అకాల మరణం. కోవిడ్-19 మహమ్మారి బారిన పడిన సెప్టెంబర్ 25న ఆయన ఈ లోకాన్ని వీడిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ప్రతీక్షణం ఆయన్ను తలచుకోని అభిమాని లేరంటే అతిశయోక్తి కాదు. తాజాగా పుదుచ్చేరిలోని ఒక బేకరి సంస్థ బాలుకి విభిన్నంగా నివాళులర్పిస్తోంది. చాక్లెట్‌తో ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటుచేసే సాంప్రదాయాన్ని పాటిస్తున సంస్థ తాజాగా ఎస్పీబీకి నివాళిగా ఏకంగా 339 కిలోలతో 5 అడుగుల 8 అంగుళాల ఎత్తున్న చాక్లెట్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఇది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.(ఒక శకం ముగిసింది!) పుదుచ్చేరిలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని ప్రతి ఏటా పలు రంగాలలో గొప్ప పేరు గాంచిన ప్రముఖులను స్మరించుకోవడం ఏర్పాటు చేయడం జునిక బేకరీకి అలవాటు. ఈ క్రమంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రాహాన్ని కూడా పూర్తిగా చాక్లెట్‌తో మాత్రమే రూపొందించి ప్రదర్శనకు ఉంచింది. ఇది జనవరి 3వరకు ప్రదర్శనలో ఉంటుందని చాక్లెట్ విగ్రహాన్ని తయారు చేసిన చెఫ్ రాజేంద్రన్ చెప్పారు. 339 కిలోల బరువున్నఈ విగ్రహాన్ని రూపొందించడానికి తమకు 161 గంటలు పట్టిందని తెలిపారు. దీనికి మంచి ఆదరణ లభిస్తుండటంతో బేకరీ యజమాని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే కోయంబత్తూరులో సిరితుళి అనే స్వచ్ఛంద సంస్థ ఎస్పీబీ వనం పేరుతో నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పనస, మామిడి, ఎర్ర చందనం, సాండర్స్, టేకు, రోజ్‌వుడ్, వెదురు, మహోగనితోపాటు ఇతర చెట్లను పెంచనున్నారు. కాగా ఇంతకుముందు దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలం చాకొలెట్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అలాగే 600 కిలోలసూపర్ స్టార్ రజనీకాంత్ చాకొలేట్ విగ్రహాన్ని తయారుచేసిన కబాలీ ఫ్యాన్స్‌ను ఆకర్షించింది. అలాగే కొంతమంది క్రికెట్ ఆటగాళ్ళ విగ్రహాలను కూడా రూపొందించింది. -
బాలూ.. భారతరత్నమే..
సాక్షి, హైదరాబాద్: గానమే ప్రాణమని.. ప్రాణమే గానమని భారతీయ చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేశారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. సినీ నేపథ్య గాయకుల్లోనే నూతన ఒరవడిని సృష్టించిన ఆయన గాత్రం శిఖరసమానం. అయిదు దశాబ్దాల పాటు సుమారు 18 భాషల్లో 45వేల పైచిలుకు గీతాలతో సినీ కళామతల్లికి స్వరాభిషేకం గావించిన మేరునగం. ఇటీవల అస్తమించిన ఆ మహనీయుడికి భారతరత్న ఇవ్వాలని, ఈ పురస్కారానికి అన్నివిధాలా ఆయన అర్హులని డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బాలూకు భారతరత్న అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిపాదించారు. ఈ నిర్ణయంపై అన్ని వర్గాల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సినీ సంగీత దర్శకులు, గాయనీ గాయకులు దీనికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇదొక మంచి నిర్ణయమని ‘సాక్షి’తో పేర్కొన్నారు. భారతరత్న ఎప్పుడో ఇవ్వాల్సింది ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారికి ‘భారతరత్న’ అవార్డు ఎప్పుడో రావాల్సింది. ఆలస్యం అవ్వడం బాధగా ఉంది. ఆయన మరణం తర్వాత అటువంటి అవార్డుతో సత్కరించుకోవాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ఏపీ ప్రభుత్వంప్రతిపాదించడం నిజంగా అభినందనీయం. నాలుగు తరాల హీరోలకి సంగీతమందించిన గొప్ప వ్యక్తి ఎస్పీ బాలు. పాట ప్రారంభించే ముందు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ బాలు గారు నమస్కరించి పాట పాడటం మొదలుపెట్టేవారు. – అనూప్‌రూబెన్స్, మ్యూజిక్ డైరెక్టర్ మంచి ప్రతిపాదన దివంగత ఎస్పీ బాలు సార్‌కు భారతరత్న ఇవ్వాలనే ప్రతిపాదన ఆహ్వానించదగిన నిర్ణయం. ఎస్పీబీ ఒక సంగీతంలోనే కాకుండా డబ్బింగ్లో, నటనలో సైతం తన ప్రతిభను 100 శాతం కనబర్చారు. గొప్ప మనసున్న వ్యక్తికి భారతరత్న పురస్కారం ఇవ్వడం మనమిచ్చే అరుదైన గౌరవం. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదన ఎంతో సముచితం. – సునీత, గాయని 100 శాతం అర్హులు బిఫోర్ ఎస్పీ బాలు..ఆఫ్టర్ ఎస్పీ బాలు అనే స్థాయికి భారతీయ సంగీతాన్ని తీసికెళ్లిన మహనీయుడు ఎస్పీ బాలు గారు. భారతరత్నతో ఆయన్ని సత్కరించుకోవాలని కోరడం నిజంగా అభినందనీయం. ఆ అవార్డుకు బాలు గారు 100శాతం అర్హులు కూడా. – భాస్కరభట్ల, పాటల రచయిత చాలా సంతోషంగా ఉంది ఎస్పీ బాలు గారికి భారతరత్న ఇవ్వాలనే ప్రతిపాదన చాలా సంతోషమనిపించింది. ఇప్పటికే దీనిపై నేను ఓ ప్రతిపాదనపై సంతకం చేసి ఇతరులతో కూడా చేపించా. నిజంగా ఆయన్ని భారతరత్నతో సత్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకు ఉంది. – కౌసల్య, సింగర్ గాయకుల దిక్సూచి ఎస్పీ బాలు గారి హాయాంలో పాటలు పాడే భాగ్యం కలిగినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా. నాలాంటి ఎందరో యంగ్ సింగర్స్‌కి ఆయనో దిక్సూచి. అంతగొప్ప వ్యక్తిని ‘భారతరత్న’తో సత్కరించుకోవాలి. ఇటువంటి గొప్ప ఆలోచన ఏపీ ప్రభుత్వానికి రావడం నిజంగా హ్యాపీ.. – సమీర భరద్వాజ్, సింగర్. పురస్కారంతో సత్కరించుకోవాలి బాలు గారికి ‘భారతరత్న’ ఇవ్వాలని ప్రతిపాదించడం వంద శాతం ఆహ్వానించదగ్గ నిర్ణయం. బాలు గారు ఒక లెజండరీ. అటువంటి వ్యక్తిని మనం అంతటి గొప్ప పురస్కారంతో సత్కరించుకోవాల్సిందే. – రాహుల్ సిప్లిగంజ్, సింగర్ అది మన బాధ్యత వేలపాటలు పాడిన గొప్ప గాయకుడు బాలుగారిని భారతరత్నతో సత్కరించుకోవడం మన బాధ్యత కూడా. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఆ పురస్కారానికి ఆయన నిజంగా అర్హులు. ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం. – అంజన సౌమ్య, సింగర్ -
వాటిపై త్వరలోనే క్లారిటీ ఇస్తాము: ఎస్పీ చరణ్
సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గత శుక్రవారం మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణానంతరం అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎంజీఎం ఆసుపత్రి సిబ్బంది బాలుకు సరిగా వైద్యం అందించలేదని, అంతేకాకుండా మొత్తం బిల్లు చెల్లిస్తే తప్ప మృతదేహాన్ని అప్పగించమని ఆయన కుటుంబాన్ని వేధించినట్లు కొన్ని వార్తలు ప్రచారమవుతున్నాయి. వాటిని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ ఖండించారు. సోషల్ మీడియాలో అయిదు నిమిషాల నిడివిగల ఒక వీడియోను విడుదల చేశారు. ఇందులో బాలసుబ్రహ్మణ్యం వైద్యానికి సంబంధించిన బిల్లులను త్వరలోనే వెల్లడిస్తానని, దాంతో అందరికి ఈ వదంతులపై ఒక అవగాహన వస్తుందని అన్నారు. ఆస్పత్రి సిబ్బంది వైఫల్యం ఏం లేదని చరణ్ స్పష్టం చేశారు. ఈ విషయంపై చరణ్ మాట్లాడుతూ, ‘అసలు ఇలాంటి విషయాన్ని ఎవరు సృష్టిస్తారో అర్థం కావట్లేదు. అలాంటి మాటలు ఎంతమందిని బాధపెడతాయో వాళ్లకు తెలియడం లేదు. ఇలాంటి ప్రచారం చేస్తోంది కచ్ఛితంగా బాలసుబ్రహ్మణ్యం అభిమానులు కాదు. ఎందుకంటే నాన్న ఎప్పటికీ ఇలా చేయరు. ఆయన అభిమానులు కూడా ఇలా చేయరు. ఆయన ప్రతి ఒక్కరిని క్షమిస్తారు. అలాగే ఇలా ప్రచారం చేసే వాళ్లని నేను కూడా క్షమిస్తున్నాను’ అని తెలిపారు. ఇక బాలసుబ్రహ్మణ్యం మరణించే సమయానికి ఆసుపత్రికి 1.85కోట్ల రూపాయిలు చెల్లించాల్సి ఉందని, మొత్తం బిల్లు 3 కోట్ల పైనే అయ్యిందని ప్రచారం జరుగుతోంది. బ్యాలెన్స్ డబ్బులు చెల్లిస్తే కాని మృతదేహాన్ని అప్పగించమని ఆసుపత్రి సిబ్బంది బాలు కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టిందని ఫేక్‌న్యూస్ వైరల్ అవుతోంది. ఇక ఈ విషయంలో బాలు కుటుంబ సభ్యులు తమిళనాడు ప్రభుత్వ జోక్యాన్ని కోరగా పళనిస్వామి ప్రభుత్వం స్పందించలేదని, తరువాత జాతీయ స్థాయిలో సంప్రదించగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమార్తె ఆసుపత్రి బిల్లులు చెల్లించడంతో ఆసుపత్రి సిబ్బంది బాలు మృతదేహాన్ని అప్పగించిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ వ్యాఖ్యలను ఎస్పీ చరణ్ ఖండించారు. ఆసుపత్రి సిబ్బందితో కలిసి బిల్లుల వివరాలను వెల్లడిస్తానని సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో చరణ్ పేర్కొన్నారు. -
జానే వాలో జరా ముడ్ కే దేఖో ఇధర్
బాలూకి రఫీ దైవ స్వరూపుడు. గానదూత. మార్దవ మనోహరుడు. బాలు ఆయనకు ఏకలవ్య శిష్యుడు. పరమ భక్తుడు. బాలు సొంత రికార్డింగ్ థియేటర్ ‘కోదండపాణి’లో మూడు ఫొటోలు పెద్ద పెద్దవి ఉంటాయి. ఒకటి ఘంటసాలది. రెండోది సంగీత దర్శకుడు కోదండపాణిది. మూడోది రఫీది. 18 ఏళ్ల వయసుకే (1964) సినిమా అవకాశాల కోసం మద్రాసు చేరుకున్న బాలు తండ్రి కోరిక మేరకు ఏ.ఎం.ఐ.ఇ చేరారు. రోజూ ఉదయాన్నే కాలేజీకి వెళ్లేటప్పుడు ఒక టీకొట్టు దగ్గర రఫీ పాటలు వినిపిస్తూ ఉండేవి. రోజూ రఫీ పాడిన ‘దీవానా హువా బాదల్’ వింటూ అక్కడే ఆగిపోయేవారు. అది పూర్తయ్యే సరికి కళ్ల నీళ్లతో అక్కడి నుంచి వెళ్లిపోయేవారు. వారం రోజులపాటు ఇది చూసిన టీ కొట్టువాడు ‘ఎందుకయ్యా ఏడుస్తావు. అదంత హుషారు పాటైతే’ అని ఆశ్చర్యపోయాడు. ఏమో.. రఫీ గొంతులోని మార్దవం వింటే కళ్లు స్పందించడం మొదలెడతాయి. బాలూకు తొలి అవకాశం ఇప్పించడానికి ఎస్.పి. కోదండపాణి నటుడు పద్మనాభం దగ్గరకు తీసుకెళ్లినప్పుడు ‘ఏదైనా పాడు నాయనా’ అని అడిగితే బాలూ పాడింది రఫీ పాడిన ‘జానే వాలో జరా ముడ్ కే దేఖో ఇధర్’ (దోస్తీ) పాటనే. నౌషాద్కు అమిత భక్తుడైన సంగీత దర్శకుడు వేణును అవకాశమివ్వమని బాలు వెళ్లినప్పుడు నౌషాద్ బాణీ కట్టిన ‘పాల్కీ’ సినిమాలోని ‘కల్ రాత్ జిందగీసే ములాకాత్ హోగయి’ పల్లవిని వినిపించి ‘అబ్బాయ్.. ఈ పల్లవిని యథాతథంగా పాడిన నాడు నీకు అవకాశం ఇస్తాను’ అన్నారు. దానికి బాలు ‘గురువుగారూ.. ఎన్నాళ్లయినా రఫీలాగా ఈ పల్లవిని పాడలేను’ అని వినయంగా ఒప్పుకున్నారు. రఫీ పాటలు ఇంట్లో ఎప్పుడైనా ప్లే అయితే బాలు సతీమణి సావిత్రి వెంటనే వాటిని ఆపేస్తారు. ఎందుకంటే భావోద్వేగానికి లోనైన బాలు బాత్రూమ్లోకి వెళ్లి ఏడ్చేస్తారు. అంతగా ఆరాధించే రఫీని బాలు ఒక్కసారే చెన్నైలో చూశారు. ఆయన పాడటానికి వచ్చినప్పుడు కాళ్లకు నమస్కారం పెట్టి తప్పుకున్నారు. ఆయనతో మాట్లాడలేదన్న వెలితి బాలూకు ఎతేరే మేరే బీచ్ మే“ కైసా హై యే బంధన్ హిందీలో బాలు కె.జె.ఏసుదాస్ ‘చిత్‌చోర్’ (1976)తోనే హిందీలో పెద్ద గుర్తింపు పొందారు. అయితే బాలూకు ఆ గుర్తింపు రావడానికి మరో ఐదేళ్లు పట్టింది. అది కూడా కె.బాలచందర్ వల్ల. ‘మరో చరిత్ర’ రీమేక్‌గా ‘ఏక్ దూజే కే లియే’ (1981) తీయాలనుకున్నప్పుడు సంగీతానికి లక్ష్మీకాంత్–ప్యారేలాల్ను పెట్టుకున్నారు. అయితే పాటలన్నీ బాలు పాడాలని షరతు పెట్టారు. ఇది లక్ష్మీకాంత్–ప్యారేలాల్‌లకు పెద్దగా ఇష్టం లేదు. ‘బాలు పాడితే దక్షిణాది యాస ఉంటుందేమో’ అని నొక్కులు చెప్పారు. ‘ఉంటే మరీ మంచిది. ఎందుకంటే నా సినిమాలో హీరో కథ ప్రకారం దక్షిణాదివాడు కదా’ అన్నారు బాలచందర్. ఇక నో చెప్పడానికి వారికి వీలు లేకపోయింది. కాని బాలూ దీనిని సవాలుగా తీసుకున్నారు. ఎందుకంటే తాను ఈ సినిమాలో పాడాల్సింది సంగీత సామ్రాజ్ఞి లతా మంగేష్కర్తో. అందుకే ‘ఏక్ దూజే కే లియే’లోని అన్ని పాటలు అద్భుతంగా పాడి ఉత్తరాది వారితోపాటు తాను ఇదివరకే జయించిన దక్షిణాదివారిని కూడా అలరించారు. ఆ సినిమాలోని ‘తేరే మేరే బీచ్ మే’ పాటకు జాతీయ అవార్డు పొందారు. లతాతో పాడిన ‘హమ్ మిలే తుమ్ మిలే’ పాట కూడా హిట్. ఆ తర్వాత ఆర్.డి. బర్మన్ చేసిన ‘సాగర్’ (1985) పాటలు బాలూకు విశేషమైన పేరు తెచ్చి పెట్టాయి. అందులో కమల్‌హాసన్‌కు పాడిన ‘ఓ మారియా’ పాట నేటికీ హిట్‌గా నిలిచింది. కాని బాలూకి హిందీలో ఘన పరంపర వేసిన సినిమా మాత్రం ‘మైనే ప్యార్ కియా’ (1989). సల్మాన్ ఖాన్‌ను హీరోగా పరిచయం చేస్తూ భిన్నమైన గొంతు కోసం సంగీత దర్శకుడు రామ్ లక్ష్మణ్, దర్శకుడు సూరజ్ భరజ్యాతా బాలూను ఎంచుకున్నారు. బాలు గొంతు సల్మాన్‌కు సరిగ్గా సరిపోయింది. అందులోని ‘దిల్ దీవానా’, ‘కబూతర్ జా జా’, ‘ఆజా షామ్ హోనే ఆయీ’ పాటలన్నీ సూపర్‌డూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత సల్మాన్ కోసమే పాడిన ‘పత్థర్ కే ఫూల్’ (1991) సినిమాలోని ‘కభీ తూ ఛలియా లగ్తా హై’, ‘తుమ్ సే జొ దేఖ్తేహీ ప్యార్హువా’ చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. ఇక ‘సాజన్’ (1991) నదీమ్–శ్రావణ్ సంగీతంలో పెద్ద మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఇందులో బాలు పాడిన ‘జియేతో జియే కైసే’, ‘తుమ్సేమిల్నేకి తమన్నా హై’, ‘దేఖాహై పెహెలీ బార్’ పాటలు దేశమంతా మోగిపోయాయి. ‘లవ్’ సినిమాలో ‘సాథియా తూనే క్యా కియా’ కూడా పెద్ద హిట్. ఆ తర్వాత ‘హమ్ ఆప్ కే హై కౌన్’ (1994)తో బాలు సినీ గానంలో తనకు సమ ఉజ్జీ లేరన్నంతగా ఆ పాటలను హిట్ చేశారు. ఆ సినిమాలోని ‘దీదీ తేరా దేవర్ దివానా’, ‘పహెలా పహెలా ప్యార్ హై’ పాటలు ఇన్నేళ్ల తర్వాత కూడా ప్రియ గీతాలుగా నిలిచాయి. హిందీలో బాలు దాదాపు 350 పాటలు పాడి ఉండొచ్చని తెలుస్తోంది. ధర్మేంద్ర, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, జితేంద్ర, సంజయ్ ద™Œ లాంటి హీరోలు బాలు పాటకు అభినయించారు. ‘ప్రేమ’ హిందీ రీమేక్ ‘లవ్’లో తన పాత్ర సుప్రసిద్ధ విలన్ అంజాద్ ఖాన్ చేస్తే ఆయనకు బాలు ప్లేబ్యాక్ పాడారు. షారూక్ ఖాన్ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో బాలు పాడిన టైటిల్ సాంగ్ ఇటీవలి సూపర్ హిట్.ప్పుడూ ఉండేది. -
లెజెండరీ సింగర్ బర్త్‌డే : శుభాకాంక్షల వెల్లువ
సాక్షి, హైదరాబాద్ : లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 73వ బర్త్‌డే సందర్భంగా ట్విటర్ వేదికగా ఆయన అభిమానులు శుభాకాంక్షలతో హోరెత్తించారు. అభిమాన గాయకుడికి పలువురు ప్రముఖులు, అభిమానులు పెద్దసంఖ్యలో శుభాకాంక్షలు తెలుపడంతో ట్విటర్ టాప్ ట్రెండ్స్‌లో నిలిచింది. బాలుగా పేరొందిన సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో వేలాది పాటలకు సుమధుర గాత్రంతో ప్రాణం పోశారు. తన సుదీర్ఘ కెరీర్లో ఆయన ఆరు జాతీయ ఫిల్మ్ అవార్డులు, 25 సార్లు ఏపీ ప్రభుత్వ నంది అవార్డులను సొంతం చేసుకున్నారు. బాలీవుడ్ ఫిల్మ్‌ఫేర్ అవార్డును, ఆరు దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ అవార్డులను కైవసం చేసుకున్నారు. ఇక 2001లో ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు, 2011లో పద్మవిభూషణ్ అవార్డు ఆయనను వరించాయి. చదవండి : ఎస్పీ బాలు నోటా కరోనా పాట! -
కరోనా పాట
కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు కావాల్సిన జాగ్రత్తలు పాటించమని సినిమా స్టార్స్ తమ సోషల్ మీడియా ద్వారా అభిమానులందర్నీ కోరుతున్నారు. అయితే ఒక్కొక్కరిదీ ఒక్కో స్టయిల్. ప్రముఖ గాయకులు యస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాపై తమిళంలో ఓ పాట కంపోజ్ చేసి, పాడారు. ఈ పాటను రచయిత వైరముత్తు రచించారు. ప్రస్తుత సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ ఈ పాటను రాశారు. ఈ పాటను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు యస్పీబీ. -
నిర్మాత చేయి ఎప్పుడూ పైనే ఉండాలి
‘‘ఆదిత్య 369’ సినిమాకు నేను సమర్పకుడిగా వ్యవ హరించాను. ‘గుణ 369’ ప్రారంభోత్సవం రోజున స్క్రిప్ట్‌ను నా చేతులతోనే ఇప్పించారు. లైట్ బాయ్ నుంచి నిర్మాత వరకు ఒళ్లు దాచుకోకుండా పనిచేసే ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే.. అది సినిమా ఇండస్ట్రీ మాత్రమే’’ అని ప్రముఖ గాయకులు ఎస్పీ బాల సుుబ్రహ్మణ్యం అన్నారు. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ, అనఘ జంటగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గుణ 369’. ప్రవీణ కడియాల సమర్పణలో అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 2న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో బిగ్ సీడీ, ఆడియో సీడీలను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, దర్శకుడు బోయపాటి శ్రీను విడుదల చేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ – ‘‘యజమాని బావుంటే పనిచేసేవాళ్లు బావుంటారు. నిర్మాత చేయి ఎప్పుడూ పైనే ఉండాలని కోరుకుంటాను. ట్రైలర్ చూస్తుంటే ‘గుణ 369’ క్వాలిటీ తెలుస్తోంది. ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నా’’ అన్నారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ– ‘‘అర్జున్‌ని నా బ్రదర్‌లా భావిస్తాను. తను డైరెక్టర్ కావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అనిల్, ప్రవీణ, తిరుమల్ రెడ్డి నాకు ఎంతో కావాల్సిన వాళ్లు. సినిమా చూశాను. ఎంతో విలువలతో చేశారు. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు. అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ– ‘‘నేను ఎంత బావుండాలని మా నాన్నగారు కోరుకుంటారో మా గురువు బోయపాటిగారు కూడా అంతే కోరుకుంటారు. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన బాలుగారికి ధన్యవాదాలు. మంచి సినిమా చేశాం.. సినిమా చూసిన ప్రేక్షకులు బాగా లేదని మాత్రం చెప్పరు’’ అన్నారు. ‘‘ఓ సాధారణ వ్యక్తి జీవితకథే ఈ చిత్రం. మిమ్మల్ని (ప్రేక్షకులు) మీరు తెరపై చూసుకుంటారు’’ అన్నారు ప్రవీణ కడియాల. ‘‘మంచి కథ, కథనంతో సాగే సినిమా ఇది. ఎక్కడా ఇది మా తొలి సినిమా అనే భావన రాలేదు’’ అన్నారు తిరుమల్ రెడ్డి. కార్తికేయ మాట్లాడుతూ– ‘‘ఆర్ఎక్స్ 100’ పూర్తి చేసిన తర్వాత సినిమా హిట్ అయిపోతుందని నేను ప్రిపేర్ కాలేదు. హిట్ తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అర్థం కాలేదు. మనకు తెలిసిన మేర కొన్ని కథలను ఎంచుకుంటాం. అర్జున్ చెప్పిన కథ వినగానే సినిమా చేస్తున్నామని చెప్పాను. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందో.. స్టార్ డమ్ తెస్తుందనో కాదు... నన్ను నేను తెరపై చూసుకున్న సినిమా కావడంతో నాకు స్పెషల్ మూవీగా భావించాను. అర్జున్‌తో పనిచేస్తుంటే ప్రతి సెకనుకి 100 కోట్ల లాటరీ తగులుతున్నట్లు అనిపించింది. అంత కిక్ ఇచ్చింది. ‘గుణ 369’ హిట్ కావాలని అర్జున్ కంటే బాగా కోరుకున్న బోయపాటిగారికి స్పెషల్ థ్యాంక్స్ గుణ పాత్ర చేసినందుకు గర్వపడుతున్నా’’ అన్నారు. అనఘ, నిర్మాతలు వల్లూరిపల్లి రమేశ్, కిరణ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్, ‘మా’ అధ్యక్షుడు నరేశ్, విష్ణు ఇందూరి, నటి సంజనా తదితరులు మాట్లాడారు. -
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో...
చిత్రం: అంతులేని కథ రచన: ఆత్రేయ సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్ గానం: ఎస్. పి. బాలు ఎన్నో పాటలు వస్తాయి, ఎన్నో పాటలు పోతాయి. కాని కొన్ని పాటలు మాత్రమే బతికుంటాయి. నేటికీ సజీవంగా ఉన్న పాట ‘అంతులేని కథ’ చిత్రంలోని ‘తాళికట్టు శుభవేళ’. తమిళంలో కణ్నదాసన్ రచించిన పాటను ఆత్రేయ ఎంతో అందంగా తెనిగించారు. ‘ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో’ అంటూ మెడలో తాళికట్టడం మన చేతిలో ఉండదని, ఎవరికి ఎవరితో ముడి పడుతుందనేది బ్రహ్మ దేవుడు రాసి పంపుతాడని రాశారు మనసు కవి ఆత్రేయ. ఆరు నిమిషాల నిడివి ఉన్న ఈ పాటంతా మిమిక్రీతో కలిసి ఉంటుంది. ‘‘వికటకవిని నేను వినండి ఒక కథ చెబుతాను/కాకులు దూరని కారడవి /అందులో కాలం ఎరుగని మానొకటి/ఆ అందాల మానులో ఆ అద్భుత వనంలో/చక్కని చిలుకలు అక్కాచెల్లెలు పక్కన గోరింకలు/ఒక గోరింకకు ఓ చిలకమ్మకు ఒద్దిక కుదిరెనమ్మా/బావా రావా నన్నేలుకోవా’’ అంటూ వచ్చే మొదటి చరణంలో ప్రతి వాక్యం తరవాత మిమిక్రీ వస్తుంది. ‘కాకులు దూరని కారడవి’ తర్వాత వచ్చే పక్షుల శబ్దాలలో కొన్ని శబ్దాలు, చిలుక గొంతులో ‘బావా బావా నన్నేలుకోవా’ అనే మాటలు స్వయంగా బాలునే మిమిక్రీ చేశారు. ఈ పాటలో మిమిక్రీకి ఎలా నటించాలో నాకు అర్థం కాలేదు. ప్రసిద్ధ మిమిక్రీ కళాకారుడు ‘నేరెళ్ల వేణుమాధవ్’ మా గురువులు రాజారామ్దాస్కి సన్నిహితులు. ఆయన ద్వారా వేణుమాధవ్‌గారిని కలిసి ఎలా నటించాలో నేర్చుకున్నాను. ఈ పాట ఎంతోమంది మిమిక్రీ కళాకారులకు స్ఫూర్తి. ఈ సందర్భంలో నాకు ఒక విషయం గుర్తుకు వస్తుంది. ‘నర్తనశాల’ చిత్రంలో బృహన్నల పాత్ర కోసం ఎన్.టి. రామారావు, ప్రముఖ నాట్యాచార్యులు వెంపటి చినసత్యం గారిని ఇంటికి పిలిపించుకుని నాట్యం నేర్చుకున్నారు. అదేవిధంగా నేను మిమిక్రీ కళాకారుడిగా నటించడం కోసం నేరెళ్ల వేణుమాధవ్ గారి దగ్గర నేర్చుకున్నాను. ‘‘మేళాలు తాళాలు మంగళవాద్యాలు మిన్నంటి మోగెనమ్మా/వలపు విమానాన తలపుల వేగాన వచ్చాయి కాన్కలమ్మా/ఊరేగుదారుల వయ్యారి భామలు వీణలు మీటిరమ్మా/శింగారి జాణల ముంగాలి మువ్వలు ఘల్లున మోగెనమ్మా/గోమాత లేగతో కొండంత ప్రేమతో దీవిం^è వచ్చెనమ్మా/కాన్వెంటు పిల్లల పోలిన నెమళులు గ్రీటింగ్సు చెప్పిరమ్మా/నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా’’ అని సాగే చరణంలో ప్రతి వాక్యం పూర్తి కాగానే మిమిక్రీ బిట్ వస్తుంది. వీణ శబ్దం వచ్చే చోట మిస్టర్ అయ్యర్ తన గొంతులో పలికించారు. బాలచందర్ దగ్గర అసోసియేట్‌గా చేస్తున్న ఈరంకి శర్మ దగ్గరుండి నటన నేర్పించారు. ‘చేయీచేయిగ చిలుకగోరింక శయ్యకు తరలిరమ్మా/చెల్లెలి కోసం త్యాగం చేసిన చిలకమ్మ తొలగెనమ్మా/తప్పుగ తలచిన అప్పటి గోరింకకిప్పుడు తెలిసెనమ్మా/అది చిలుకే కాదని బావిలో కప్పని జాలిగ తలచెనమ్మా’ అనే చరణంతో పాట ముగుస్తుంది. ఇందులో ‘చేయీచేయిగ చిలుకగోరింక’ అనే వాక్యాలకు ముందు వచ్చే మాండొలిన్లాంటి శబ్దం కూడా బాలు గారే అనుకరించారు. మిగతా శబ్దాలను ఎం.ఎస్. విశ్వనాథన్ వాద్య బృందంలోని మురుగేష్, సాయిబాబా, సదాశివం ఉరఫ్ సదన్ వారి వారి గొంతుల్లో పలికించారు. ఈ చిత్ర కథ మొత్తం ఈ పాటలో వచ్చేస్తుంది. ఈ పాటకు నలభై సంవత్సరాలు నిండినా నేటికీ కొత్తగానే ఉంటుంది. ఈ పాటను వేదిక మీద పాడేటప్పుడు మాత్రం అన్ని శబ్దాలను ఎస్. పి. బాలు స్వయంగా చేస్తున్నారు. మూడు రోజుల పాటు ఈ పాట షూటింగ్ జరిగింది. నేను బాగానే నటించానని బాలచందర్ మెచ్చుకున్నారు. నా నటనలో ఏఎన్ఆర్ స్టయిల్ వస్తోందని, నా సొంత స్టైల్ డెవలప్ చేసుకోమని సూచించారు. నేను నటించిన మొదటి చిత్రంలోని నా మొదటి పాట ఇంత పెద్ద హిట్ కావడం నా జన్మలో మరచిపోలేను. నారాయణరావు సినీ నటుడు - ఇంటర్వ్యూ: వైజయంతి పురాణపండ -
సంగీతమే ప్రాణం
నెల్లూరు(బృందావనం): చిరుప్రాయం నుంచి సంగీతమే ప్రాణంగా జీవితాన్ని గడుపుతున్న తనకు నెల్లూరులో జరుగుతున్న త్యాగరాజస్మరణోత్సవాల్లో పాల్గొనే భాగ్యం దక్కడం పూర్వజన్మ సుకృతమని ప్రముఖ సినీగాయకుడు ఎన్.సి.కారుణ్య పేర్కొన్నారు. నెల్లూరులో మంగళవారం నుంచి ప్రారంభమైన 53వ శ్రీత్యాగరాజస్మరణోత్సవాల కార్యక్రమానికి కారుణ్య విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. సంగీతంలో తమ ఆరాధ్య దైవంగా భావించే ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆహ్వానం మేరకు నెల్లూరుకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సంగీతం జీవితానికి సంతృప్తిని ఇస్తుందని, సంగీతమంటే అర్థంకాకుండా చేసే గానం కాదన్నారు. బాల్యం నుంచి శాస్త్రీయ సంగీతం న్యూజెనరేషన్ వాగ్గేయకారులు తన పెద్దనాన్న వాగ్దేయ విద్వాన్మణి నల్లాన్ చక్రవర్తిమూర్తి సహకారంతో సంగీతసాధన చేశానని తెలిపారు. గురుసేవగా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టానని పేర్కొన్నారు. శాస్త్రీయసంగీతమే తన పాటలకు బీజమన్నారు. ఇండియన్ ఐడల్ జడ్జి సోనునిగమ్ తన ఇంటికి పిలిపించి పాటలనుస్పష్టంగా పాడేందుకు గల కారణం శాస్త్రీయ సంగీతమే సాధన అని తెలుసుకుని ప్రశంసించారని పేర్కొన్నారు. గత ఏడాది హైదరాబాద్‌లో అక్టోబరు 6వ తేదీ, డిసెంబరు 25వ తేదీన తొలి కర్ణాటక సంగీత కచేరి నిర్వహించానన్నారు. తొలిసంగీత కచేరి సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను ఆహ్వానించేందుకు వెళ్లిన తాను ఆయన ఆహ్వానం మేరకు ఆరునెలల తిరుగకమునుపే నెల్లూరు వచ్చి శాస్త్రీయసంగీత కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంంగా ఉందన్నారు. 15 ఏళ్ల నుంచి సంగీతంపై పట్టు 15 ఏళ్ల నుంచి సంగీతంపై పట్టు ఉందని కారుణ్య తెలిపారు. ఇప్పటికీ ఎన్.సి.కారుణ్య యూ ట్యూబ్ వీడియో ఉందని పేర్కొన్నారు. ఎన్.సి.కారుణ్య అని టైప్‌చేస్తే మంచి సంగీతం వినొచ్చని తెలిపారు. వందే భావగురుమ్ శీర్షికతో సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసిన లబ్దప్రతిష్టులైన గురువులను స్మరిస్తూ కార్యక్రమం నిర్వహిస్తున్నానని తెలిపారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎన్నడూ తనచేత కచేరిపెట్టించుకుంటారని అనుకోలేదన్నారు. శాస్త్రీయ సంగీతమంటే తొడగొట్టుకుంటూ పాడడంకాదని, సాహిత్యం, భావం అర్థమయ్యే రీతిలో శాస్త్రీయ సంగీతానికి విశేష ప్రచారం కల్పించాలని ఉందన్నారు. రాగాలు, కొత్త ప్రక్రియలు, థిల్లానా పాడనున్నట్లు పేర్కొన్నారు. -
ఎస్.పి.బాలుకు కీమా సంగీత అవార్డు
బొమ్మనహళ్లి : సంగీత రంగంలో ఉత్తమ సేవలను అందించిన వారికి ఇచ్చే నాల్గవ కన్నడ అంతర్జాతీయ సంగీత అవార్డు (కీమా)ను సీనియర్ గాయకుడు ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యంకు శుక్రవారం రాత్రి అందజేశారు. బాలుతో పాటు బీఎస్ వేణుగోపాల్, సంగీత దర్శకుడు రఘు దీక్షత్‌లకు కూడా ఈ అవార్డును అందజేశారు. ఇందులో అత్యుత్తమ సంయోజన అవార్డును హరికావ్యకు, జనప్రియ పాటలు పాడే విభాగంలో సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్‌కు, అత్యుత్తమ సాహితీవేత్త జయంత్ కాయ్కిణి, అత్యుత్తమ ప్లేబ్యాక్ సింగర్ చేతన్ నాయక్, అత్యుత్తమ ప్లేబ్యాక్ గాయని సమన్వియ శర్మ, వాయిద్య సంయోజకుడు ఆర్.ఎస్. గణేష్ నారాయణలకు అవార్డులు అందజేశారు. శుక్రవారం రాత్రి బెంగళూరు నగరంలో జరిగిన ఈ కార్యక్రమంలో కన్నడ సీనియర్ నటుడు శ్రీనాథ్, నిర్మాత రఘునాథ్ పాల్గొన్నారు.