బాలూకి రఫీ దైవ స్వరూపుడు. గానదూత. మార్దవ మనోహరుడు. బాలు ఆయనకు ఏకలవ్య శిష్యుడు. పరమ భక్తుడు. బాలు సొంత రికార్డింగ్ థియేటర్ ‘కోదండపాణి’లో మూడు ఫొటోలు పెద్ద పెద్దవి ఉంటాయి. ఒకటి ఘంటసాలది. రెండోది సంగీత దర్శకుడు కోదండపాణిది. మూడోది రఫీది. 18 ఏళ్ల వయసుకే (1964) సినిమా అవకాశాల కోసం మద్రాసు చేరుకున్న బాలు తండ్రి కోరిక మేరకు ఏ.ఎం.ఐ.ఇ చేరారు. రోజూ ఉదయాన్నే కాలేజీకి వెళ్లేటప్పుడు ఒక టీకొట్టు దగ్గర రఫీ పాటలు వినిపిస్తూ ఉండేవి. రోజూ రఫీ పాడిన ‘దీవానా హువా బాదల్’ వింటూ అక్కడే ఆగిపోయేవారు.
అది పూర్తయ్యే సరికి కళ్ల నీళ్లతో అక్కడి నుంచి వెళ్లిపోయేవారు. వారం రోజులపాటు ఇది చూసిన టీ కొట్టువాడు ‘ఎందుకయ్యా ఏడుస్తావు. అదంత హుషారు పాటైతే’ అని ఆశ్చర్యపోయాడు. ఏమో.. రఫీ గొంతులోని మార్దవం వింటే కళ్లు స్పందించడం మొదలెడతాయి. బాలూకు తొలి అవకాశం ఇప్పించడానికి ఎస్.పి. కోదండపాణి నటుడు పద్మనాభం దగ్గరకు తీసుకెళ్లినప్పుడు ‘ఏదైనా పాడు నాయనా’ అని అడిగితే బాలూ పాడింది రఫీ పాడిన ‘జానే వాలో జరా ముడ్ కే దేఖో ఇధర్’ (దోస్తీ) పాటనే.
నౌషాద్‌కు అమిత భక్తుడైన సంగీత దర్శకుడు వేణును అవకాశమివ్వమని బాలు వెళ్లినప్పుడు నౌషాద్ బాణీ కట్టిన ‘పాల్కీ’ సినిమాలోని ‘కల్ రాత్ జిందగీసే ములాకాత్ హోగయి’ పల్లవిని వినిపించి ‘అబ్బాయ్.. ఈ పల్లవిని యథాతథంగా పాడిన నాడు నీకు అవకాశం ఇస్తాను’ అన్నారు. దానికి బాలు ‘గురువుగారూ.. ఎన్నాళ్లయినా రఫీలాగా ఈ పల్లవిని పాడలేను’ అని వినయంగా ఒప్పుకున్నారు. రఫీ పాటలు ఇంట్లో ఎప్పుడైనా ప్లే అయితే బాలు సతీమణి సావిత్రి వెంటనే వాటిని ఆపేస్తారు. ఎందుకంటే భావోద్వేగానికి లోనైన బాలు బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఏడ్చేస్తారు. అంతగా ఆరాధించే రఫీని బాలు ఒక్కసారే చెన్నైలో చూశారు. ఆయన పాడటానికి వచ్చినప్పుడు కాళ్లకు నమస్కారం పెట్టి తప్పుకున్నారు. ఆయనతో మాట్లాడలేదన్న వెలితి బాలూకు ఎతేరే మేరే బీచ్ మే“
కైసా హై యే బంధన్
హిందీలో బాలు
కె.జె.ఏసుదాస్ ‘చిత్‌చోర్’ (1976)తోనే హిందీలో పెద్ద గుర్తింపు పొందారు. అయితే బాలూకు ఆ గుర్తింపు రావడానికి మరో ఐదేళ్లు పట్టింది. అది కూడా కె.బాలచందర్ వల్ల. ‘మరో చరిత్ర’ రీమేక్‌గా ‘ఏక్ దూజే కే లియే’ (1981) తీయాలనుకున్నప్పుడు సంగీతానికి లక్ష్మీకాంత్–ప్యారేలాల్‌ను పెట్టుకున్నారు. అయితే పాటలన్నీ బాలు పాడాలని షరతు పెట్టారు. ఇది లక్ష్మీకాంత్–ప్యారేలాల్‌లకు పెద్దగా ఇష్టం లేదు. ‘బాలు పాడితే దక్షిణాది యాస ఉంటుందేమో’ అని నొక్కులు చెప్పారు. ‘ఉంటే మరీ మంచిది. ఎందుకంటే నా సినిమాలో హీరో కథ ప్రకారం దక్షిణాదివాడు కదా’ అన్నారు బాలచందర్. ఇక నో చెప్పడానికి వారికి వీలు లేకపోయింది. కాని బాలూ దీనిని సవాలుగా తీసుకున్నారు.
ఎందుకంటే తాను ఈ సినిమాలో పాడాల్సింది సంగీత సామ్రాజ్ఞి లతా మంగేష్కర్‌తో. అందుకే ‘ఏక్ దూజే కే లియే’లోని అన్ని పాటలు అద్భుతంగా పాడి ఉత్తరాది వారితోపాటు తాను ఇదివరకే జయించిన దక్షిణాదివారిని కూడా అలరించారు. ఆ సినిమాలోని ‘తేరే మేరే బీచ్ మే’ పాటకు జాతీయ అవార్డు పొందారు. లతాతో పాడిన ‘హమ్ మిలే తుమ్ మిలే’ పాట కూడా హిట్. ఆ తర్వాత ఆర్.డి. బర్మన్ చేసిన ‘సాగర్’ (1985) పాటలు బాలూకు విశేషమైన పేరు తెచ్చి పెట్టాయి. అందులో కమల్‌హాసన్‌కు పాడిన ‘ఓ మారియా’ పాట నేటికీ హిట్‌గా నిలిచింది. కాని బాలూకి హిందీలో ఘన పరంపర వేసిన సినిమా మాత్రం ‘మైనే ప్యార్ కియా’ (1989). సల్మాన్ ఖాన్‌ను హీరోగా పరిచయం చేస్తూ భిన్నమైన గొంతు కోసం సంగీత దర్శకుడు రామ్ లక్ష్మణ్, దర్శకుడు సూరజ్ భరజ్యాతా బాలూను ఎంచుకున్నారు.
బాలు గొంతు సల్మాన్‌కు సరిగ్గా సరిపోయింది. అందులోని ‘దిల్ దీవానా’, ‘కబూతర్ జా జా’, ‘ఆజా షామ్ హోనే ఆయీ’ పాటలన్నీ సూపర్‌డూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత సల్మాన్ కోసమే పాడిన ‘పత్థర్ కే ఫూల్’ (1991) సినిమాలోని ‘కభీ తూ ఛలియా లగ్‌తా హై’, ‘తుమ్ సే జొ దేఖ్‌తేహీ ప్యార్‌హువా’ చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. ఇక ‘సాజన్’ (1991) నదీమ్–శ్రావణ్ సంగీతంలో పెద్ద మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఇందులో బాలు పాడిన ‘జియేతో జియే కైసే’, ‘తుమ్‌సేమిల్‌నేకి తమన్నా హై’, ‘దేఖాహై పెహెలీ బార్’ పాటలు దేశమంతా మోగిపోయాయి. ‘లవ్’ సినిమాలో ‘సాథియా తూనే క్యా కియా’ కూడా పెద్ద హిట్.
ఆ తర్వాత ‘హమ్ ఆప్ కే హై కౌన్’ (1994)తో బాలు సినీ గానంలో తనకు సమ ఉజ్జీ లేరన్నంతగా ఆ పాటలను హిట్ చేశారు. ఆ సినిమాలోని ‘దీదీ తేరా దేవర్ దివానా’, ‘పహెలా పహెలా ప్యార్ హై’ పాటలు ఇన్నేళ్ల తర్వాత కూడా ప్రియ గీతాలుగా నిలిచాయి. హిందీలో బాలు దాదాపు 350 పాటలు పాడి ఉండొచ్చని తెలుస్తోంది. ధర్మేంద్ర, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, జితేంద్ర, సంజయ్ ద™Œ లాంటి హీరోలు బాలు పాటకు అభినయించారు. ‘ప్రేమ’ హిందీ రీమేక్ ‘లవ్’లో తన పాత్ర సుప్రసిద్ధ విలన్ అంజాద్ ఖాన్ చేస్తే ఆయనకు బాలు ప్లేబ్యాక్ పాడారు. షారూక్ ఖాన్ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో బాలు పాడిన టైటిల్ సాంగ్ ఇటీవలి సూపర్ హిట్.ప్పుడూ ఉండేది.
Comments
Please login to add a commentAdd a comment