రిషీ కపూర్ మరణ వార్త విని దక్షిణ, ఉత్తరాది తారలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్వీటర్ ద్వారా పలువురు ప్రముఖులు స్పందించారు. కొందరి ట్వీట్స్ ఈ విధంగా...
► నా ప్రియనేస్తం రిషీ కపూర్ మరణ వార్త నా హృదయాన్ని బద్దలయ్యేలా చేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.
– రజనీకాంత్
► నా మిత్రుడు రిషీ కపూర్ మృతి చెందారన్న విషయాన్ని నేను నమ్మలేకపోతున్నాను. ఎప్పుడూ చిరునవ్వుతో పలకరించేవారు. మా ఇద్దరి మధ్య మంచి స్నేహానుబంధం ఉంది.
– కమల్‌హాసన్
► లెజెండరీ యాక్టర్ రిషీ కపూర్, హైలీ టాలెంటెడ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్‌లను మనం కోల్పోవడం బాధాకరం. వీరి మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు.
– మోహన్‌బాబు
► గొప్ప నటుడు, నా మిత్రుడు రిషీ కపూర్ మృతి చెందారన్న వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన ప్రస్థానం ఎందరికో స్ఫూర్తి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.
– చిరంజీవి
► నటదిగ్గజాలు రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్ మనకు దూరం కావడం చాలా బాధాకరం. ఇండియన్ సినిమాకు వీరు లేని లోటు తీరనిది. వారి చిత్రాల ద్వారా ఈ ఇద్దరూ మనకు ఎప్పటికీ గుర్తుంటారు.
– బాలకృష్ణ
► గడిచిన రెండు రోజుల్లో ఇద్దరు గొప్ప నటులను (ఇర్ఫాన్ ఖాన్, రిషీ కపూర్) కోల్పోవడం బాధాకరం. రిషీజీ మనందరి మనసుల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారు. ఆయన్ను కలిసినప్పుడల్లా కొత్త విషయాలను నేర్చుకునేవాణ్ణి. రిషీగారి మరణం మా కుటుంబానికి కూడా తీరని లోటు.
– వెంకటేష్
► రిషీజీ... మా అందరి హృదయాల్లో మీరు ఎప్పటికీ నిలిచే ఉంటారు.
– నాగార్జున
► రిషీ కపూర్ మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. భారతీయ సినిమాకు తీరని లోటు. ఆప్తమిత్రుణ్ణి కోల్పోయాను. ఆయనతో మేం నిర్మించిన ‘చాందిని’ చిత్రం తాలూకు జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలమే. రిషి మంచి మానవతావాది.
– టి. సుబ్బరామిరెడ్డి
► రిషీ కపూర్‌గారి ఆకస్మిక మరణం నన్ను బాధించింది. ఆయన మరణం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటు.
– పవన్ కల్యాణ్
► రిషీ కపూర్‌గారి మరణవార్త నా హృదయాన్ని బద్దలు చేసింది. అద్భుతమైన ప్రతిభావంతులు, నిజమైన లెజెండ్. ఆయన లేని లోటు సినీ పరిశ్రమకు తీరనిది.
– మహేశ్‌బాబు
► నిన్న (బుధవారం) సుప్రీమ్‌లీ టాలెంటెడ్ ఇర్ఫాన్ ఖాన్‌గారిని కోల్పోయాం. ఈ రోజు (గురువారం) లెజెండరీ యాక్టర్ రిషీ కపూర్‌గారు మనందరికీ దూరమయ్యారు. భారతీయ సినిమాకు తీరని లోటు.
– ఎన్టీఆర్
► రిషీ కపూర్‌గారి మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇండియన్ సినిమాకు మరో గొప్ప నటుడు దూరమయ్యారు.
– రామ్‌చరణ్
► అతను వెళ్లిపోయాడు... రిషీ కపూర్ వెళ్లిపోయాడు... నేను కుప్పకూలిపోయాను.
– అమితాబ్ బచ్చన్
► చింటూ (రిషీ కపూర్) సార్ ఆత్మకు శాంతి కలగాలి.
– సల్మాన్‌ఖాన్
► ఒక గొప్ప నటుణ్ణి మనం కోల్పోయాం. మంచి మానవతావాది. కళామతల్లి ముద్దుబిడ్డ. మీ (రిషీ కపూర్) నటనతో మా జీవితాలకు వినోదాన్ని పంచినందుకు ధన్యవాదాలు.
– ఆమిర్ ఖాన్
► ఒక లెజెండ్. మంచి కో స్టార్. మా ఫ్యామిలీకి మంచి స్నేహితుడు.
– అక్షయ్ కుమార్
► మన వెండితెర కలలను నిజం చేసుకునే దారిలో మనం కలిసి ప్రయాణించాం. నువ్వు (రిషీ కపూర్) నా పెద్ద అన్నయ్యవి. నాకు ఓ భుజంలా సపోర్ట్ చేశావు. స్నేహితుడిలా నన్ను ముందుకు నడిపించావు. నాతో పాటు నా కుటుంబానికి కూడా నీ అపారమైన ప్రేమను పంచావు. నువ్వు లేని లోటు మాకు తెలుస్తూనే ఉంటుంది.
– అనిల్ కపూర్
► నీతో (రిషీ కపూర్) కలిసి సమయాన్ని గడిపినందుకు సంతోషంగా ఉంది. నీ గురించి ఎప్పుడు ఆలోచించినా నా ముఖంపైకి చిరునవ్వు వస్తుంది. అంత ప్రేమ చూపించావు.
– బోనీ కపూర్
► ‘ఔరంగజేబ్’ (2013) సినిమాలో తొలిసారి చింటూ అంకుల్‌తో కలిసి నటించాను. ఆ సమయంలో కాస్త నెర్వస్‌గా అనిపించింది. మా నాన్నగారితో (బోనీకపూర్) ‘యాక్టర్‌గా అర్జున్ రాణిస్తాడు’ అని చింటూ అంకుల్ చెప్పారు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహాన్ని మర్చిపోలేను.
– అర్జున్ కపూర్
► రిíషీగారి మరణ వార్తను ఇంకా నేను నమ్మలేకపోతున్నాను. మంచి నటుణ్ణి కోల్పోయాం. ఆయనతో కలిసి పని చేసే అదృష్టం దక్కడం గౌరవంగా భావిస్తున్నాను.
– మాధురీ దీక్షిత్
► రిషిజీ అద్భుతమైన నటుడు. మీ (రిషీ కపూర్) చిత్రాల ద్వారా మిమ్మల్ని మేం ఎప్పటికీ గుర్తుపెట్టుకునే ఉంటాం. ఎన్నో అవార్డ్ ఫంక్షన్స్ వేదికగా ఆయనతో కలిసి నవ్విన జ్ఞాపకాలను మర్చిపోలేను.
– కాజోల్
► చింటూ అంకుల్ మరణ వార్త విని నా హృదయం ముక్కలైంది. క్యాన్సర్ మహమ్మారితో పోరాడే క్రమంలో మేం ఇద్దరం న్యూయార్క్‌లో కలుసుకున్నాం. మాట్లాడుకున్నాం. అప్పుడు మాట్లాడిన మాటలు నాతో ఎప్పటికీ నిలిచి ఉంటాయి.
– సోనాలీ బింద్రే
► చింటూ అంకల్ ఒక లెజెండ్. ఇకపై మీతో ఫుడ్, రెస్టారెంట్ల గురించి చర్చించుకోవడాన్ని మిస్ అవుతాను.
– కరిష్మా కపూర్
► నాకు తెలిసిన బెస్ట్ బాయ్స్ పప్పా (రణ్‌ధీర్‌కపూర్) అండ్ చింటూ అంకుల్ (రిషీ కపూర్).
– కరీనా కపూర్
రిషీ కపూర్ మృతి పట్ల తారల నివాళి
Published Fri, May 1 2020 3:23 AM | Last Updated on Fri, May 1 2020 3:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment