టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మధుర గాత్రంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసే ఆమెకు పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారామె. ఇక తన జీవితంలో ఆమె ఎన్నో ఒడిదుడుకులు చూసిన సునీత తన కన్నీరు ఇంకిపోయాయనిచ, ప్రస్తుతం తనకు కన్నీళ్లు రావడం లేదంటూ తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఇండస్ట్రీలో ఆమె ఎక్కువ అభిమానించేది లెజెండరి సింగర్ దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యం అనే విషయం తెలిసిందే.
చదవండి: అప్పట్లో సంచలనమైన మాధురీ లిప్‌లాక్, అత్యంత కాస్ట్లీ కిస్ ఇదేనట!
ఆయనను మామయ్య అంటూ అప్యాయంగా పిలుస్తారామె. ఇక ఎస్పీ బాలు మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణాంతరం బాలుగారిని గుర్తు చేసుకుంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుని సునీత కన్నీరు పెట్టుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే తాజాగా ఈ ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. ‘నా జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి బాలూగారిని పోగొట్టుకున్నాను. ఆ సంఘటన తరువాత నాకు కన్నీళ్లు రావడం లేదు. జీవితంలో అంతకు మించి చలించే సంఘటనలు ఇంకా ఏముంటుంది? అనిపించింది. ఆయన మరణవార్త తర్వాత అంతగా నన్ను ఏ సంఘటనలు కదిలించడం లేదు.
చదవండి: అప్పుడే ఓటీటీకి వారసుడు మూవీ! ఆ రోజు నుంచే స్ట్రీమింగ్?
ఆయన జ్ఞాపకాలతో .. ఆయన చూపించిన మార్గంలో నడవడమే ఆయనకి మనమిచ్చే గౌరవం’ అని అన్నారు. అనంతరం తనపై వచ్చే విమర్శలపై స్పందించింది. ‘జీవితంలో నాకంటూ కొన్ని విలువలు, బాధ్యతలు ఉన్నాయి. నన్ను ద్వేషించేవారినీ, విమర్శించేవారిని పట్టించుకోకుండా నా ముందున్న లక్ష్యాన్ని చేరుకోవడానికే ప్రయత్నిస్తూ వెళ్లాను. నేను ఏం చేయాలి, ఏం చేయగలను అనే స్పష్టత నాకు ఉంది. ఆ క్లారిటీతోనే ముందుకు వెళ్తున్నా’ అని చెప్పుకొచ్చారు. కాగా కరోనా మహమ్మారి బారిన పడిన బాల సుబ్రహ్మణ్యం సుదీర్ఘ పోరాటం అనంతరం 2020 సెప్టెంబర్ 25న తుదిశ్వాస విడిచారు.
Comments
Please login to add a commentAdd a comment