సందడిగా ‘సాక్షి’ ఎరీనా వన్ యూత్‌ఫెస్ట్‌ | Sakshi arena one youth fest at LB stadium | Sakshi
Sakshi News home page

సందడిగా ‘సాక్షి’ ఎరీనా వన్ యూత్‌ఫెస్ట్‌

Published Sun, Feb 21 2016 7:40 PM | Last Updated on Sun, Sep 3 2017 6:07 PM

సందడిగా ‘సాక్షి’ ఎరీనా వన్ యూత్‌ఫెస్ట్‌

సందడిగా ‘సాక్షి’ ఎరీనా వన్ యూత్‌ఫెస్ట్‌

హైదరాబాద్‌: విద్యకే పరిమితం కాకుండా.. విద్యార్థులలోని సృజనాత్మక శక్తులను... వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ‘సాక్షి’ మీడియా గ్రూప్ ప్రయత్నంలో భాగంగా ‘సాక్షి’ ఎరీనా వన్ యూత్‌ఫెస్ట్‌ను నిర్వహిస్తోంది. ఆదివారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యూత్ ఫెస్ట్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సినీ తారల తళుకులు.. హుషారెత్తించే కామెడీ స్కిట్లు.. విద్యార్థుల సందడితో స్టేడియం మార్మోగుతోంది. ఈ రోజు సాయంత్రం మొదలయిన ఈ యూత్‌ ఫెస్ట్‌కు వివిధ రంగాల ప్రముఖులు, సినీతారలు మంచు మనోజ్‌, మంచు లక్ష్మీ, ఆది పినిశెట్టి, సునీల్‌, సంజనా, నిర్మాత దిల్‌రాజు తదితరులు హాజరయ్యారు. వీరితో పాటు ప్రముఖ సింగర్స్ బాబా సెహగల్, రోల్ రిదా తమ పాటలతో ఉర్రూతలూగించనున్నారు. ఈ మెగా ఈవెంట్‌కు ఇండియా నంబర్ వన్ స్పోర్ట్స్ బైక్ బజాజ్ పల్సర్ అసోసియేటెడ్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది.

ఈ కార్యక్రమంలో భాగంగా గానం, సంగీతం, ఆటలు తదితర అంశాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. విజేతలకు ఆదివారం బహుమతులను అందజేస్తారు. ఎంపీ సీహెచ్ మల్లారెడ్డి, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల సొసైటీ సెక్రటరీ డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, సినీ తార మంచు లక్ష్మి, విజ్ఞాన్ యూనివర్సిటీ చైర్మన్ ఎల్.రత్తయ్య, సుల్తాన్ ఉల్ ఉలూం కాలేజ్ గౌరవ సెక్రటరీ జాఫర్ జావిద్ తదితరులు ఫెస్ట్‌ను ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement