నేడు ‘సాక్షి’ ఎరీనా వన్ యూత్‌ఫెస్ట్
వేదిక : ఎల్బీ స్టేడియం
సవుయుం : సాయంత్రం3 గంటల నుంచి
సందడి చేయనున్న సినీ తారలు
సాక్షి, సిటీబ్యూరో: విద్యకే పరిమితం కాకుండా.. విద్యార్థులలోని సృజనాత్మక శక్తులను... వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ‘సాక్షి’ మీడియా గ్రూప్ ప్రయత్నిస్తోంది. దీని కోసం ‘సాక్షి’ ఎరీనా వన్ యూత్‌ఫెస్ట్‌ను నిర్వహిస్తోంది. ఆదివారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యూత్ ఫెస్ట్ అంగరంగ వైభవంగా జరుగనుంది. సినీ తారల తళుకులు.. హుషారెత్తించే కామెడీ స్కిట్లు.. విద్యార్థుల సందడితో స్టేడియుం మార్మోగనుంది. సాయంత్రం 3 గంటలకు మొదలయ్యే ఈ ఫెస్ట్‌కు వివిధ రంగాల ప్రముఖులు హాజరుకానున్నారు. సినీతారలు అదా శర్మ, డింపుల్ చోపదే, రెజీనా, సునీల్, మంచు మనోజ్, నాని, ఆది, ఆది పినిశెట్టి తదితరులు సందడి చేయనున్నారు. వీరితో పాటు ప్రముఖ సింగర్స్ బాబా సెహగల్, రోల్ రిదా తమ పాటలతో ఉర్రూతలూగించనున్నారు. ఈ మెగా ఈవెంట్‌కు ఇండియా నంబర్ వన్ స్పోర్ట్స్ బైక్ బజాజ్ పల్సర్ అసోసియేటెడ్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా గానం, సంగీతం, ఆటలు తదితర అంశాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. విజేతలకు ఆదివారం బహుమతులను అందజేస్తారు. ఎంపీ సీహెచ్ మల్లారెడ్డి, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల సొసైటీ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సినీ తార మంచు లక్ష్మి, విజ్ఞాన్ యూనివర్సిటీ చైర్మన్ ఎల్.రత్తయ్య, సుల్తాన్ ఉల్ ఉలూం కాలేజ్ గౌరవ సెక్రటరీ జాఫర్ జావిద్ తదితరులు ఫెస్ట్‌ను ప్రారంభించనున్నారు. ఈ మెగా ఫెస్ట్‌కు హాజరయ్యే విద్యార్థులు తమ కళాశాలల గుర్తింపు కార్డులను వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎంట్రీ పాస్‌ల కోసం ‘సాక్షి’ ఎరీనా వన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈవెంట్ వెబ్‌సైట్‌ను చూడవచ్చు. మరిన్ని వివరాలకు 95058 34448, 040-23256134కు కాల్ చేయవచ్చు.