నాటా తెలుగు మహాసభలకు తారాగణం | NATA Telugu Mahasabhalu starts from 27th May | Sakshi
Sakshi News home page

నాటా తెలుగు మహాసభలకు తారాగణం

Published Mon, May 23 2016 6:32 PM | Last Updated on Mon, Sep 4 2017 12:46 AM

NATA Telugu Mahasabhalu starts from 27th May

హైదరాబాద్ : ఉత్తర అమెరికా డల్లాస్ నగరంలో ఈ నెల 27 నుండి 29వ తేదీ వరకు జరుగనున్న నాటా తెలుగు మహాసభలకు తెలుగు తారలు తరలివస్తున్నారని నాటా అధ్యక్షుడు డాక్టర్ మోహన్ మల్లం, మహా సభల కన్వీనర్ డాక్టర్ గూడూరు రమణారెడ్డిలు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సినీ ప్రముఖులు రకుల ప్రీత్‌సింగ్, నిత్యా మీనన్, ప్రణీత, మోడల్ మాధురి ఇతాగి, నందిని రాయ్, సియా గౌతమ్, రచన మౌర్య, సునీత వర్మ, తేజస్విని, సుధీర్‌బాబు, వరుణ్‌తేజ్ తదితరులు సభలకు హాజరు కానున్నారని పేర్కొన్నారు.

అదేవిధంగా డైరెక్టర్లు కోదండరామిరెడ్డి, ఆదిత్య, సీవీరెడ్డి, హరీష్ శంకర్, మధుర శ్రీధర్, మేర్లపాక గాంధీ  తదితరులు తమ అనుభవాలు పంచుకోవడానికి నాటా మహాసభలకు హాజరుకానున్నారని సాంస్కతిక కార్యక్రమాల నాయకుడు డాక్టర్ నాగిరెడ్డి, సమన్వయకర్త రామసూర్యారెడ్డి, సహ కన్వీనర్ శ్రీధర్‌రెడ్డిలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement