
శ్రీప్రణవపీఠ వ్యవస్థాపకులు, త్రిభాషామహాసహస్రావధాని శ్రీవద్దిపర్తి పద్మాకర్ గారి ఆశీస్సులతో వారి శిష్యులు అమెరికాలోని డల్లాస్‌లో "శ్రీ వద్దిపర్తి పద్మాకర్ ఫౌండేషన్" https://vaddipartipadmakar.org/ తరఫున కార్టర్ బ్లడ్ కేర్‌తో కలిసి నిర్వహించిన రక్తదాన కార్యక్రమం అత్యంత విజయవంతమైంది.
ఫ్రిస్కో, శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వేదికగా జరిగిన ఈ డ్రైవ్‌కు అనుకున్నదానికంటే ఎక్కువ మంది పాల్గొన్నారు. 33 కన్నా ఎక్కువ మంది దాతలు రావటంతో కార్టర్ బ్లడ్ కేర్ కొంతమంది దాతలను వెనుకలకు పంపాల్సివచ్చింది. ఉదయం 9.30 నిలకు మొదలైన రక్తదాన కార్యక్రమం మద్యాహ్నం 1.30 ని.ల వరకు జరిగింది.
అమెరికాలో, టెక్షాస్ రాష్ట్రం డల్లాస్ లో నెలకొల్పబడిన "శ్రీ వద్దిపర్తి పద్మాకర్ ఫౌండేషన్" తరపున సత్సంగ సభ్యులందరూ ఏకగ్రీవంగా కలిసి ఈ ప్రయత్నానికి మద్దతు ఇచ్చారు. రక్తదానం చేయలేని వారు కూడా తమ పూర్తి సహాయసహకారాలు అందించి సేవా బాధ్యతలను స్వీకరించారు.
(చదవండి: న్యూజెర్సీలో ఘనంగా బాలల సంబరాలు..)