- భారత ప్రముఖులకు అమెరికా పర్యటనలో తనిఖీల నుంచి మినహాయింపు
- జూలైలో ఒప్పందంపై సంతకాలు
న్యూఢిల్లీ: అమెరికా, భారత్‌ల మధ్య జూలైలో జరగనున్న అంతర్గత భద్రత చర్చల సందర్భంగా ఇరు దేశాలూ రెండు కీలక ఒప్పందాలు చేసుకోనున్నాయి. ప్రముఖ భారత పౌరులు అమెరికాకు వచ్చినపుడు వారికి తనిఖీల నుంచి మినహాయింపునిచ్చే అంశంపై ఒక ఒప్పందం.. ఉగ్రవాద సమాచారాన్ని ఇరు దేశాలూ ఎప్పటికప్పుడు ఇచ్చిపుచ్చుకునే అంశంపై మరొక ఒప్పందం చేసుకోనున్నట్లు సమాచారం. జూలైలో వాషింగ్టన్‌లో జరిగే ఇరు దేశాల అంతర్గత భద్రత చర్చల్లో హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, అమెరికా అంతర్గత భద్రత శాఖ మంత్రి జే చార్లెస్ జాన్సన్‌లు తమ తమ బృందాలతో పాల్గొననున్నారు.
మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానమంత్రులు, మాజీ కేంద్రమంత్రులు, సినిమా తారలు, అగ్రగామి పారిశ్రామికవేత్తలు, తరచుగా అమెరికాలో తరచుగా పర్యటించే వారు.. ఆ దేశానికి వచ్చినపుడు విమానాశ్రయాల్లో తనిఖీల విషయంలో ఎటువంటి అవరోధాలూ లేకుండా మినహాయింపునిచ్చేందుకు ఉద్దేశించిన ‘గ్లోబల్ ఎంట్రీ’ కార్యక్రమంలో భారత్ కూడా చేరాలని అమెరికా పట్టుపడుతోంది. ఈ క్రమంలో చేసుకోనున్న ఒప్పందంలో ముందుగా 2వేల మంది ప్రముఖులను జాబితాలో చేర్చే అవకాశముందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇప్పటివరకు అమెరికా గ్లోబల్ ఎంట్రీలో ఏడు దేశాలు మాత్రమే ఉన్నాయి.
‘గ్లోబల్ ఎంట్రీ’లో భారత్!
Published Tue, May 31 2016 2:41 AM | Last Updated on Thu, Apr 4 2019 3:21 PM
Advertisement
Advertisement