జెట్ ఎయిర్‌వేస్ ఆఫర్ | Jet Airways offers limited period discount on int'l tickets | Sakshi
Sakshi News home page

జెట్ ఎయిర్‌వేస్ ఆఫర్

Published Tue, Jun 2 2015 2:08 AM | Last Updated on Sun, Sep 3 2017 3:03 AM

జెట్ ఎయిర్‌వేస్ ఆఫర్

జెట్ ఎయిర్‌వేస్ ఆఫర్

న్యూఢిల్లీ: ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ సంస్థ జెట్ ఎయిర్‌వేస్ టికెట్ ధరల్లో పరిమిత కాల ఆఫర్‌ను ప్రకటించింది. ప్రీమియర్, ఎకానమీ క్లాస్ టికెట్ ధరల్లో 30 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు పేర్కొంది. జూన్ 1 నుంచి 4 వరకు టికెట్లను బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. గల్ఫ్, సార్క్, ఏసియన్, యూరప్, యూఎస్, కెనడా ప్రాంతాలకు వెళ్లే వారు ఈ ఆఫర్ కింద టికెట్లను బుక్ చేసుకోవచ్చని వివరించింది.

ఈ ఆఫర్ కింద టికెట్లను బుక్ చేసుకున్న వారు సెప్టెంబర్ 14 తర్వాత ఎప్పుడైనా ప్రయాణించవచ్చని తెలిపింది. తన భాగస్వామి ఎతిహాద్ విమానాలకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement