
నేటి నుంచి అమల్లోకి కొత్త రేట్లు
హైదరాబాద్: నగరంలోని నెహ్రూ జూ పార్కు సందర్శనకు కొత్త టికెట్ రేట్లు ఈ నెల 1 నుంచి (శనివారం) అమలులోకి రానున్నాయి. గతంలో పెద్దలకు వారం రోజుల్లో రూ.70, చిన్నారులకు రూ.45 ఉండగా.. వీకెండ్‌తో పాటు సెలవు రోజుల్లో రూ.80, రూ.55 ఉండగా.. ప్రస్తుతం రెండు కేటగిరీలుగా కాకుండా వారం రోజుల్లో పెద్దలకు రూ.100, చిన్నారులకు రూ.50గా నిర్ధారించారు. వీటితో పాటు జూ సందర్శనలో వివిధ కేటగిరీలకు కూడా రేట్లు పెరిగాయి.
కొత్త రేట్లు ఇలా..
గతంలో రూ.120 టికెట్ ఉన్న స్టిల్ కెమెరాకు ప్రస్తుతం రూ.150 వసూలు చేస్తారు. రూ.600 ఉన్న వీడియో కెమెరాకు రూ.1900 పెంచి రూ.2500గా నిర్ధారించారు. ఇక మూవీ కెమెరా షూటింగ్ (కమర్షియల్)కు రూ.10 వేలు, టాయ్ ట్రైన్‌కు పెద్దలకు రూ. 80, చిన్నారులకు రూ.40, బ్యాటరీ వెహికిల్ పెద్దలకు రూ.120, చిన్నారులకు రూ. 70, ఒక గంట పాటు తిరిగే 11 సీటర్ల వెహికిల్‌కు రూ.3000, 14 సీటర్ల వెహికిల్స్‌కు 4000, ఏసీ సఫారీ బస్సు ఒకొక్కరికి రూ. 150, నాన్ ఏసీ బస్సు రూ.100 చొప్పున కొత్త రేట్లు ఉండనున్నాయి.
నేవిగేషన్ యాప్‌తో..
అంతేకాకుండా ప్రస్తుతం జూ సందర్శన టికెట్లను ఆన్‌లైన్ ద్వారా ముందస్తుగానే బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. మొబైల్ నేవిగేషన్ యాప్‌తో గైడ్ లేకుండానే జూ పార్కును చుట్టి రావచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని జూ సందర్శనకు వెళితే.. అన్ని ఎన్‌క్లోజర్స్‌తో పాటు ఇతర సమాచారం ఇట్టే మన కళ్ల ముందుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment