
మృతిచెందిన మహమ్మద్ ఒమర్
సాక్షి, హైదరాబాద్ : నెహ్రూ జూపార్కులో విషాదం చోటుచేసుకుంది. బ్యాటరీ వాహనం ఢీ కొనటంతో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జూపార్కు సందర్శించేందుకు విద్యానగర్‌కు చెందిన మహమ్మద్ ఒమర్ అనే రెండు సంవత్సరాల చిన్నారి తల్లిదండ్రులతో కలిసి వచ్చాడు. పార్కులో పర్యటిస్తున్న సమయంలో బ్యాటరీ వాహనం ఒమర్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలైన చిన్నారిని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందాడు. బాలుడి మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ మృతిపై ప్రభుత్వం స్పందించింది. అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా విచారణకు ఆదేశించారు. పీసీసీఎఫ్.. పీకే ఝూ ఈ ఘటనపై విచారణ చేసి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని పీసీసీఎఫ్ పృద్వీరాజ్‌ను నియమించారు.