సాక్షి, న్యూఢిల్లీ : ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకునే రైల్వే టిక్కెట్ల ఛార్జీలు త్వరలోనే తగ్గబోతున్నాయి. ఈ-టిక్కెట్లపై విధించే మర్చంట్ డిస్కౌంట్ రేట్ల(ఎండీఆర్)ను ప్రభుత్వం తీసివేయాలని ప్లాన్ చేస్తోంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా ప్రయాణికులు ఆన్‌లైన్‌గా టిక్కెట్లను బుక్ చేసుకుంటే, ఎండీఆర్ ఛార్జీలు వర్తిస్తాయి. బ్యాంకులు తాము అందించే డెబిట్, క్రెడిట్ కార్డు సర్వీసులకు ఈ ఛార్జీలను విధిస్తున్నాయి. ఎండీఆర్ ఛార్జీలను పరిష్కరించడానికి బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు.
ఒక్కసారి ఎండీఆర్ ఛార్జీలు కనుక ప్రభుత్వం తీసివేస్తే, ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా బుకింగ్ చేసుకునే ప్రయాణికులకు టిక్కెట్ ధరలు ఆటోమేటిక్‌గా పడిపోనున్నాయి. వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్‌లో ఇండియా ఎకానమిక్ సమిట్‌లో మాట్లాడిన గోయల్ ఈ విషయాన్ని తెలిపారు. రైల్వే వ్యవస్థలో 12 నెలల వ్యవధిలోనే మిలియన్ కొద్ది ఉద్యోగాలను సృష్టించనున్నట్టు కూడా పేర్కొన్నారు. టెక్నాలజీని ఎక్కువగా వినియోగించుకుని వృద్ధి పథాన్ని కూడా మార్చనున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment