ఎయిర్ఏషియా డిస్కౌంట్ ఆఫర్ | AirAsia unveils promo fares for one-way domestic trips | Sakshi
Sakshi News home page

ఎయిర్ఏషియా డిస్కౌంట్ ఆఫర్

Published Tue, Jun 28 2016 1:15 AM | Last Updated on Mon, Sep 4 2017 3:33 AM

ఎయిర్ఏషియా డిస్కౌంట్ ఆఫర్

ఎయిర్ఏషియా డిస్కౌంట్ ఆఫర్

చెన్నై: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా తాజాగా టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా దేశీ విమాన టికెట్‌ను (ఒకవైపునకు మాత్రమే) రూ.786 ప్రారంభ ధరతో అందిస్తోంది. ‘ఫ్లై లైక్ ఏ సూపర్‌స్టార్’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ ఆఫర్.. జూలై 3 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. ఆఫర్‌లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్నవారు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 30 వరకు మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని తెలియజేసింది. పలు అంతర్జాతీయ గమ్యస్థానాలకూ ఒకవైపునకు సంబంధించి రూ.2,999 ప్రారంభ ధరతో టికెట్లను ఆఫర్ చేస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ అప్‌కమింగ్ మూవీ ‘కబాలి’ ప్రమోషన్స్‌లో భాగం గా సంస్థ ఈ ఆఫర్‌ను ప్రకటించింది. ఎయిర్‌ఏషియా ఇటీవలే కబాలి సినిమా నిర్మాణ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement